బాబు మాట‌ను ఖాత‌రు చేయ‌ని టీడీపీ ఎమ్మెల్యే

thota trimurtulu
Spread the love

ఆశ్చ‌ర్య‌మే అయినా అధినేత తీరుతో ఆ ఎమ్మెల్యే అసంతృప్తిగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. నేత‌లంతా ఆ ప‌నిలో ఉండాల‌ని ఆదేశించినా ఈ ఎమ్మెల్యే మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. ఓవైపు కాపుల రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని ఉప‌యోగించుకుని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ప్ర‌భుత్వం మీద ఎదురుదాడి చేస్తున్నారు. చంద్ర‌బాబుని ఇర‌కాటంలో పెడుతున్నారు. దాంతో టీడీపీ నేత‌ల‌కు పెద్ద తల‌నొప్పిగా మారుతోంది. చివ‌ర‌కు టీడీపీ జిల్లా అధ్య‌క్షుడిగా ఉన్న త‌మ సామాజిక‌వ‌ర్గ నేత ఇంటిని కూడా కాపులు ముట్ట‌డించారు. స‌లాది రామ‌కృష్ణ‌లాంటి మ‌రికొంద‌రు టీడీపీ నేత‌లు మాత్రం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌క‌పోతే టీడీపీకి రాజీనామా చేస్తామంటూ హెచ్చ‌రించారు. ఇలా టీడీపీ తీవ్ర ఒత్తిడిలో ఉన్న స‌మ‌యంలో కూడా ఆ ఎమ్మెల్యే పెద‌వి విప్ప‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అందులోనూ గ‌తంలో ముద్ర‌గ‌డ ఉద్య‌మాల స‌మ‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి, రాయ‌బారాలు కూడా న‌డిపిన తోట త్రిమూర్తులు ఇప్పుడు హ‌ఠాత్తుగా సైలెంట్ గా ఉండ‌డం ఆశ్చ‌ర్యంగా మారుతోంది.

సీనియ‌ర్ ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు ఇటీవ‌ల మంత్రివ‌ర్గంలో స్థానం ఆశించారు. కానీ అది నెర‌వేర‌లేదు. చిన‌రాజ‌ప్ప‌ను కొన‌సాగించ‌డానికే చంద్ర‌బాబు మొగ్గుచూప‌డంతో తోట‌త్రిమూర్తులు అసంతృప్తికి గుర‌య్యారు. అయినా ఆయ‌న ఆ విష‌యాన్ని బ‌య‌ట‌ప‌డ‌నివ్వ‌లేదు. తీరా ఇప్పుడు అవ‌స‌రం వ‌చ్చిన స‌మ‌యంలో స‌హయ నిరాక‌ర‌ణ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. వాస్త‌వానికి కాపుల్లో తోట త్రిమూర్తుల‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంకా చెప్పాలంటే కాపుల మ‌ద్ధ‌తుతోనే ఆయ‌న రాజ‌కీయాలు చేస్తున్నారు. అలాంటి కాపుల స‌మ‌స్య ముందుకొచ్చిన‌ప్పుడు ఆయ‌న క‌నీసం గొంతు విప్పుక‌పోవ‌డం విశేషంగానే ఉంది. ఇప్ప‌టికే చంద్ర‌బాబు త‌న పార్టీ కాపునేత‌లంద‌రికీ ఈ బాధ్య‌త అప్ప‌గించారు. ముద్ర‌గ‌డ‌కు కౌంట‌ర్ ఇవ్వాల‌ని టీడీపీ అధిష్టానం నుంచి ఆదేశాలొచ్చాయి. గోదావ‌రి జిల్లాల్లోని ఛోటా మోటా నేత‌లంతా ఈ విష‌యంలో ముద్ర‌గ‌డ మీద ప్ర‌తివిమ‌ర్శ‌లు చేశారు. అయినా తోట త్రిమూర్తులు మాత్రం దానికి దూరంగా ఉన్నారు. త‌ద్వారా చంద్ర‌బాబు మాట‌ను కూడా ఆయ‌న ఖాత‌రు చేసిన‌ట్టు క‌నిపించ‌డం లేదు.

వాస్త‌వానికి కాపుల‌కు అన్యాయం చేయ‌డ‌మే కాకుండా ముద్ర‌గ‌డ విష‌యంలో అతిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయం టీడీపీ కాపు నేత‌ల్లోనూ ఉంది. చిన‌రాజ‌ప్ప లాంటి ఒక‌రిద్ద‌రు నోరు పారేసుకుంటున్నార‌నే అత్య‌ధికులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు ముద్ర‌గ‌డ మీద విమ‌ర్శ‌లు చేసి ఇరుకున‌ప‌డ‌డం ఎందుక‌ని తోట ఆలోచించ‌న‌ట్టుగా క‌నిపిస్తోంది. దాంతో ఆయ‌న జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నార‌నే అభిప్రాయం వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో లోక్ స‌భ‌లో టీడీపీ నేత‌గా ఉన్న తోట న‌ర‌సింహం కూడా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం విశేషం. ఈ నేత‌లంతా చంద్రబాబు ధోర‌ణితో అసంతృప్తిగా ఉన్నార‌ని, చివ‌రిలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్న ఆశ్చ‌ర్యం లేద‌ని వారి అనుచ‌రులే చెబుతుండ‌డం విశేషం.


Related News

chinthamaneni

ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు

Spread the loveవివాదాస్పద టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పోలీసు కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితం ఏలూరు మండలంRead More

west godavari

గోదారోళ్లకు చంద్రబాబు ద్రోహం చేశారా

Spread the loveఇదే ప్రశ్న ఉదయిస్తోంది. గోదావరి జిల్లా రైతాంగం ఇప్పుడు బిక్కమొఖాలు వేయాల్సి వస్తోంది. గోదావరి నదీ నీటిRead More

 • పశ్చిమలో టీడీపీకి ఎదురుదెబ్బ
 • మళ్ళీ ఖాకీల మధ్య కాపు నేత
 • ఏపీకి ఇది అన్యాయం కదా..
 • బాబుతో పీతల సుజాత వైరం ముదిరింది…
 • యనమల సీన్ అయిపోయిందా..?
 • టీడీపీలో కుర్చీలాట‌
 • నీళ్లేవి బాబు..!
 • ఆర్ నారాయణ మూర్తిని అడ్డుకున్నారు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *