ఏపార్టీ అయినా సరే అంటున్న తోట మాటల్లో ఏముందో?

thota trimurthulu
Spread the love

తోట త్రిమూర్తులు. ఓ సంచలన రాజకీయ నాయకుడు. సామాన్య వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన వివాదాస్పద నేత. అనేక ఆరోపణలు ఆయన మీదున్నాయి. కేసులు కూడా ఉన్నాయి. అన్నింటికీ మించి దళితుల శిరోముండనం కేసు నేటికీ విచారణ సాగుతోంది. బహుశా తోట త్రిమూర్తులు రాజకీయ జీవితాన్ని ఆ కేసు శాసిస్తోందని చెప్పవచ్చు. త్వరలో తీర్పు వెలువడబోతున్న నేపథ్యంలో త్రిమూర్తులు భవితవ్యం శిరోముండనం కేసు మీద మీద ఆధారఫడి ఉంటుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే 21 ఏళ్లు గడిచిపోయిన ఈ కేసులో తీర్పు కోసం పలు దళిత సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. దాంతో దాదాపుగా తుది అంకానికి చేరిన కేసు త్వరలోనే తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అది కూడా వచ్చే ఎన్నికలకు ముందే ఉంటుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తోట త్రిమూర్తులు కూడా తన రాజకీయ భవిష్యత్తని దానికి తగ్గట్టుగా మలచుకుంటున్నట్టు కనిపిస్తోంది. శిరోముండనం కేసులో త్రిమూర్తులకు సంబంధించి పూర్తిస్థాయి ఆధారాలున్నట్టు చెబుతున్నారు. కేసులో తీర్పు దానికి తగ్గట్టుగానే ఉంటుందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో తన రాజకీయ వారసుడిగా కొడుకుని రంగంలో దింపడానికి తోట త్రిమూర్తులు ఇప్పటికే పథక రచన చేసినట్టు భావిస్తున్నారు. తనకు ఊ హించని తీర్పు వచ్చి సమస్యలు ఏర్పడితే ఆ వెంటనే కొడుకుని తెరమీదకు తీసుకురావడం, అది కూడా జనసేన రూపంలో రంగ ప్రవేశం చేయించడం లక్ష్యంగా తోట త్రిమూర్తులు సాగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అదే సమయంలో రామచంద్రాపురం నుంచి కాకుండా కాకినాడ రూరల్ లో తోట త్రిమూర్తులు వారసుడి ఫ్లెక్సీలు ఎక్కువగా కనిపిస్తుండడంతో పార్టీతో పాటు సీటు కూడా మార్చేస్తారనే వాదన వినిపిస్తోంది.

తాజాగా మండపేటలో జరిగిన కాపుల వనసమారాధనలో తోట త్రిమూర్తులు మాటలు దానికి తగ్గట్టుగానే ఉన్నాయి. న్యాయం చేస్తే ఏ పార్టీ అయినా తాను కట్టుబడి ఉంటానని చెప్పడం వెనుక అసలు ఉద్దేశం వేరుగా ఉందంటున్నారు. తనకు న్యాయం జరగకపోతే పార్టీని వీడిపోవడానికి తనకు మొహమాటం లేదని చెప్పకనే చెప్పేసినట్టు కొందరు భావిస్తున్నారు. తద్వారా తనకు తగిన సహాయం అవసరమని టీడీపీ పెద్దలకు ఆయన సంకేతాలిచ్చినట్టు కనిపిస్తోందని కొందరు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో న్యాయం చేయకపోతే పార్టీని మారడానికి తగ్గట్టుగా కాపులకు ఆయన సూచన చేసినట్టు కనిపిస్తోందని కూడా అంటున్నారు. మొత్తంగా ఏమైనా రామచంద్రాపురం రాజకీయాల్లో త్రిమూర్తులు నిర్ణయం పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆయన కేసులో తీర్పుని బట్టి అక్కడి రాజకీయ పరిణామాలుంటాయనడంలో సందేహం లేదు.


Related News

Hyderabad: TDP President N Chandrababu Naidu's son Nara Lokesh is felicitated on the first day of the party's Mahanadu at Gandipet near Hyderabad on Wednesday. PTI Photo (PTI5_27_2015_000150A)

టీడీపీకి క్లారిటీ వ‌చ్చేసింది…

Spread the loveతూర్పు గోదావ‌రి జిల్లాలో టీడీపీ మ‌రోసారి ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటాల‌ని స్కెచ్Read More

cbn-pawan-jagan-666-23-1474631821

గోదావ‌రిలో టీడీపీకి పెద్ద గండి…!

Spread the loveఏపీలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వ‌చ్చేసింది. పార్టీల‌న్నింటికీ ఆ ఫీవ‌ర్ వ్యాపిస్తోంది. ప్ర‌త్యేక హోదా, పార్ల‌మెంట్ లో ప‌రిణామాలRead More

 • టీడీపీ ఎమ్మెల్యేకి త‌ప్పిన ముప్పు
 • జ‌న‌సేనానికి ముద్ర‌గ‌డ మ‌ద్ధ‌తు
 • రాజీనామాకు సిద్దం అంటున్న సోము వీర్రాజు
 • జ‌గ‌న్, బాబు రెండుప‌డ‌వ‌ల‌పై కాళ్లేసిన సునీల్!
 • అభ్య‌ర్థులు కావలెను..!
 • టీడీపీ రెండు నాలుక‌లు…
 • చిక్కుల్లో చింత‌మ‌నేని
 • పవన్ కళ్యాణ్ గూటిలో జగన్ అనుచరుడు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *