Main Menu

జ‌గ‌న్ రూట్ మారింది..!

Spread the love

వైఎస్సార్సీపీ అథినేత వ్యూహం మార్చేశారు. ఇన్నాళ్లుగా ఆచితూచి అడుగులేసిన వైఎస్ జ‌గ‌న్ ఇప్పుడు గేరు మార్చేశారు. ఏపీ ప్ర‌భుత్వం మీద దాడి చేయ‌డానికి ఎన్న‌డూ వెన‌క‌డుగు వేయ‌లేదు గానీ ఇప్పుడు ప్ర‌త్యామ్నాయం చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. తానైతే ఏం చేస్తానో చెప్పి జ‌నాల‌ను ఆక‌ట్టుకోవాల‌ని చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే 2014 ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు అవ‌లంభించిన ధోర‌ణిని ఇప్పుడు జ‌గ‌న్ పాటిస్తున్నారు. అడిగిన‌వాళ్ల‌కు కాద‌నకుండా వ‌రాలు ప్ర‌క‌టిస్తున్నారు. ఇంకొన్ని వ‌రాల‌ను తానే అడిగించి స్ప‌ష్టం చేస్తున్నారు. తాజాగా కొత్త జిల్లాల అంశాన్ని నంద్యాల బ‌హిరంగ‌స‌భ‌లో శిల్పా మోహ‌న్ రెడ్డితో జిల్లా కేంద్రం గురించి ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డం అలాంటి వ్యూహాల్లో భాగ‌మే అన‌డంలో సందేహం లేదు.

ఇక ఈ స‌భ నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో పాల‌క పార్టీని బెంబేలెత్తించ‌డం ఖాయం. భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చిన జ‌న‌సందేహోన్ని గ‌మ‌నిస్తే వైసీపీకి ఊపు వ‌చ్చింద‌న‌డంలో సందేహం లేదు. కానీ అధికార పార్టీ అభ్య‌ర్థి నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి 10వేల మంది వ‌స్తేనే ఉప్పొంగిపోయిన స‌మ‌యంలో ఎన్ని వేల మంది అనే అంచ‌నాల‌కు కూడా అంద‌నంత స్థాయిలో ఎస్పీజీ గ్రౌండ్ నిండిపోవ‌డం ఎన్నిక‌ల ప్ర‌చారంలో తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక దానిని మించి జ‌గ‌న్ తీరు అంద‌రినీ ఆక‌ట్టుకునేలా క‌నిపిస్తోంది. స్ప‌ష్ట‌మైన విధానాలు, ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌క‌ట‌న‌లు, ఓట్ల పంట పండించ‌డానికి త‌గ్గ‌ట్టుగా హామీలు, ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని ఎండ‌గ‌ట్టే తీరులు అన్నీ క‌లిసి విప‌క్ష నేత‌కు కొత్త ఇమేజ్ క‌ల్పిస్తాయ‌న‌డంలో సందేహం లేదు. ఇన్నాళ్లుగా విప‌క్ష నేత‌గా జ‌గ‌న్ తీరు మీద అంతో ఇంతో సందేహంతో ఉన్న వ‌ర్గాల అనుమానాల‌న్నీ ప‌టాపంచ‌లు చేసేలా జ‌గ‌న్ తీరు ఉంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ గెల‌వాల్సిన అవ‌స‌రాన్ని గుర్తిస్తూ సామాజిక‌వ‌ర్గాల వారీగా ఆయ‌న చేసిన కామెంట్స్ ఖ‌చ్చితంగా ఆక‌ట్టుకుంటాయ‌ని స‌భ‌లో పాల్గొన్న వారు చెప్పుకోవ‌డం విశేషం. వ‌చ్చే ఏడాది నంద్యాల‌కు చెందిన మైనార్టీని ఎమ్మెల్సీ చేస్తాన‌ని ప్ర‌క‌టించి ఆ వ‌ర్గాన్ని మ‌రింత ద‌గ్గ‌ర చేసుకున్నారు. నంద్యాల‌ను జిల్లా కేంద్రం చేస్తాన‌ని చెప్ప‌డం ద్వారా సామాన్యుల‌కు చేర‌వ‌య్యారు. అదే స‌మ‌యంలో కాపుల రిజ‌ర్వేష‌న్ల‌ను చంద్ర‌బాబు మోసం చేశార‌ని చెబుతూనే దానిని పూర్తిగా ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కానీ వైశ్యుల‌కు మాత్రం ఓ కార్పోరేష‌న్ ప్ర‌క‌టించ‌డం ద్వారా ఆక‌ట్టుకున్నారు. రోడ్డు విస్త‌ర‌ణ న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌డ‌మే కాకుండా, కేశ‌వ‌రెడ్డి అగ్రిగోల్డ్ బాధితుల న‌ష్ట‌ప‌రిహారం చెల్లింపు మూడు నెల‌ల్లోనే అంటూ స్ప‌ష్టం చేయ‌డం విశేష‌మే. ఇలా ప‌లు హామీల‌ను ప‌గ‌డ్భందీగా చెప్ప‌డం ద్వారా చేరాల్సిన వ‌ర్గాల‌కు మ‌రింత‌గా ఆకట్టుకునే వ్యూహం క‌నిపించింది. అదే స‌మ‌యంలో ప్ర‌సంగంలో కూడా హిందూ, ముస్లీం ల‌కు సంబంధించిన అంశాల‌ను జోడించ‌డం, గ‌తంలో వైఎస్ చెప్పిన పిట్ట క‌థ‌ల‌ను గుర్తు చేయ‌డం ద్వారా పూర్తిస్థాయి ఎన్నిక‌ల ప్ర‌చారానికి త‌గ్గ‌ట్టుగా జ‌గ‌న్ ప్ర‌సంగం ఉంద‌నే అభిప్రాయం వినిపించింది.

ఇక శిల్పా చ‌క్ర‌పాణిని ఎమ్మెల్యే చేస్తాన‌న‌డం రాజ‌గోపాల్ రెడ్డిని సీఎం కాగానే అదుకుంటాన‌ని చెప్ప‌డం ఇలా వ్య‌క్తులకు సంబంధించి కూడా స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం ద్వారా అన్ని వ‌ర్గాల‌ను ఏకం చేసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే వాటి ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న‌ది ప‌క్క‌న పెడితే త‌న‌ను న‌మ్మిన వారికి న‌ష్టం క‌ల‌గ‌కుండా చూస్తాన‌నే భ‌రోసా క‌లిగించే ప్ర‌య‌త్నం చేయ‌డం విశేషం. త‌ద్వారా ఆయా వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా సాగిన‌ట్టు క‌నిపించింది. మొత్తంగా జ‌గ‌న్ లో వ‌చ్చిన మార్పు, నంద్యాల స‌భ‌లో స్ప‌ష్ట‌మ‌య్యింది. ప‌లు త‌ర‌గ‌తుల‌ను ఆక‌ట్టుకోవ‌డం ఖాయంగా ఉంది.


Related News

హ‌ర్ష‌కుమార్ కి అలా… స‌బ్బం హ‌రికి ఇలా!

Spread the loveతెలుగుదేశం పార్టీ అధినేత అనూహ్య నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఏకంగా కాళ్లు మొక్కిన నేత‌ల‌ను కూడా క‌నిక‌రించ‌లేదు. జ‌గ‌న్Read More

మ‌ళ్లీ గోదారోడే..!

Spread the loveగోదారోళ్లంటే అనురాగాల‌కు, అప్యాయ‌త‌ల‌కు పేరు అని చెబుతారు. ఆతిథ్యానికి పెట్టింది పేరుగా క‌నిపిస్తారు. హాస్యానికి, వ్యంగ్యానికి కేరాఫ్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *