Main Menu

జ‌న‌సేనాని వెళ్ల‌గానే జ‌గ‌న్ సేన‌ ఎంట్రీ

Spread the love

ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన గోదావ‌రి జిల్లాల‌పై అంద‌రి దృష్టి ఉంటుంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే జ‌న‌సేనాని ప్ర‌త్యేకంగా కేంద్రీక‌రించారు. ఏకంగా రెండున్న‌ర నెల‌ల పాటు రెండు గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌లు సాగిస్తున్నారు. ఈనెలాఖ‌రుతో తూర్పు గోదావ‌రి టూర్ ముగుస్తోంది. అనంత‌రం రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం ప‌య‌న‌మ‌వుతున్నారు. రెండో తేదీ నుంచి క‌రువుపై క‌వ‌తాకి సిద్ధ‌మ‌వుతున్నారు.

అదే స‌మ‌యంలో ఈనెల 29న ప‌వ‌న్ క‌ళ్యాణ్ తూర్పు గోదావ‌రి ప‌ర్య‌ట‌న ముగుస్తుండ‌గా 30 నుంచి వైసీపీ ఎంట్రీ ఇస్తోంది. వంచ‌న‌పై గ‌ర్జ‌న పేరుతో కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుడుతోంది. ఆపార్టీ నేత‌లంతా క‌లిసి కాకినాడ‌లో కార్య‌క్ర‌మానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో అవినీతి, అక్ర‌మాలు స‌హా వివిధ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు సన్న‌ద్ధ‌మ‌వుతోంది.

అదే స‌మ‌యంలో తూర్పు ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ ప్ర‌ధానంగా జ‌గ‌న్ మీద విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. చంద్ర‌బాబు క‌న్నా జ‌గ‌న్ మీదే వాగ్భాణాలు సంధించ‌డం విశేషంగా మారింది. ఈ నేప‌థ్యంలో వైసీపీ నేత‌లు ఏ రీతిలో స్పందిస్తార‌న్న‌ది చర్చ‌నీయాంశం అవుతోంది. గోదావ‌రి జిల్లాల్లో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్క‌డం ఖాయంగా మారింది. ఈ రెండు పార్టీల సంద‌డి పూర్తికాగానే బీసీ గ‌ర్జ‌న పేరుతో టీడీపీ భారీ బ‌హిరంగ‌స‌భ‌కు స‌న్నాహాలు చేస్తోంది






Related News

చింత‌మ‌నేని వీడియో: మార్ఫింగ్ ఎక్క‌డా?

Spread the loveదెందులూరు ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని మాట‌లు మంట‌లు రేపాయి. చంద్ర‌బాబు స‌ర్కారుని చిక్కుల్లో నెట్టాయి. ఎస్సీలRead More

బాబుకి త‌ల‌నొప్పిగా మారిన నోటిదురుసు ఎమ్మెల్యే

Spread the loveఏపీ ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ వ్య‌వ‌హారం నిత్యం సంచ‌ల‌నంగానే ఉంటుంది. ఆయ‌న నోరు, చేత‌లు కూడాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *