వైసీపీకి భారంగా పార్టీ అధ్యక్షుడు

ysrcp-party-flag-647x450
Spread the love

వైసీపీకి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు విజయమో..వీరస్వర్గమో అన్నట్టుగా మారిపోయాయి. గత సాధారణ ఎన్నికల తర్వాత రాష్ట్రస్థాయిలో ఆసక్తి రేపుతున్న ఎన్నికలు ప్రస్తుతం నంద్యాల, కాకినాడలో జరుగుతున్నాయి. నంద్యాల అసెంబ్లీ ఎన్నికలు, కాకినాడ స్థానిక ఎన్నికలే అయినప్పటికీ రెండూ ప్రాధాన్యతతో కూడుకున్నవే అన్నట్టుగా మారిపోయాయి. సరిగ్గా అలాంటి సమయంలో వైసీపీకి ఆపార్టీ అధ్యక్షుడే భారంగా మారడం విచిత్రంగా మారింది. కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు తీరు ఆపార్టీ ఓట్లకు కన్నం వేస్తుందనే వాదన వినిపిస్తోంది.

jagan-kurasala-kannababu

2009 ఎన్నికల్లో పీఆర్పీతో కన్నబాబు రాజకీయ ప్రవేశం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి వెంట కాంగ్రెస్ లో చేరి, గడిచిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. మంచి ఓట్లు సాధించినా మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఏడాదిన్నర క్రితం వైసీపీలో చేరినప్పటికీ, జ్యోతుల నెహ్రూ పార్టీ ఫిరాయించడంతో హఠాత్తుగా జిల్లా పార్టీ అధ్యక్ష పదవి దక్కించుకున్నారు. కాపు కోటాలో పీఠం దక్కించుకున్నా జిల్లాలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దడంలో సమర్థత చాటలేకపోతున్నారు. చివరకు కార్పోరేషన్ ఎన్నికల్లో ఆయనే భారంగా మారుతున్నట్టు కనిపిస్తోంది.

కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి. ఓవైపు టీడీపీలో తీవ్ర విబేధాలు సాగుతున్నాయి. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కనిపిస్తోంది. దానిని సొమ్ము చేసుకోవడానికి తగ్గట్టుగా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన కన్నబాబు సొంత ప్రయోజనాలు తప్ప పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తున్నట్టు కనిపించడం లేదు. కాకినాడ కార్పోరేషన్ పరిధిలో కన్నబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ కి సంబంధించి 6 డివిజన్లున్నాయి. వాటికి అభ్యర్థుల ఎంపికలో కన్నబాబు పూర్తిగా కాపులకే అవకాశం ఇవ్వడం ద్వారా ఇతర వర్గాలను చిన్నచూపు చూస్తున్నారన్న అభిప్రాయం కల్పించారు. అదే సమయంలో నగరంలో ద్వారంపూడి, ముత్తా మధ్య విబేధాలను సమర్థవంతంగా చక్కదిద్దాల్సిన సమయంలో ద్వారంపూడికి వ్యతిరేకంగా ముత్తా వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ వివాదం రాజేస్తున్నారా అన్న అభిప్రాయం కలుగుతోంది.

ఓవైపు విజయసాయిరెడ్డి, ధర్మాన వంటి వారు కాకినాడలో పాగా వేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్న సమయంలో కన్నబాబు మాత్రం ఆ ప్రయత్నాలకు ఆటంకం కలిగించేలా వ్యవహరించడమే ఆసక్తి కలిగిస్తోంది. దాంతో కన్నబాబు తీరు పార్టీకి ఎంత ప్రయోజనం అనే దానికన్నా తనకు ఏమేరకు ఉపయోగం అన్న మేరకు కనిపిస్తోందని చాలామంది అంచనా వేస్తున్నారు. దాంతో కన్నబాబుని జిల్లా అధ్యక్షుడే అయినప్పటికీ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆయన నియోజకవర్గానికే పరిమితం చేయడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోందని వినికిడి. ద్వారంపూడి కూడా అదే కోరుకుంటున్నారని సమాచారం. ఏమైనా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అందరికోసం కాకుండా తన వర్గానికే అన్నట్టుగా వ్యవహరించడమే చర్చనీయాంశం.


Related News

thota trimurthulu

ఏపార్టీ అయినా సరే అంటున్న తోట మాటల్లో ఏముందో?

Spread the loveతోట త్రిమూర్తులు. ఓ సంచలన రాజకీయ నాయకుడు. సామాన్య వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం తూర్పు గోదావరిRead More

ysrcp

కష్టాలు కొనితెచ్చుకుంటున్న వైసీపీ

Spread the loveఏపీ రాజకీయాల్లో ప్రతిపక్షం పరిస్థితి అంత సవ్యంగా కనిపించడం లేదు. నిత్యం జారిపోతున్న నేతలతో కష్టాల సుడిగుండంలోనేRead More

 • యనమల అవుట్..
 • 22వ వికెట్ పడింది…
 • సంక్షోభంలో టీడీపీ
 • వైసీపీది తప్పే…
 • టీడీపీ ఎమ్మెల్యేల కొట్లాట
 • ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు
 • గోదారోళ్లకు చంద్రబాబు ద్రోహం చేశారా
 • పశ్చిమలో టీడీపీకి ఎదురుదెబ్బ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *