Main Menu

ఆయ‌న వైసీపీ వైపు, అభిమానుల గురి జ‌న‌సేన వైపు

Spread the love

రాజ‌కీయాల్లో బ‌ళ్లు ఓడ‌ల‌వుతాయి..ఓడ‌లు బ‌ళ్ల‌వుతాయంటే ఆయ‌న ప్ర‌స్థానం చాటిచెబుతుంది. విప‌క్షంలో ఉన్న‌ప్పుడు అనేక ఆటంకాలు ఎదుర్కొన్న ఆయ‌న అధికారంలోకి రాగానే రాజ‌భోగం అనుభ‌వించారు. అంత‌లోనే కాంగ్రెస్ ప‌రిస్థితి కుదేలుకావ‌డంతో ఆయ‌న దాదాపుగా తెర‌మ‌రుగ‌యిపోయారు. అయినా టీడీపీ తో రాహుల్ గాందీ చేతులు క‌ల‌ప‌డంతో వెంట‌నే రాజీనామా స‌మ‌ర్పించి కొత్త ప్ర‌స్థానానికి శ్రీకారం చుడుతున్నారు. మాజీ మంత్రి వ‌ట్టి వ‌సంత‌కుమార్ నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఏర్ప‌డుతోంది.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వ‌ట్టి వ‌సంత‌కుమార్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగడం ఖాయంగా మారింది. అయితే ఆయ‌న మ‌న‌సు వైసీపీ వైపు మ‌ళ్ల‌డం ఆస‌క్తిగా క‌నిపిస్తోంది. అభిమానులు మాత్రం జ‌న‌సేన వైపు లాగుతుండ‌డంతో వ‌ట్టి ఊగిస‌లాట‌లో ప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉంగుటూరు కాకుండా న‌ర్సాపురం నుంచి పార్ల‌మెంట్ బ‌రిలో దిగాల‌ని ఆయ‌న ఆశిస్తున్న‌ట్టు అబిమానులు చెబుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా వైసీపీ సుర‌క్షిత స్థాన‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. వ‌ట్టి వ‌సంత్ ఒక‌నాటి వైఎస్ కి స‌న్నిహితుడు. ఆ త‌ర్వాత ప‌రిణామాల‌తో చిరంజీవి పార్టీలోకి రావాల‌ని ఒత్తిడి వ‌చ్చినా వైఎస్ వెంట ఉన్నారు. అయినా జ‌గ‌న్ శిబిరంలో చేరలేదు. కానీ ప్ర‌స్తుతం ఆయ‌న్ని వైసీపీలో కి రావాల‌ని సి రామ‌చంద్ర‌య్య వంటి వారు కోరుతున్న‌ట్టు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో నాదెండ్ల మ‌నోహ‌ర్ వంటి మిత్రులు మాత్రం జ‌న‌సేన‌లో చేర్చుకునేందుకు పావులు క‌దుపుతున్నార‌నే స‌మాచారం అందుతోంది.

అందుకు తోడు అనుచ‌రులంతా ప‌వ‌న్ వెంట చేరాల‌ని ఒత్తిడి తెస్తుండ‌డంతో చివ‌ర‌కు వ‌చ్చే నెల 3న అభిమానుల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. స‌మిష్టి నిర్ణ‌యం తీసుకునే యోచ‌న‌లో ఈ స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్టు చెబుతున్నారు. చివ‌ర‌కు ఆయ‌న ఎటు మొగ్గుతార‌న్న‌ది ఆస‌క్తిదాయ‌క‌మే. ఇటీవ‌లే జ‌గ‌న్, ప‌వ‌న్ ని క‌లిపిందేకు ఆ ఇద్ద‌రు నేత‌ల‌తో విశాఖ‌లో ఓ స‌మావేశం జ‌రిగింద‌ని టీడీపీ నేత‌లు ఆరోపించిన దానికి కేంద్రం వ‌ట్టి సోద‌రుడే కావ‌డం విశేషం. దాంతో వ‌ట్టి వ‌సంత్ కుమార్






Related News

ఫిబ్ర‌వ‌రి నాటికి క్లారిటీ వ‌స్తుందంటున్న ప‌వ‌న్

Spread the loveజ‌న‌సేన అధినేత ప‌ర్య‌ట‌న‌లు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు ఉత్త‌రాంధ్ర‌, గోదావ‌రి జిల్లాల యాత్ర‌లు ముగించుకుని ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమ‌లోRead More

ఆపార్టీలోనే చేర‌తానంటున్న వ‌ట్టి

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌ల్లో ఒక‌రిగా పేరున్న వ‌ట్టి వ‌సంత‌కుమార్ కి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో గ‌ట్టిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *