వైసీపీపై అలిగిన మాజీ మంత్రి

Viswaroop pinipe
Spread the love

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తన పార్టీపై అలకబూనారు. దాంతో కోనసీమలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. త్వరలో ఆయన సైకిలెక్కేసే ఆలోచనలో ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. వైసీపీలో పరిణామాల పట్ల విరక్తి చెందిన ఆయన పక్క చూపులు చూస్తున్నారనే వాదన వినిపిస్తోంది. టీడీపీలో లైన్ క్లియర్ అయితే గోడదూకినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెబుతున్నారు.

పినిపే విశ్వరూప్ గతంలో వైఎస్ క్యాబినెట్ లో మంత్రి. గడిచిన ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎంపీగా పోటీ చేశారు. అమలాపురం స్థానం నుంచి ఎమ్మెల్యేగా రంగంలో దిగాలని ఆయన ఆశించినా అధినేత జగన్ ఆదేశాల మేరకు ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం మీద కేంద్రీకరించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి అసెంబ్లీకి రంగంలో ఉండాలని ఆశిస్తున్నారు. ఈలోగా వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా అమలాపురానికి చెందిన బాల మునికుమారి అనే నాయకురాలికి పగ్గాలు అప్పగించడం విశ్వరూప్ అసంత్రుప్తికి కారణంగా చెబుతున్నారు. కానీ అంతకుమించిన కారణాలు కూడా ఉంటాయనే అభిప్రాయం ఉంది. దాంతో అలిగిన విశ్వరూప్ అనేక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా వాక్ విత్ జగనన్న అనే కార్యక్రమంలో ఆయన చురుగ్గా పాల్గొనన దాఖలాలు లేవు. ఆయన వర్గీయులు కూడా అంటీముట్టనట్టే వ్యవహరించడం విశేషం.

అదే సమయంలో టీడీపీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మీద ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉండడంతో ప్రత్యామ్నాయం కోసం చూస్తోంది. ఇదే అదునుగా విశ్వరూప్ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే డిప్యూటీ సీఎం చినరాజప్ప నుంచి సానుకూల సంకేతాలు రావడంతో విశ్వరూప్ ఊగిసలాటలో కనిపిస్తున్నారు. ఏం జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని విశ్వరూప్ వర్గీయులు చెబుతుండడం గమనార్హం.


Related News

maddala sunita in ycp

వైసీపీలోకి మరో మాజీ ఎమ్మెల్యే

Spread the loveఇటీవల పలువురు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి క్యూ కడుతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పలువురు నేతలు వైసీపీRead More

East_Godavari_district

తూర్పున మరో తగాదా

Spread the loveతూర్పు గోదావరి జిల్లా వ్యవహారాల్లో మరో తగాదా తెరమీదకు వచ్చింది. చాలాకాలంగా పెద్దాపురంలో చాపకింద నీరులా ఉన్నRead More

 • చిక్కులు కొనితెచ్చుకున్న చినరాజప్ప
 • జగన్ కి కొత్త సమస్యలు షురూ
 • ప‌శ్చిమ టీడీపీలో చిచ్చు ..
 • రాధాకృష్ణ‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చిన బిరుదు…!
 • చిన‌రాజ‌ప్ప‌కి స్కెచ్ వేస్తున్న సొంత పార్టీ
 • జ‌గ‌న్ కి జై కొట్టిన మ‌రో సినీ న‌టుడు
 • కీల‌క ప్రాంతంలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి
 • టీడీపీకి జ‌న‌సేన షాక్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *