యనమల అవుట్..

1469715831.yanamala-ramakrishnudu-31
Spread the love

తెలుగుదేశం పార్టీ తీరు మారుతోంది. కొత్త తరం తెరమీదకు వస్తోంది. అందులో భాగంగా నారా చంద్రబాబు స్థానంలో చినబాబు పెత్తనం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే పరిణామాలున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత యనమల రామక్రుష్ణుడి రూటు మారుతుందన్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి యనమల చాలాకాలంగా ఆశిస్తున్నట్టుగానే ఆయనకు రాజ్యసభ బెర్త్ కేటాయించబోతున్నారన్న ప్రచారం విస్త్రుతంగా ఉంది. ఆయన స్థానంలో యనమల కుటుంబం నుంచి ఒకరు రంగంలోకి వస్తారని భావిస్తున్నారు.

యనమల టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. ఓ సాధారణ ప్లీడర్ ను పార్టీలోకి పిలిచి టికెట్ ఇచ్చి వెనుకబడిన సామాజికవర్గానికి చెందిన నేతను ఉన్నతస్థానంలో నిలిపిన ఘనత ఎన్టీఆర్ ది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ ని పదవీచ్యుతుడిని చేయడంలో చంద్రబాబుతో చేతులు కలిపి ఆ నాటి స్పీకర్ గా యనమల వ్యవహరించిన తీరు మీద నేటికీ విమర్శలున్నాయి. అయితే చంద్రబాబుతో యనమల సాన్నిహిత్యం మాత్రం బాగా బలపడింది. దాని ఫలితంగానే చంద్రబాబు సర్కారు పాలనలో ఉంటే ఆర్థిక వ్యవహారాలు యనమలవే. శాసనసభా నిర్వహణలో అవగాహన ఉన్న నాయకుడిగా వాటిలోనూ యనమలదే కీలకపాత్ర.

కొన్నాళ్లుగా యనమల కన్ను కేంద్ర రాజకీయాల మీద పడింది. కేంద్రంలో కొందరు యాదవ్ పెద్దలు చక్రం తిప్పుతున్న నేపథ్యంలో తాను కూడా హస్తిన వెళితే అవకాశాలు మెరుగుపడతాయనే అంచనాలో ఆయనలో ఉన్నట్టు చెబుతారు. కానీ 1983నుంచి అటు శాసనసభలోనూ, ప్రస్తుతం మండలిలోనూ సభ్యుడిగా ఉన్న ఆయనకు పార్లమెంట్ మీద మోజు కలగడంలో పెద్ద విశేషం లేదు. అదే సమయంలో యనమల, నారా లోకేష్ మధ్య పలు విషయాల్లో విబేధాలున్న మాట కాదనలేని సత్యం. దాంతో ఇరువురిని సంత్రుప్తి పరచడంలో భాగంగా యనమలను రాజ్యసభకు పంపిస్తే ఆయన కోరిక తీరడమే కాకుండా, లోకేష్ తో అడ్డంకులు తొలగుతాయన్నది పరిశీలకుల భావన. దానికి అనుగుణంగానే ప్రస్తుతం చంద్రబాబు వచ్చే ఏడాది జరిగే రాజ్యసభ ఎన్నికల్లో యనమలకు బెర్త్ కేటాయించే దిశగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది.

ఆయన వారసురాలిగా వచ్చే ఎన్నికల్లో తుని నుంచి యనమల కూతురు రంగంలో ఉంటారనే వాదన ఉంది. ప్రస్తుతం అక్కడి నుంచి వైసీపీ తరుపున దాడిశెట్టి రాజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యనమల సోదరుడు యనమల క్రుష్ణుడు వల్ల రాజాని అడ్డుకోవడం సాధ్యం కాదనే ప్రచారం ఉంది. దాంతో తన కుమారుడు శివరామక్రుష్ణన్ కోసం యనమల క్రుష్ణుడు ప్రయత్నిస్తున్నారు. కానీ యనమల మాత్రం తన కుమార్తెను రంగంలో దించాలని ఆశిస్తున్నట్టు సాగుతున్న ప్రచారం యనమల బ్రదర్స్ మధ్య కొత్త వివాదం రాజేసినా ఆశ్చర్యం లేదు. మొత్తంగా యనమల ను ఏపీ క్యాబినెట్ నుంచి పంపిస్తే జరిగే పరిణామాలు తునిలో తీవ్రంగా ఉంటాయని చెప్పక తప్పదు.


Related News

Congress_4729

వైసీపీకి చేతగానిది..కాంగ్రెస్ చేస్తోంది..

Spread the loveపోలవరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసింది. నిత్యం ఆందోళనలతో మీడియాలోRead More

TDP WEST PEETALA

టీడీపీలో చిచ్చుపెట్టిన జన్మభూమి

Spread the loveతెలుగుదేశంలో ఒక సామాజికవర్గం పెత్తనం గురించి చాలాకాలంగా ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే పరిస్థితులున్నాయి. చివరకు రిజర్వుడుRead More

 • బాబు మాటలతో ఎమ్మెల్యేల బేజారు
 • తెలుగుదేశం ‘తోట’లో న్యాయం లేదు…!
 • ఎమ్మెల్యేని పరుగులు పెట్టించిన జనం
 • చినరాజప్ప సీటు మారుతోంది…
 • తారస్థాయిలో టీడీపీ తగాదా
 • ఏపార్టీ అయినా సరే అంటున్న తోట మాటల్లో ఏముందో?
 • కష్టాలు కొనితెచ్చుకుంటున్న వైసీపీ
 • యనమల అవుట్..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *