టీడీపీ ఆఖరి ఆశలు గల్లంతు

kakinada
Spread the love

పరిస్థితులు అనుకూలించకపోతే తాడే పామై కరుస్తుందన్న చందంగా మారింది. తాజాగా కోర్టు తీర్పులు కూడా తెలుగుదేశం పార్టీకి మింగుడుపడని స్థాయిలో ఉన్నాయి. వరుసగా వస్తున్న తీర్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే సదావర్తి భూముల వేలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి చెంప పెట్టులా మారింది. ఇక తాజాగా అన్నింటికీ మించి కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలకు కూడా కోర్ట్ కారణంగా మారింది. ప్రభుత్వం పలుమార్లు వాయిదా వేసినప్పటికీ చివరకు కోర్ట్ జోక్యం చేసుకోవడంతో ఎన్నికలు తప్పనిసరిగా మారాయి. అయినా వాటిని వాయిదా వేయించడానికి కాకినాడకు చెందిన ఎమ్మెల్యే సహా టీడీపీ పెద్దలు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ చివరకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల నిలుపుదల సాధ్యం కాదని కోర్ట్ తేల్చేయడంతో ఇక బరిలో దిగి అద్రుష్టం పరీక్షించుకోక తప్పని పరిస్థితి టీడీపీకి ఎదురయ్యింది. ఎన్నికలు వాయిదా పడతాయన్న ఆఖరి ఆశలు కూడా తొలగిపోవడంతో తెలుగుదేశం పెద్దలకు ఇక రంగంలో దిగక తప్పని స్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో కాకినాడ ఎన్నికలు ఇప్పుడు అనివార్యంగా ముందుకొచ్చాయి. ఈ నెల 29న పోలింగ్ జరగబోతోంది. అంటే నంద్యాల ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే పోలింగ్ జరగబోతోంది. దాంతో నంద్యాల ఫలితాలు కాకినాడను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. నంద్యాలలో గెలిచిన పార్టీకి కాకినాడలో మంచి ఊపు వస్తుందనడంలో సందేహం లేదు. మధ్యస్తంగా ఉన్న ఓటర్లు మొగ్గు చూపే అవకాశాలు కూడా ఉన్నాయి. దాంతో ఇప్పుడు కాకినాడ స్థానిక ఎన్నికలే అయినా రాష్ట్రస్తాయిలో ప్రాధాన్యత సంతరించుకోవడం విశేషంగా మారింది. ఉభయ పార్టీలు హోరాహోరీగా తలపడడం ఖాయంగా మారుతోంది.






Related News

TDP WEST PEETALA

బాబుతో పీతల సుజాత వైరం ముదిరింది…

Spread the loveఏపీలో అధికార పార్టీ వ్యవహారాలు ఆసక్తిగా మారుతున్నాయి. నేతల మధ్య విబేధాలు కొంప ముంచేస్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికేRead More

yanamala

యనమల సీన్ అయిపోయిందా..?

Spread the loveఆయన ఏపీలో ఆర్థికమంత్రి. అంతేకాదు టీడీపీలో సీనియర్ నేత. రాజకీయంగా అవగాహన ఉన్న నాయకుడే కాకుండా వివిధRead More

  • టీడీపీలో కుర్చీలాట‌
  • నీళ్లేవి బాబు..!
  • ఆర్ నారాయణ మూర్తిని అడ్డుకున్నారు
  • ముద్రగడ మాట మార్చేశారా
  • బెట్టింగ్, భూ ఆక్రమణే బాబు ఎజెండా
  • నంద్యాల చేతుల్లో కాకినాడ భవితవ్యం
  • ఓవర్ టూ కాకినాడ..
  • టీడీపీ ఆఖరి ఆశలు గల్లంతు
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *