నీళ్లేవి బాబు..!

vundavalli
Spread the love

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించి నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఏలేరుకు నీరు చేరలేదని, ఈ పథకం పూర్తి కాకుండానే ప్రారంభించడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ విమర్శించారు.
ఎత్తిపోతల పథకం పూర్తి కాకుండా ఎందుకు ప్రారంభించారని సిఎంను ప్రశ్నించారు. పురుషోత్తపట్నం నుంచి నీరు గండికోట డిశ్చార్జింగ్‌ పాయింట్‌ వరకూ చేరుకుని అక్కడ పుష్కర కాలువలో కలిసి ఆగిపోతోందని చెప్పారు.

పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి కాకపోవడం వల్ల ఏలేరుకు నీరు చేరడం లేదన్నారు. పుష్కర ఎత్తిపోతల పథకానికి చెందిన విద్యుత్‌ కనెక్షన్‌ను పురుషోత్తపట్నం పథకానికి కనెక్ట్‌ చేయడం వల్ల 22 రోజులపాటు పుష్కర నీటి సరఫరా ఆగిపోయిందని చెప్పారు. పథకం పూర్తి కాకుండా ప్రారంభించి ప్రజలను ముఖ్యమంత్రి ఎందుకు మభ్యపెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.
పట్టిసీమ పథకం కరెంటు బిల్లు రూ.89.87 కోట్లు వస్తే రూ.185.60 కోట్లు కేటాయిస్తూ జిఒ ఎందుకు జారీ చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు


Related News

thota trimurthulu

ఏపార్టీ అయినా సరే అంటున్న తోట మాటల్లో ఏముందో?

Spread the loveతోట త్రిమూర్తులు. ఓ సంచలన రాజకీయ నాయకుడు. సామాన్య వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం తూర్పు గోదావరిRead More

ysrcp

కష్టాలు కొనితెచ్చుకుంటున్న వైసీపీ

Spread the loveఏపీ రాజకీయాల్లో ప్రతిపక్షం పరిస్థితి అంత సవ్యంగా కనిపించడం లేదు. నిత్యం జారిపోతున్న నేతలతో కష్టాల సుడిగుండంలోనేRead More

 • యనమల అవుట్..
 • 22వ వికెట్ పడింది…
 • సంక్షోభంలో టీడీపీ
 • వైసీపీది తప్పే…
 • టీడీపీ ఎమ్మెల్యేల కొట్లాట
 • ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు
 • గోదారోళ్లకు చంద్రబాబు ద్రోహం చేశారా
 • పశ్చిమలో టీడీపీకి ఎదురుదెబ్బ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *