యనమల సీన్ అయిపోయిందా..?

yanamala
Spread the love

ఆయన ఏపీలో ఆర్థికమంత్రి. అంతేకాదు టీడీపీలో సీనియర్ నేత. రాజకీయంగా అవగాహన ఉన్న నాయకుడే కాకుండా వివిధ సందర్భాల్లో చంద్రబాబుకి చేదోడుగా నిలిచారు. అయినా ఇటీవల ఆయన ప్రాధాన్యం తగ్గుతూ వస్తుందన్నది కాదనలేని సత్యం. చివరకు ఇప్పుడు సొంత జిల్లాలోనే యనమల మాట చెల్లుబాటు కాని స్థితి వచ్చేసినట్టు కనిపిస్తోంది. ఇటీవల యనమల సొంత జిల్లా తూర్పు గోదావరి జిల్లా పరిణామాలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.

తూర్పు గోదావరి జిల్లాలో కీలక అధికారుల నియామకం నుంచి వివిధ పదవుల కేటాయింపు వరకూ అన్నీ ఒకనాడు యనమల కనుసన్నల్లో సాగేవి. ఆయన ఆశీస్సులుంటేనే ఎవరికైనా పదవులు దక్కేవి. అలాంటిది ఇప్పుడు యనమల రామక్రుష్ణుడు వ్యతిరేకించినా పలు నియామకాలు సాగిపోతున్నాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ నియామకం నుంచి ఇతర విషయాల వరకూ ఇది స్పష్టమయ్యింది. ఇక తాజాగా కాకినాడ నగర పాలక సంస్థ ప్రధమ పౌరురాలి నియామకంలో యనమల అభిప్రాయాలను టీడీపీ పెద్దలు తోసిపుచ్చినట్టు కనిపిస్తోంది. దాంతో యనమల మీద నమ్మకంతో తమకే మేయర్ పీఠం అని భావించిన సీనియర్ టీడీపీ నేత సుంకర అన్నారావు కోడలు సుంకర శివ ప్రసన్నకు చివరకు మొండిచేయి మిగిలింది.

వాస్తవానికి జెడ్పీ చైర్మన్ పదవి విషయంలో కూడా యనమల మాటను తోసిపుచ్చారు. అప్పట్లో ఫిరాయింపు ఎమ్యెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ కి జెడ్పీ పీఠం కట్టబెట్టడంపై యనమల అభ్యంతరం వ్యక్తం చేసినట్టు కథనాలు వచ్చాయి. అయినా చివరకు జ్యోతులకే జెడ్పీ పీఠం దక్కింది. ఇప్పుడు కూడా జ్యోతుల నెహ్రూ బంధువుకే కాకినాడ మేయర్ పీఠం దక్కింది. అంటే ఒకరకంగా యనమల మాటను బేఖాతరు చేయడమే కాకుండా అదే సయమంలో ఆయనంటే గిట్టని మెట్ట నేతలను ప్రోత్సహించే పని టీడీపీలో సాగుతున్నట్టు కనిపిస్తోంది.

వాస్తవానికి నారా లోకేష్ తో యనమలకు అంతగా పొసగడం లేదన్నది అమరావతిలో బహిరంగరహస్యం. ఇప్పుడు ఈ విబేధాలు తూర్పుగోదావరిని కూడా తాకి చివరకు అక్కడ కూడా చినబాబు హవాకే ప్రాధాన్యత దక్కుతున్నట్టు కనిపిస్తోంది. మొత్తంగా టీడీపీీలో యనమల హవాకు బ్రేకులు పడినట్టేనని భావిస్తున్నారు.


Related News

chinthamaneni

ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు

Spread the loveవివాదాస్పద టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పోలీసు కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితం ఏలూరు మండలంRead More

west godavari

గోదారోళ్లకు చంద్రబాబు ద్రోహం చేశారా

Spread the loveఇదే ప్రశ్న ఉదయిస్తోంది. గోదావరి జిల్లా రైతాంగం ఇప్పుడు బిక్కమొఖాలు వేయాల్సి వస్తోంది. గోదావరి నదీ నీటిRead More

 • పశ్చిమలో టీడీపీకి ఎదురుదెబ్బ
 • మళ్ళీ ఖాకీల మధ్య కాపు నేత
 • ఏపీకి ఇది అన్యాయం కదా..
 • బాబుతో పీతల సుజాత వైరం ముదిరింది…
 • యనమల సీన్ అయిపోయిందా..?
 • టీడీపీలో కుర్చీలాట‌
 • నీళ్లేవి బాబు..!
 • ఆర్ నారాయణ మూర్తిని అడ్డుకున్నారు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *