టీడీపీలో గుబులు రేపిన తోట‌

image_1040623_inside-tdp-leaders-in-east-godavari-district-tries-to-dominate-parvatha-family-city-latest-tv-news-photo-image-pic
Spread the love

తెలుగుదేశం పార్టీకి క‌ష్టాలు చుట్టుముడుతున్నాయి. న‌లువైపులా ఏక‌కాలంలో ఇబ్బందులు ఎద‌రువుతున్నాయి. దాంతో పార్టీలో ప‌రిస్థితి ఎటూ పాలుపోని ద‌శ‌కు చేరుతోంది. సీమ‌లో సీన్ ఎలా ఉన్నా, క‌నీసం బ‌లంగా ఉన్నామ‌ని చెప్పుకునే గోదావ‌రి జిల్లాల్లో ప‌ట్టు నిలుపుకోవాల‌నే ప‌ట్టుద‌ల అధికార పార్టీలో ఉంది. కానీ ప‌రిస్థితి దానికి సానుకూలంగా లేదు. ప్ర‌జ‌ల్లో క‌నిపిస్తున్నా వ్య‌తిరేక‌త‌, ముఖ్యంగా కాపుల్లో పెరుగుతున్న ఆగ్ర‌హంతో ఆ సామాజిక‌వ‌ర్గానికి చెందిన కీల‌క నేత‌ల‌ను పున‌రాలోచ‌న‌లో ప‌డేస్తోంది. అదే ఇప్పుడు టీడీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది. ముద్ర‌గ‌డ మంట రాజేస్తుంటే ప‌లువురు నేత‌లు ఆ ప్ర‌భావానికి గుర‌వుతున్నార‌నే ప్ర‌చారం టీడీపీ శిబిరంలో సెగ‌లు పుట్టిస్తోంది.

అత్యంత ప్ర‌తిష్టాత్మంగా తీసుకున్న కాకినాడ మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. పార్టీకి కీల‌కంగా ఈ ఎన్నిక‌లు మారిపోయాయి. పేరుకి స్థానిక సంస్థ‌లే అయినా ప‌లితాలు తారుమార‌యితే మాత్రం టీడీపీ పుట్టి మునిగిపోతోంద‌ని భ‌య‌ప‌డుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల‌కు చెమ‌ట‌లు ఆరడం లేదు. కాకినాడ‌లో న‌గ‌ర ఎమ్మెల్యేకి 14వ డివిజ‌న్ లో అభ్య‌ర్థి లేక‌పోతే సొంత అన్న కొడుకుని ఆఖ‌రి క్ష‌ణంలో రంగంలో దింపాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్ర‌ధాన నేత‌లంతా కాకినాడ‌లో మ‌కాం వేశారు. కార్పోరేష‌న్ ద‌క్కించుకోవ‌డానికి పావులు క‌దుపుతున్నారు. కానీ ఆ ఇద్ద‌రు ప్ర‌ధాన నేత‌లు మాత్రం ప‌త్తా లేరు.

కాకినాడ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎంపీ తోట న‌ర‌సింహం ఈ ఎన్నిక‌ల్లో అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌న భార్య తోట వాణీకి మేయ‌ర్ స్థానం ఆశించిన ఆయ‌న అది ద‌క్క‌క‌పోవ‌డంతో దూరంగా ఉంటున్నారు. లోక్ స‌భ‌లో ఫ్లోర్ లీడ‌ర్ గా ఉన్న నాయ‌కుడు సొంత న‌గ‌రంలో పార్టీ ఆపసోపాలు ప‌డుతుంటే త‌న‌కు సంబంధం లేద‌న్న‌ట్టుగా సాగ‌డం ఆశ్చ‌ర్యంగా క‌నిపిస్తోంది. ఆయ‌న‌కు తోడుగా మ‌రో కీల‌క నేత‌, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా త‌న‌కు సంబంధం లేని విష‌యంగా భావిస్తున్నారు. ఆయ‌న కూడా కాకినాడ ఎన్నిక‌ల్లో క‌నిపించ‌డం లేదు. రామ‌చంద్రాపురం నియోజ‌క‌వ‌ర్గం కాకినాడ‌కు చేరువ‌లోనే ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న మాత్రం త‌న ప‌నిలో తాను ఉన్నారు. పార్టీ యావ‌త్తూ కార్పోరేష‌న్ కోసం క‌స‌రత్తులు చేస్తుంటే త్రిమూర్తులు మాత్రం తీరిగ్గా క‌నిపిస్తున్నారు. దానికి కార‌ణం కూడా ఆయ‌నకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డ‌మే అంటున్నారు.

సీనియ‌ర్ ఎమ్మెల్యేగా ఉన్న త‌న‌కు అమాత్య హోదా ఇస్తాన‌ని చెప్పి, కేటాయించ‌క‌పోవ‌డంతో తోట త్రిమూర్తులు అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. పార్టీ వ్య‌వ‌హారాల్లో చురుగ్గా క‌నిపించ‌డం లేదు. చివ‌ర‌కు పురుషోత్త‌ప‌ట్నం ప‌రిశీల‌న కోసం జిల్లాకు వ‌చ్చిన సీఎంని కూడా ఆయ‌న క‌ల‌వ‌లేదు. దాంతో ఇద్ద‌రు కీల‌క తోట నేత‌ల తీరు టీడీపీలో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అస‌లే ముద్ర‌గ‌డ ఉద్య‌మం కొన‌సాగుతున్న స‌మ‌యంలో కాపులే కీల‌కంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్ద‌రు ప్ర‌ధాన కాపు నేత‌లు ఎన్నిక‌ల వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉండ‌డం టీడీపీలో గుబులు రేకెత్తిస్తోంది. తోట న‌ర‌సింహం త్వ‌ర‌లో వైసీపీలో చేరిపోతార‌నే ప్ర‌చారం ఉంది. జ‌గ్గంపేట ఎమ్మెల్యేగా ఆయ‌న పోటీ చేస్తార‌నే ప్ర‌చారం ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఎలా వ్య‌వ‌హ‌రించినా తోట త్రిమూర్తులు కూడా అదే రీతిలో సాగ‌డ‌మే ఆశ్చ‌ర్యం. మ‌రి ఆయ‌నేం చేస్తారో చూడాలి.


Related News

kandula durgesh

వైసీపీని వీడే యోచనలో సీనియర్ నేత

Spread the loveసీనియర్ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. వైఎస్ హయంలో దక్కిన ఎమ్మెల్సీకి తోడు మంచి వాగ్దాటి ఉన్నRead More

9173_ysrcp-3

టీడీపీకి షాక్: వైసీపీలోకి కీలక నేత

Spread the loveగోదావరి జిల్లాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తున్న వైసీపీకి బలమైన నాయకుడు దొరికారు. చాలాకాలంగా టీడీపీలో ఉన్న సీనియర్Read More

 • వైసీపీలోకి మరో మాజీ ఎమ్మెల్యే
 • తూర్పున మరో తగాదా
 • చిక్కులు కొనితెచ్చుకున్న చినరాజప్ప
 • జగన్ కి కొత్త సమస్యలు షురూ
 • ప‌శ్చిమ టీడీపీలో చిచ్చు ..
 • రాధాకృష్ణ‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చిన బిరుదు…!
 • చిన‌రాజ‌ప్ప‌కి స్కెచ్ వేస్తున్న సొంత పార్టీ
 • జ‌గ‌న్ కి జై కొట్టిన మ‌రో సినీ న‌టుడు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *