కష్టాలు కొనితెచ్చుకుంటున్న వైసీపీ

ysrcp
Spread the love

ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్షం పరిస్థితి అంత సవ్యంగా కనిపించడం లేదు. నిత్యం జారిపోతున్న నేతలతో కష్టాల సుడిగుండంలోనే సాగుతోంది. అలాంటి సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన వైసీపీ అధిష్టానం కోరి కష్టాలు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా అసలే అంతంతమాత్రంగా ఉన్న ప్రాంతాల్లో మరింత పగడ్భందీగా వ్యవహరించాల్సి ఉన్నా దానికి భిన్నంగా వెళుతోంది. దాంతో గోదావరి జిల్లాల్లో వైసీపీ కష్టాలు పెరుగుతున్నాయి. పార్టీ శ్రేణుల్లో గందరగోళం కనిిపస్తోంది.

ఉభయ గోదావరి జిల్లాలకు కలిపి 34 అసెంబ్లీ సీట్లున్నాయి. అందులో కేవలం 5 స్థానాలను మాత్రమే వైసీపీ గెలిచింది. అవి కూడా తూర్పునే కావడం విశేషం. పశ్చిమలో బోణీ కూడా కొట్టలేక జగన్ సేన చతికిలపడడం తెలిసిందే. అలాంటి చోట్ల అత్యంత జాగూరుకతతో వ్యవహరించాల్సిన వైసీపీ వచ్చిన అవకాశాలను కూడా చేజార్చుకుంటోంది. దానికి ఒక ఉదాహరణ రాజమహేంద్రవరంలో ఆపార్టీ పరిస్థితిలో వచ్చిన మార్పు. మొన్నటి ఎన్నికల తర్వత పలువురు సీనియర్ నేతలు వైసీపీ లో చేరడంతో రాజమహేంద్రవరం వైసీపీలో కొంత కదలిక వచ్చింది. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. కానీ అంతలోనే పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో చతికిలపడక తప్పదా అనే సందేహం కలుగుతోంది.

kandula durgesh

ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ వ్యవహారం దానికి కారణంగా చెప్పవచ్చు. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఎంపీగా పోటీ చేసిన ఆయనకు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ బంధుత్వం, సన్నిహితులు ఉన్నారు. రెండు జిల్లాల్లోనూ ఆయన చేరిక ద్వారా వైసీపీకి కొంత ప్రయోజనం దక్కింది. అదే సమయంలో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టున్న నేపథ్యంలో పార్టీ గాడిన పడడం ఖాయమనే వాదన వినిపించింది. సిటీ సీటును బీసీ కోటాలో రౌతు సూర్య ప్రకాశ్ రావుకి కేటాయించడమే కాకుండా, ఆయనకు సన్నిహిత మిత్రుడైన కందుల దుర్గేష్ ని రూరల్ లో రంగంలో దింపితే ఇద్దరు మిత్రులు కలిసి విజ్రుంభించే అవకాశం ఉందని భావించారు. కానీ అంతలోనే సీన్ మారిపోయింది. పార్టీ బాధ్యతలు తీసుకోగానే సమస్యల మీద ఉద్యమాలు చేస్తూ ప్రజల్లో సాగుతున్న దుర్గేష్ దూకుడుకి బ్రేకులు పడ్డాయి. తొలుత గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడిగా ప్రకటించి, రూరల్ బాధ్యతలు కూడా ఆయన చూసేలా నిర్ణయించిన నేతలు ఆతర్వాత కేవలం నగరానికే మాత్రమే దుర్గేష్ ని పరిమితం కావాలని ఆదేశించడం వైసీపీలో కలకలం రేపుతోంది.

ప్రస్తుతం దుర్గేష్ తన పరిస్థితిపై కలవరపడుతున్నారు. పార్టీలో తనకు అన్యాయం జరుగుతుందా అని అనుమానిస్తున్నారు. నగర అధ్యక్ష పదవి అనకు అవసరం లేదని చెప్పేశారు. రూరల్ నుంచి తనను తొలగించి, సిటీలో తనకూ, రౌతుకి మధ్య తగాదా పెట్టాలనే ప్రయత్నం సాగుతున్నట్టు ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తోంది. దాంతో దుర్గేష్ రాకతో కళకళలాడిన రాజమహేంద్రవరం రూరల్ వైసీపీలో మళ్లీ ఉత్సాహం నీరుగారిపోవాల్సిందేనా అని ఆపార్టీ కార్యకర్తలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో పరాజయం పాలయిన ఆకుల వీర్రాజు లాంటి వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు జరుగుుతన్న ప్రచారం పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. పార్టీ శ్రేణులను నిరుత్సాహపరుస్తోంది.కందుల దుర్గేష్ పక్కచూపులు చూడాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఆపార్టీ మరింత కుదేలు కావడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది.






Related News

Congress_4729

వైసీపీకి చేతగానిది..కాంగ్రెస్ చేస్తోంది..

Spread the loveపోలవరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసింది. నిత్యం ఆందోళనలతో మీడియాలోRead More

TDP WEST PEETALA

టీడీపీలో చిచ్చుపెట్టిన జన్మభూమి

Spread the loveతెలుగుదేశంలో ఒక సామాజికవర్గం పెత్తనం గురించి చాలాకాలంగా ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే పరిస్థితులున్నాయి. చివరకు రిజర్వుడుRead More

 • బాబు మాటలతో ఎమ్మెల్యేల బేజారు
 • తెలుగుదేశం ‘తోట’లో న్యాయం లేదు…!
 • ఎమ్మెల్యేని పరుగులు పెట్టించిన జనం
 • చినరాజప్ప సీటు మారుతోంది…
 • తారస్థాయిలో టీడీపీ తగాదా
 • ఏపార్టీ అయినా సరే అంటున్న తోట మాటల్లో ఏముందో?
 • కష్టాలు కొనితెచ్చుకుంటున్న వైసీపీ
 • యనమల అవుట్..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *