Main Menu

వైసీపీకి చేతగానిది..కాంగ్రెస్ చేస్తోంది..

Congress_4729
Spread the love

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసింది. నిత్యం ఆందోళనలతో మీడియాలో కనిపించే రఘువీరారెడ్డి చొరవతో పాదయాత్రకు శ్రీకారం పడింది. పోలవరం ప్రాజెక్ట్ పేరుతో నాలుగు రోజుల కార్యక్రమం సాగిస్తోంది. ప్రజలు కూడా కొంత హర్షించి, స్పందించే కార్యక్రమంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ శ్రేణులన్నీ కదిలి, విజయవంతం చేయడానికి ప్రయత్నించడంతో కొంత కాంగ్రెస్ పతాకాలు పైకి లేచాయనే చెప్పవచ్చు. రఘువీరా, కేవీపీ వంటి వారు ముందుకు నడవగా, కాంగ్రెస్ కార్యకర్తలు అడుగులు కదపడంలో పోలవరం నినాదం ప్రస్ఫుటించింది. ఈ సందర్భంగానే ఉండవల్లి, హర్షకుమార్ మళ్లీ కాంగ్రెస్ వేదిక మీద కనిపించడం విశేషంగా మారింది.

అయితే ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పార్టీ పోలవరం కోసం పోరాటానికి శ్రీకారం చుడితే, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతుంటే విపక్షం మాత్రం చేతులు కట్టుకుని నిలబడడం విస్మయకరంగా మారింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ చేయలేని పనిని కాంగ్రెస్ చేస్తుందనే చర్చ మొదలయ్యింది. ఉద్యమాలకు దూరంగా, కేవలం ఓ మారు పార్టీ నేతలంతా పర్యటించి చేతులు దులుపుకున్న వైసీపీ వైఫల్యం స్పష్టంగా బయటపడుతోంది. పనులు జరగడం లేదని, చేసిన పనులకు అదనంగా వసూలు చేసుకుంటున్నారని, కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించారని ఇలాంటి అనేక అంశాలను ఉండవల్లి వంటి వాళ్లు అదే పనిగా పైకి తెచ్చినా దానిని అందిపుచ్చుకోవడంంలో వైసీపీ చేతగానితనం కనిపిస్తోంది. ముఖ్యంగా అధినేత ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న సమయంలో గోదావరి జిల్లాల నేతలంతా కలిసి ఉమ్మడిగా కార్యాచరణకు సిద్ధం కావాల్సిన అంశంలో అవకాశాలను చేజార్చుకున్నట్టు స్పష్టమవుతోంది.

అందులోనూ రాష్ట్రమంతటా ప్రభావితం చేసే అంశం, చంద్రబాబు చేతిగానితనాన్ని స్పష్టంగా బయటపెట్టే విషయం. అయినా వైసీపీ నేతల్లో కదలిక లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ దానిని అవకాశంగా మలచుకుంది. ఉద్యమం చేస్తూ, పోలవరం ప్రాజెక్ట్ తమ ఘనతేనని చెప్పడానికి ప్రయత్నించింది. తద్వారా అటు అధికార, ఇటు ప్రధాన ప్రతిపక్షాలను నిలదీసినట్టుగా కనిపిస్తోంది


Related News

jakkampudi

జ‌గ‌న్ మీద వారి కోపం ఎందుకు?

Spread the loveజ‌గ‌న్ కుటుంబంతో వారిది అన్యోన్య బంధం. అంది కూడా దివంగ‌త నేత‌ల వార‌స‌త్వం కావ‌డం విశేషం. అందుకుRead More

Vijayawada-huge-crowd-welcomes-to-YS-Jagan-padayatra-696x411

రాజమండ్రి వంతెన కథలో అసలు విషయమదే

Spread the loveఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా ప్రజాసంకల్ప పాదయాత్రతో వాడవాడలా సాగుతున్నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *