ఎన్టీఆర్ కి కోటిమంది అయిపోయారు..!

jai lavakusa
Spread the love

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవ కుశ’పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆడియో విడుదల, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్లలో ఎన్టీఆర్‌ చెప్పిన మాటలు క్రేజ్‌ పెంచాయి. ఈ చిత్రంలో మూడు పాత్రలకు సంబంధించిన టీజర్లను విడుదల చేసినా అందులో ‘జై’ పాత్ర గురించే అంతా చర్చ. రెండు పాజిటివ్‌ పాత్రలతో ఓ నెగిటివ్‌ క్యారెక్టర్‌ను ఎలా తీర్చిదిద్దారో చూడాలనే ఆతృత అందరిలోనూ పెరిగిపోయింది. అసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసురుడు…, ఘట్టమేదైనా పాత్రేదైనా నేను రె.. రె.. రెడీ’ అంటూ నత్తితో జై పాత్రలో ఎన్టీఆర్‌ తనదైన శైలిలో పలికిన డైలాగ్‌లకు ప్రశంసలు లభిస్తున్నాయి దీనికి సంబంధించిన ట్రైలర్‌ మొన్న ఆదివారం విడుదలైంది. 24 గంటల్లో 7.54 మిలియన్ల డిజిటల్‌ వ్యూస్‌ను సాధించింది. తాజాగా కోటి వ్యూస్‌ను దాటేసింది. అతితక్కువ సమయంలో కోటి వ్యూస్‌ను తమ చిత్రం ట్రైలర్‌ సొంతం చేసుకుందని చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ తెలిపింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ ధన్యవాదాలు చెప్పారు. ”జై లవకుశ’ ట్రైలర్‌కు వచ్చిన స్పందన చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందరికీ ధన్యవాదాలు. గతంలో చెప్పినట్లుగానే.. నా నటనతో మీ అందరూ (అభిమానులు) తృప్తి చెందే విధంగా కష్టపడతా’ అని అన్నారు. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. రాశీ ఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






Related News

anasuya

అనసూయ మెగాహీరోకి మేనత్తనట!

Spread the loveతెలుగు యాంకర్లు ఇప్పుడు ఒకప్పటిలా మాములుగా లేరు. ముఖ్యంగా ఈ మధ్య కొన్ని రియాలిటీ షోల ద్వారాRead More

Premam-Heroine-Sai-Pallavi-Leaked-Images-from-Rain-Songs-in-Telugu-Movie-Fidaa-with-Varun-Tej

ఆ హీరోయిన్ పేరు చెప్పగానే బాబోయ్ అంటున్న హీరో

Spread the loveప్రేమమ్ లో మలర్ పాత్రతో మళయాళంలో… ఫిదా సినిమాలో భానుమతి పాత్రతో తెలుగులో సాయి పల్లవి ప్రేక్షకులనుRead More

  • జేసీ రాజీనామాలో నిజమెంత?
  • బయట కలుద్దామని ఒత్తిడి చేశాడంటున్న హీరోయిన్
  • పీకే ఫిక్సయినట్టే..!
  • రకుల్ ని అలా చూడగానే..!
  • విశాల్ పోరాటం ఫ‌లించేనా?
  • ఎన్టీఆర్ కి కోటిమంది అయిపోయారు..!
  • త్రిష దూకేసింది..!
  • హాట్ బ్యూటీకి మహిళా కమిషన్ షాక్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *