వైసీపీకి ఎదురుదెబ్బ‌..!

1736_ysrcp
Spread the love

వైసీపీకి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆపార్టీలో మ‌రో వికెట్ రాలింది. జిల్లాలో ఇప్ప‌టికే ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌ను చేజార్చుకున్న వైసీపీకి తాజాగా మ‌రో నేత‌ను దూరం చేసుకుంది. ఆయ‌న కూడా టీడీపీలో చేర‌డానికి ముహూర్తం పెట్టుకున్నారు. దాంతో అస‌లే గ‌డిచిన ఎన్నిక‌ల్లో దెబ్బ‌తిన్న గోదావ‌రి జిల్లాల్లో కోలుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న స‌మ‌యంలో ఇది వైసీపీకి న‌ష్ట‌మేన‌నే అభిప్రాయం వినిపిస్తోంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున బ‌రిలో దిగిన ఆపార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి గుత్తుల సాయి వైసీపీకి రాజీనామా చేశారు. ఈనెల 14న తాను టీడీపీలో చేర‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దాంతో తూర్పు గోదావ‌రి జిల్లా ముమ్మిడివ‌రంలో జ‌గ‌న్ పార్టీకి ఇది ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.

గ‌త ఎన్నిక‌ల్లో ముమ్మిడివ‌రం నుంచి బ‌రిలో దిగిన గుత్తుల సాయి అప్పట్లో టీడీపీ అభ్య‌ర్థి దాట్ల బుచ్చిబాబు చేతిలో భారీ తేడాతో ఓట‌మి పాల‌య్యారు. అంత‌కుముందు ఆయ‌న 2009లో పీఆర్పీ నుంచి పి గ‌న్న‌వ‌రం సీటులో పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు, వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో ఎదురుదెబ్బ‌లు త‌గ‌ల‌డంతో ఆయ‌న ఆర్థికంగానూ ఇబ్బంది ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. దాంతో కొన్నాళ్లుగా వైసీపీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే నియోజ‌క‌వ‌ర్గ ఇన్ఛార్జ్ లుగా పితాని బాల‌కృష్ణ అనే మ‌రో కొత్త నేత‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దాంతో ఖంగుతిన్న గుత్తుల సాయి మ‌రింత నిరాశ‌లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ మార‌డానికి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

అయితే గోదావ‌రి జిల్లాల్లో ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గాల్లో ఒక‌టైన శెట్టిబ‌లిజ‌ల్లో వైసీపీకి గుత్తుల సాయి గుర్తింపు ఉన్న నాయ‌కుడే. ఆయ‌న దూరం కావ‌డం జ‌గ‌న్ కి కొంత న‌ష్ట‌మే. అదే స‌మ‌యంలో జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో శెట్టిబ‌లిజ‌ల‌కు మూడు స్థానాలు కేటాయించిన జ‌గ‌న్ ఈసారి ఆ ప్రాధాన్య‌త ఇచ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. రూర‌ల్ సీటును చెల్లుబోయిన వేణు స్థానంలో కుర‌సాల క‌న్న‌బాబుకి దాదాపు ఖాయంగా ఉంది. ఆ త‌ర్వాత రామ‌చంద్రాపురం నుంచి పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్ర‌బాబు స్థానంలో కొత్త వ్య‌క్తిని గానీ, బోసు త‌న‌యుడిని గానీ బ‌రిలో దింపుతార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇక ముమ్మిడివ‌రం సీటును మ‌త్స్య‌కార వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కి అప్ప‌గించ‌చే అవ‌కాశ‌లు మెరుగ్గా ఉన్నాయి. ప్ర‌స్తుతం స‌తీష్ ఏ పార్టీలోనూ లేరు. త్వ‌ర‌లో వైసీపీలో చేరి ముమ్మిడివ‌రం బాధ్య‌త‌లు స్వీక‌రించ‌వ‌చ్చ‌ని స‌మాచారం. దాంతో శెట్టిబ‌లిజ ప్రాధాన్యం త‌గ్గిపోతోంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి.






Related News

kakinada

టీడీపీ ఆఖరి ఆశలు గల్లంతు

Spread the loveపరిస్థితులు అనుకూలించకపోతే తాడే పామై కరుస్తుందన్న చందంగా మారింది. తాజాగా కోర్టు తీర్పులు కూడా తెలుగుదేశం పార్టీకిRead More

ysrcp-party-flag-647x450

వైసీపీకి భారంగా పార్టీ అధ్యక్షుడు

Spread the loveవైసీపీకి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు విజయమో..వీరస్వర్గమో అన్నట్టుగా మారిపోయాయి. గత సాధారణ ఎన్నికల తర్వాత రాష్ట్రస్థాయిలో ఆసక్తిRead More

 • మంత్రిగారి సెప‌రేట్ స్వ‌తంత్ర్య‌దినోత్స‌వం ..!
 • సినిమా ఛాన్స్ ఆశ చూపి దర్శకుడి అత్యాచారం
 • కాపు చైర్మ‌న్ కి అవ‌మానం: తోట లేట్ ఎంట్రీ..!
 • వైసీపీకి ఎదురుదెబ్బ‌..!
 • టీడీపీలో గుబులు రేపిన తోట‌
 • వాళ్లిద్ద‌రికీ టికెట్ లేద‌ని చెప్పిన చంద్ర‌బాబు..!
 • కాకినాడ ఎన్నిక‌లు: ఎవ‌రి బ‌లం ఎంత‌?
 • ఏపీలో మ‌రో ఎన్నిక‌లు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *