Main Menu

పవన్ కళ్యాణ్ గూటిలో జగన్ అనుచరుడు

thota chandrasekhar
Spread the love

జనసేన అధినేత జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ సమావేశం ముగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు మీద ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవాలు ప్రజలకు చేరడం లేదని, నిధులకు సంబంధించిన పూర్తి సమాచారం రావడం లేదన్నారు. అయితే ఆయన 15వ తేదీ వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టిన డెడ్ లైన్ గడిచినప్పటికీ పెద్దగా ఆశ్చర్యకరమైన నిర్ణయాలు మాత్రం తీసుకోలేదు. మరికొన్నాళ్లు వేచి చూసే ధోరణే ప్రదర్శించారు. దూకుడుగా ప్రభుత్వ తీరును ఎండగట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపించడం లేదు. అయితే తాజాగా వివిధ పార్టీల నేతలను ఆహ్వానించి నడిపిన హైదరాబాద్ సమావేశానికి టీడీపీ, బీజేపీ మినహా అందరినీ ఆహ్వానించారు. వారంతా పాల్గొన్నారు కూడా.

అయితే సమావేశంలో ఏం చర్చించారన్న దాని కన్నా పవన్ కళ్యాణ్ ఏం సాధించారన్నదే ఆసక్తిగా కనిపిస్తోంది. సీనియర్ కాంగ్రెస్ నేతగా, నేటికీ సోనియా గాంధీతో సన్నిహితంగా మెలగగలిగిన ఉండవల్లితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఆ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ హఠావో అని నినదించిన పవన్ కళ్యాణ్ ఆఖరికి ఫోన్ చేసి మరీ కాంగ్రెస్ వాళ్లను ఆహ్వానించడం చర్చనీయాంశం. ఇక ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలతో పాటు జేపీ, కొణతాల రామక్రుష్ణ సహా పలువురు పాల్గొన్నారు. అయితే ఆ సందర్భంగా ముగ్గురు సభ్యులతో ఓ సబ్ కమిటీ నియమించడం విశేషంగా మారింది.

పవన్ కళ్యాణ్ నియమించిన సబ్ కమిటీలో జగన్ అనుచరుడికి ప్రధాన స్థానం లభించింది. గడిచిన ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ కి ఈ కమిటీలో స్థానం దక్కింది. అంతకుముందు ఆయన పీఆర్పీ తరుపున గుంటూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ ప్రస్తుతం ఆయన వైసీపీలో కొనసాగుతున్నారు. అయినా ఆయనకు పవన్ పిలిచి, ప్రత్యేక స్థానం కల్పించడం వెనుక కారణాలపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. చంద్రశేఖర్ ఐఏఎస్ అధికారిగానే కాకుండా, ఓ కాంట్రాక్ట్ సంస్థ అధినేతగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా కొంత గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తిని ఐవైఆర్ క్రుష్ణారావు, పద్మనాభయ్యతో కలిపి కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా పవన్ ఏం ఆశిస్తున్నారన్నది చర్చనీయాంశంగా తయారయ్యింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగానీ తోట చంద్రశేఖర్ పనిచేసే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించిన జనసేనాని తీరు మీద టీడీపీలో భిన్న స్వరాలు వినిపిస్తుండడం విశేషం. పవన్ మనోడేనని చంద్రబాబు చెబుతున్నప్పటికీ చివరకు ఎటు మలుపు తిరుగుతుందోననే ఆందోళన మాత్రం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.






Related News

chinthamaneni

మ‌ళ్లీ చింత‌మ‌నేని దౌర్జన్యం

Spread the loveప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింత‌మనేని ప్ర‌భాక‌ర్ రెచ్చిపోతూనే ఉన్నారు. ఇప్ప‌టికే అనేక‌మందిపై దురుసుగా ప్ర‌వ‌ర్తించి వార్త‌ల‌కెక్కినRead More

jakkampudi

జ‌గ‌న్ మీద వారి కోపం ఎందుకు?

Spread the loveజ‌గ‌న్ కుటుంబంతో వారిది అన్యోన్య బంధం. అంది కూడా దివంగ‌త నేత‌ల వార‌స‌త్వం కావ‌డం విశేషం. అందుకుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *