Main Menu

హాట్ టాపిక్ గా మార‌బోతున్న ఉండి నియోజ‌క‌వ‌ర్గం

Spread the love

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంది. ఓవైపు కొల్లేరు, మ‌రోవైపు ప‌చ్చ‌ని పైరు సీమ‌ల‌తో ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌ర‌వ‌శించిపోతూ ఉంటుంది. భీమ‌వ‌రం ప‌ట్ట‌ణానికి చుట్టూ విస్త‌రించిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఫ‌లితాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గం సుదీర్ఘ‌కాలంగా టీడీపీకి ప‌ట్టుకొమ్మ‌గా ఉంటూ వ‌స్తోంది. ఆపార్టీ ఆవిర్భావం త‌ర్వాత కేవ‌లం 2004లో మాత్ర‌మే కాంగ్రెస్ అభ్య‌ర్థి పాత‌పాటి స‌ర్రాజు విజ‌యం సాధించ‌గ‌లిగారు. గ‌డిచిన రెండు ఎన్నిక‌ల్లోనూ క‌ల‌వ‌పూడి శివ గెలుస్తూ వ‌చ్చారు.

కానీ ప్ర‌స్తుతం ప‌రిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. ముక్కోణ‌పు పోరులో టీడీపీకి ఎదురీత త‌ప్ప‌డం లేదు. మ‌రోవైపు వైసీపీ కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల్లో ప్ర‌భావితం చేయ‌లేక‌పోతోంది. అదే స‌మ‌యంలో జ‌న‌సేన‌, లెఫ్ట్ పార్టీల కూట‌మి అభ్య‌ర్థిగా రంగంలో ఉన్న బి బ‌ల‌రాం మాత్రం ప్ర‌చార‌ప‌ర్వంలో దూసుకుపోతున్నారు. అనూహ్య ఫ‌లితాలు సాధించే అవ‌కాశం ఉంద‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే క‌ల‌వ‌పూడి శివ ఈసారి న‌ర్సాపురం పార్ల‌మెంట్ కి పోటీ చేస్తుండ‌డంతో స్థానిక టీడీపీ నేత‌లు నిరాశ‌లో ఉన్నారు. ఎంపీ సీటులో క‌నుమూరి ర‌ఘురామ రాజుకే శివ వ‌ర్గీయులు తోడుగా ఉంటున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి టీడీపీకి ఆశాభంగం త‌ప్ప‌ద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. జ‌న‌సేన ఎంపీ అభ్య‌ర్థిగా ఉన్న కొణిదెల నాగేంద్ర‌బాబుకి కూడా ఉండిలో మంచి క్రేజ్ ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేస్తుండ‌డం, నాగ‌బాబు ఎంపీగా ఉండ‌డంతో జ‌న‌సైనికులు ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేస్తున్నారు. అదే స‌మ‌యంలో సీపీఎం అభ్య‌ర్థికి సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం, ఉండి ప్రాంత ప్ర‌జ‌ల‌తో అవినాభావ సంబంధాలున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో మార్పు మంచిద‌నే అభిప్రాయంతో ఉన్న ప్ర‌జ‌ల్లో అత్య‌ధికులు వైసీపీ అభ్య‌ర్థి క‌న్నా సీపీఎం అభ్య‌ర్థి శ్రేయ‌స్క‌ర‌మ‌నే అంచ‌నాకు వస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో ఉండి నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీ, వైసీపీకి పోటీగా సీపీఎం అభ్య‌ర్థి అన్ని వ‌ర్గాల మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్టుకుని ముందుకు సాగుతున్న త‌రుణంలో ఉండి రాజ‌కీయాల్లో ఓ కొత్త గాలి వీస్తుంద‌ని, అది రాజ‌కీయంగా సంచ‌ల‌నం కాబోతోంద‌నే అంచ‌నాలు అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయి.






Related News

గెలిచినా అది మానేది లేదంటున్న నాగ‌బాబు!

Spread the loveజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రుడు ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో న‌ర్సాపురం ఎంపీ సీటుకి పోటీ ప‌డిన సంగ‌తిRead More

Latest Survey: ప‌గోలో ఎవ‌రిది పై చేయి?

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు ప్ర‌త్యేక ప్ర‌ధాన్య‌త ఉంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ హ‌వాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *