టీడీపీకి క్లారిటీ వ‌చ్చేసింది…

Hyderabad: TDP President N Chandrababu Naidu's son Nara Lokesh is felicitated on the first day of the party's  Mahanadu at Gandipet near Hyderabad on Wednesday. PTI Photo (PTI5_27_2015_000150A)
Spread the love

తూర్పు గోదావ‌రి జిల్లాలో టీడీపీ మ‌రోసారి ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటాల‌ని స్కెచ్ వేస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగా పావులు క‌దుపుతోంది. జ‌న‌సేన‌, బీజేపీ దూర‌మ‌యిన‌ప్ప‌టికీ ఒంట‌రిగా సాగ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో ఆ జిల్లాలో కీల‌క‌మ‌యిన జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ రాజ‌కీయాల్లో క్లారిటీ వ‌చ్చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. వాస్త‌వానికి గ‌డిచిన మూడు ఎన్నిక‌లుగా ఇక్క‌డ టీడీపీ ఓట‌మి పాల‌వుతూ వ‌స్తోంది. చివ‌రిగా 1999లో జ్యోతుల నెహ్రూ టీడీపీ నుంచి గెలిచారు. ఆ త‌ర్వాత 2004లో ఆయ‌న టీడీపీ త‌రుపున బ‌రిలో దిగి ప‌రాజ‌యం పాల‌య్యారు. 2009, 2014లో జ్యోతుల చంటిబాబుని అభ్య‌ర్థిగా నిలిపినా టీడీపీ గెల‌వ‌లేక‌పోయింది.

అయితే రాబోయే 2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి టీడీపీ త‌రుపున జ్యోతుల నెహ్రూ రంగంలో దిగుతార‌ని ఇప్ప‌టికే టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప్ర‌క‌టించారు. 2014లో వైసీపీ త‌రుపున గెలిచిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఆయ‌న టీడీపీలో ఉన్నారు,. ఆయ‌న త‌న‌యుడు జ్యోతుల న‌వీన్ జెడ్పీ చైర్మ‌న్ గా సాగుతున్నారు. దాంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థిగా నెహ్రూ ఖాయం అనే ప్ర‌చారం ఊపందుకుంది. ఈ నేప‌థ్యంలో చంటిబాబు వైసీపీ కండువా క‌ప్పేసుకున్నారు. అదే స‌మ‌యంలో ఈ సీటు మీద కొంత పెట్టుకున్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న తోట న‌ర‌సింహానికి కూడా స్ప‌ష్ట‌త ఇచ్చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న కాకినాడ ఎంపీ సీటు కి గానీ, లేకుంటే కాకినాడ ఎమ్మెల్యే సీటు కూడా ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాలున్నాయి. జ‌గ్గంపేట‌లో మాత్రం జ్యోతుల‌కి లైన్ క్లియ‌ర్ అయ్యింద‌ని చెబుతున్నారు.

దాంతో జ‌గ్గంపేట రాజ‌కీయాలు చ‌ర్చ‌నీయాంశాలుగా మారుతున్నాయి. అంద‌రిలో ఆస‌క్తిని రాజేస్తున్నాయి. తోట న‌ర‌సింహం స‌హ‌క‌రిస్తే జ్యోతుల‌కి గ్యారంటీ అని చెప్ప‌వ‌చ్చు. కానీ వారిద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త మీదే టీడీపీ ప‌రిస్థితి ఆధార‌ప‌డి ఉంటుంది.






Related News

7500_Deputy CM Chinarajappa

చిన‌రాజ‌ప్ప‌కి స్కెచ్ వేస్తున్న సొంత పార్టీ

Spread the loveఇదో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌ల‌య్యింది. గ‌తంలో ఎమ్మెల్సీగా మాత్ర‌మే ప‌నిచేసిన ఆయ‌న తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావ‌డంతోనేRead More

636593328862218666

జ‌గ‌న్ కి జై కొట్టిన మ‌రో సినీ న‌టుడు

Spread the loveఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్ర‌భుత్వ ప‌క్షం ఇప్ప‌టికే ప్ర‌జా వ్య‌తిరేక‌త‌తో స‌త‌మ‌తం అవుతోంది. మ‌రోవైపు విప‌క్షRead More

  • కీల‌క ప్రాంతంలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి
  • టీడీపీకి జ‌న‌సేన షాక్
  • ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా మాజీ మంత్రి!
  • వైసీపీలోకి సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య
  • టీడీపీకి క్లారిటీ వ‌చ్చేసింది…
  • గోదావ‌రిలో టీడీపీకి పెద్ద గండి…!
  • టీడీపీ ఎమ్మెల్యేకి త‌ప్పిన ముప్పు
  • జ‌న‌సేనానికి ముద్ర‌గ‌డ మ‌ద్ధ‌తు
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *