Main Menu

బాబు మాటలతో ఎమ్మెల్యేల బేజారు

tdp
Spread the love

టీడీపీకి తిరుగులేని ఆధిక్యం దక్కిన జిల్లాల్లో పశ్చిమ గోదావరి ఒకటి. గడిచిన ఎన్నికల్లో ఏకంగా 15కి 15 సీట్లను టీడీపీ కూటమి దక్కించుకుంది. దాంతో ఏకఛత్రాధిపత్యం ఉన్న జిల్లాల్లో పచ్చదండు కొంత పరిమితుల్లేని రీతిలో వ్యవహరించింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని నుంచి ఇతర నేతలంతా ఇష్టారాజ్యంగా సాగడంతో పార్టీ పరువు గోదావరిలో కలిసింది. దాని కారణంగా తాజా అంచనాల ప్రకారం కేవలం 4 నియోజకవర్గాల్లో మాత్రమే సిట్టింగ్ లకు ధీమా కనిపిస్తోందనే ప్రచారం ఉంది.

ముఖ్యంగా జిల్లాలోని కొవ్వూరు, ఉంగుటూరు, ఆచంట, తణుకులో మాత్రమే ప్రస్తుతానికి తెలుగుదేశం ధీమాగా కనిపిస్తోంది. మిగిలిన చోట్ల తీవ్ర సమస్యలతో సతమతం అవుతోంది. ముఖ్యంగా ఉండి, భీమవరం, భీమవరం, చింతలపూడి, నిడదవోలు నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది. తాడేపల్లిగూడెంలో పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఈ విషయం చంద్రబాబు నిర్వహించిన సర్వేల్లో బట్టబయలు కావడంతో బాబు కాస్త సీరియస్ గానే వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. జూదాలు, కోడిపందాలతో పార్టీ పరువు తీస్తున్నారని నేతల మీద ఘాటు వ్యాఖ్యలు చేసే పరిస్థిితి వచ్చింది.

పశ్చిమలొ టీడీపీ పట్టు కోల్పోతున్న విషయం తెలుగుదేశం అధిష్టానాన్ని కలవరపెడుతుండగా, పరిస్థితి మారకపోతే సిట్టింగులను మార్చాల్సి వస్తుందని చంద్రబాబు సూటిగా చెప్పేయడంతో ఎమ్మెల్యేలు బేజారెత్తుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏలూరు, నర్సాపురం, చింతలపూడి స్థానాల్లో కూడా సిట్టింగు ఎమ్మెల్యేలను మార్చాల్సిన స్థితి ఉంటుందనే వాదన బయలుదేరింది. దాంతో సీఎం చంద్రబాబు తాజా కామెంట్స్ టీడీపీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.






Related News

chinthamaneni

మ‌ళ్లీ చింత‌మ‌నేని దౌర్జన్యం

Spread the love1Shareప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింత‌మనేని ప్ర‌భాక‌ర్ రెచ్చిపోతూనే ఉన్నారు. ఇప్ప‌టికే అనేక‌మందిపై దురుసుగా ప్ర‌వ‌ర్తించి వార్త‌ల‌కెక్కినRead More

jakkampudi

జ‌గ‌న్ మీద వారి కోపం ఎందుకు?

Spread the loveజ‌గ‌న్ కుటుంబంతో వారిది అన్యోన్య బంధం. అంది కూడా దివంగ‌త నేత‌ల వార‌స‌త్వం కావ‌డం విశేషం. అందుకుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *