Main Menu

ఆపార్టీలోనే చేర‌తానంటున్న వ‌ట్టి

Spread the love

ఏపీ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌ల్లో ఒక‌రిగా పేరున్న వ‌ట్టి వ‌సంత‌కుమార్ కి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో గ‌ట్టి ప‌ట్టుంది. ముఖ్యంగా సొంత సామాజిక‌వ‌ర్గంలో ఆయ‌న‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక‌ప్పుడు కేవీపీ బాట‌లో వైఎస్ కి స‌న్నిహితుడ‌గా ఆయ‌న సాగారు. దానికి త‌గ్గ‌ట్టుగానే అమాత్య హోదాని ద‌క్కించుకుని రాజ‌కీయంగా చ‌క్రం తిప్పారు. కానీ కాంగ్రెస్ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మార‌డ‌మే కాకుండా చివ‌ర‌కు టీడీపీతో చేతులు క‌ల‌ప‌డంతో ఆపార్టీకి హ్యాండిచ్చిన వ‌ట్టి ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. జ‌న‌సేన‌, వైసీపీలలో ఏపార్టీని ఎంచుకోవాల‌న్న‌ది తేల్చుకోలేక స‌త‌మ‌తం అవుతున్నారు. చివ‌ర‌కు అభిమానులు, శ్రేయోభిలాషుల‌తో ఆత్మీయ స‌మ్మేళ‌నం నిర్వ‌హించినా నిర్ణ‌యం తీసుకోలేకపోయారు.

వ‌ట్టి వ‌సంత‌కుమార్ అంచ‌నాల‌కు, అభిమానుల ఆలోచ‌న‌ల‌కు పొంత‌న‌లేక‌పోవ‌డ‌మే దానికి కార‌ణంగా క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో జ‌గ‌న్, ప‌వ‌న్ మ‌ధ్య స‌యోధ్య కోసం వ‌ట్టి కొంత ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు కూడా ప్రచారం ఉంది. ఆ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌వ‌ని, తాజాగా జ‌గ‌న్-ప‌వ‌న్ మ‌ధ్య పెరుగుతున్న మాట‌ల యుద్ధం చాటుతోంది. దాంతో వ‌ట్టి ఏదో గ‌ట్టి నిర్ణ‌యం తీసుకోవాల్సిన పరిస్థితి వ‌చ్చేస్తుంద‌ని భావిస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే తానిక కాంగ్రెస్ లో చేరేది లేద‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న ఏపార్టీలో చేరాల‌న్న‌ది ఈనెల 11 న నిర్ణ‌యం తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు.

అయితే త‌న సీనియారిటీ త‌గిన స్థానం కోసం ఆయ‌న ఎదురుచూస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది ఆయ‌న న‌ర్సాపురం ఎంపీ సీటుని ఆశిస్తున్నారు. దానికి వైసీపీలో అవ‌కాశం లేదు. ఇప్ప‌టికే క్ష‌త్రియ సామాజిక‌వ‌ర్గానికి జ‌గ‌న్ ఖాయం చేసేశారు. గ‌త ఎన్నిక‌ల్లో దానికి భిన్నంగా వెళ్ల‌డంతో చేతులు కాల్చుకోవాల్సి వ‌చ్చింద‌నే అంచనాలో జ‌గ‌న్ ఉండ‌డంతో న‌ర్సాపురం సీటు ఏ రాజుకిస్తార‌న్న‌ది మాత్ర‌మే తేలాల్సి ఉంది. దాంతో వ‌ట్టి వ‌సంత్ కుమార్ కి సొంత అసెంబ్లీ సీటు ఉంగుటూరుని వైసీపీ ఆఫ‌ర్ చేస్తోంది ఇక జ‌న‌సేన కూడా వ‌ట్టి వంటి నేత‌లు వ‌స్తే కోరుకున్న స్థానం క‌ట్ట‌బెట్టాల‌నే ఆలోచ‌న‌లో ఉంది. దానికి త‌గ్గ‌ట్టుగానే నాదెండ్ల మ‌నోహ‌ర్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో వ‌ట్టి ఎటూ తేల్చుకోలేక పోతున్న‌ప్ప‌టికీ త‌న‌కు తగిన గుర్తింపు , సీనియారిటీని ఉప‌యోగించుకునే పార్టీలోనే చేర‌తాన‌ని తేల్చేశారు. 11న ఆయ‌న ప్ర‌క‌టిస్తాన‌ని చెప్ప‌డంతో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో అదో హాట్ టాపిక్ అవుతోంది


Related News

గెలిచినా అది మానేది లేదంటున్న నాగ‌బాబు!

Spread the loveజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రుడు ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో న‌ర్సాపురం ఎంపీ సీటుకి పోటీ ప‌డిన సంగ‌తిRead More

Latest Survey: ప‌గోలో ఎవ‌రిది పై చేయి?

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు ప్ర‌త్యేక ప్ర‌ధాన్య‌త ఉంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ హ‌వాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *