తెలుగుదేశం ‘తోట’లో న్యాయం లేదు…!

thota
Spread the love

ఏపీ ప్రస్తుతం క్రైమ్ రేట్ లో ముందు నిలుస్తోంది. అనేక చోట్ల అధికార పార్టీ పెద్దలే కీలకమైన నేరాల్లో నిందితులుగా కనిపిస్తున్నారు. అయితే వారిని కాపాడడానికి అధికార యంత్రాంగం అహర్నిశలు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. అన్ని ఆదారాలున్నప్పటికీ పాలక పెద్దల మనుషులయితే మాత్రం దర్జాగా వ్యవహరించడానికి తగ్గట్టుగా యంత్రాంగం తోడ్పడుతోంది. అయితే వర్తమాన వ్యవహారాలకు తోడుగా రెండు దశాబ్దాల నాటి కేసుల్లో కూడా అదే తంతు. చట్టాలను ఎంత అపహాస్యం చేస్తున్నారో తాజాగా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కేసులో స్పష్టంగా కనిపిస్తోంది.

1996లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో తన సామాజికవర్గానికి చెందిన వారెవరినో కామెంట్ చేశారనే కారణంతో దళితులకు శిరోముండనం చేసిన కేసులో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేయకుండా జాప్యం చేస్తుంటే తీవ్రస్థాయిలో ఉద్యమం చెలరేగింది. అనేక చోట్ల నిరసనలు సాగాయి. దాంతో చివరకు కేసు నమోదు చేయడం, జైలుకెళ్లడం, మళ్లీ బెయిల్ పై వచ్చిన తోట త్రిమూర్తులు అప్పటి నుంచి బాదితుల మీద మరింత కక్ష పూరితంగా వ్యవహరించడం సాగుతోంది

అయితే ఈ నేరానికి సంబంధించి తోట త్రిమూర్తులు తన కేసు విచారణ ముందుకు సాగకుండా అనేకరకాలుగా అడ్డుపడ్డారనే ప్రచారం పెద్ద స్థాయిలో ఉంది. ప్రస్తుతం విశాఖలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఈ కేసు విచారణ తుదిదశకు వచ్చింది. వాస్తవంగా 14వ తేదీన జడ్జిమెంట్ కూడా రావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా బాధితులు హైకోర్టులో కేసు వేసి స్టే తెచ్చుకోవడంతో తీర్పు నిలిచిపోయింది. కోర్టులో 21వ సంవత్సరాలుగా అనేక ఒత్తుళ్లు ఎదుర్కొంటూ న్యాయపోరాటం చేస్తున్న బాధితులు ఇప్పుడు తీర్పుని అడ్డుకోవడం చాలామందిని ఆశ్చర్యపరించింది. అయితే అసలు కారణం కోర్టులో కేసు నీరుగార్చడానికి సర్కారు వేసిన ఎత్తులేనని స్పష్టం అవుతోంది. ముఖ్యంగా బాధితులు ఎస్సీ సర్టిఫికెట్లు సమర్పించాలని కోర్టు ఆదేశించగా, అసలు వారికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా రామచంద్రాపురం ఎమ్మెల్యే ఒత్తిడితో తహాశీల్దార్ జాప్యం చేయడం సమస్యగా మారింది. బాధితులు సకాలంలో ఎస్సీ కులధ్రువీకరణ సమర్పించకపోతే కేసు కొట్టేస్తారనే కుయత్నాలతో ఇలాంటి ప్రయత్నానికి ఒడిగట్టినట్టు కనిపిస్తోంది.

అయితే ఇంత బాహాటంగా శిరోముండనం బాధితులు తహాశీల్దార్ చుట్టూ తిరుగుతూ తమకు కుల సర్టిఫికెట్లు కావాలని అడుగుతుంటే వాటిని కాలయాపన చేస్తూ కోర్టులో కేసుని నీరుగార్చడానికి సర్కారీ పెద్దలు తోడ్పాటునందించడం విశేషంగా మారింది. చంద్రబాబు పాలనలో బాధిత దళితులకు న్యాయం దక్కదని స్పష్టమవుతోంది. ఇటీవలే గరగపర్రు ఘటనలో కూడా దోషులు నేటికీ బాధితులను బెదిరిస్తుండగా, ఇప్పుడు పాలకపార్టీ ఎమ్మెల్యేని 21 ఏళ్లుగా కాపాడుతూ ఇప్పుడు కూడా కేసు పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం చంద్రబాబు ప్రభుత్వ తీరుకి తార్కాణంలా కనిపిస్తోంది.


Related News

Hyderabad: TDP President N Chandrababu Naidu's son Nara Lokesh is felicitated on the first day of the party's Mahanadu at Gandipet near Hyderabad on Wednesday. PTI Photo (PTI5_27_2015_000150A)

టీడీపీకి క్లారిటీ వ‌చ్చేసింది…

Spread the loveతూర్పు గోదావ‌రి జిల్లాలో టీడీపీ మ‌రోసారి ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటాల‌ని స్కెచ్Read More

cbn-pawan-jagan-666-23-1474631821

గోదావ‌రిలో టీడీపీకి పెద్ద గండి…!

Spread the loveఏపీలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వ‌చ్చేసింది. పార్టీల‌న్నింటికీ ఆ ఫీవ‌ర్ వ్యాపిస్తోంది. ప్ర‌త్యేక హోదా, పార్ల‌మెంట్ లో ప‌రిణామాలRead More

 • టీడీపీ ఎమ్మెల్యేకి త‌ప్పిన ముప్పు
 • జ‌న‌సేనానికి ముద్ర‌గ‌డ మ‌ద్ధ‌తు
 • రాజీనామాకు సిద్దం అంటున్న సోము వీర్రాజు
 • జ‌గ‌న్, బాబు రెండుప‌డ‌వ‌ల‌పై కాళ్లేసిన సునీల్!
 • అభ్య‌ర్థులు కావలెను..!
 • టీడీపీ రెండు నాలుక‌లు…
 • చిక్కుల్లో చింత‌మ‌నేని
 • పవన్ కళ్యాణ్ గూటిలో జగన్ అనుచరుడు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *