Main Menu

టీడీపీ రెండు నాలుక‌లు…

Spread the love

చంద్ర‌బాబు ది రెండు క‌ళ్ల సిద్ధాంతం అన‌డంలో సందేహం లేదు. ఆ విష‌యం ఆయ‌నే చెప్పేశారు. ఇప్పుడు ఆయ‌న అనుచ‌రులు కూడా అదే ధోర‌ణిలో సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. చివ‌ర‌కు తెలుగుదేశం పార్టీ యావ‌త్తూ రెండు నాలుక‌ల తీరుతో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు ఎన్నిమార్లు మాట మార్చేశారో లెక్కించ‌డం కూడా క‌ష్ట‌మే. నాలుగేళ్ల కాలంలో ఆయ‌న న‌ల‌భైర‌కాల వాద‌న‌లు చేశారు. ఇప్ప‌టికీ ఆయ‌న ఓ మాట మీద ఉంటున్న‌ట్టు చెప్ప‌డం క‌ష్ట‌మే.

అయితే తాజాగా టీడీపీ ఎంపీ తోట న‌రసింహం వాద‌న మ‌రింత విడ్డూరంగా ఉంది. ప్ర‌త్యేక హోదా కోసం ఎలాంటి త్యాగాల కోస‌మైనా సిద్దంకావాల‌ని ఏపీ ఆశిస్తోంది. ఏపీ ప్ర‌యోజ‌నాలు కాపాడ‌డానికి తాము ఏదైనా చేస్తామ‌ని టీడీపీ కూడా చెబుతోంది. కానీ తోట న‌ర‌సింహం మాత్రం టీడీపీ లోక్ స‌భా ప‌క్ష నేత‌గా ఉండి ఆయ‌న మాత్రం రాజీనామాలు చేసే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చేశారు. రాజీనామాల వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని చెప్పేశారు. పైగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామంటూ వైసీపీ చేస్తామంటున్న రాజీనామాల‌ను పొలిటిక‌ల్ డ్రామా గా చెప్పేశారు.

అదే స‌మ‌యంలో టీడీపీ ఎంపీ పండుల ర‌వీంద్ర‌బాబు మాత్రం తాము ఎలాంటి త్యాగాల‌క‌యినా సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఒకే పార్టీకి, ఒకే జిల్లాకు చెందిన ఎంపీలు త‌లో మాట మాట్లాడుతున్న తీరు ఆశ్చ‌ర్యంగా క‌నిపిస్తోంది. సామాన్య జ‌నాల‌ను వంచించే విష‌యంగా ప‌లువురు భావిస్తున్నారు. త‌లో మాట మాట్లాడ‌డం ద్వారా గంద‌ర‌గోళం సృష్టించే య‌త్నం సాగుతోంద‌ని భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో అవిశ్వాం తీర్మానం విష‌యంలో చ‌ర్చ సాగుతున్న స‌మ‌యంలో రాజీనామాల‌కు కూడా సిద్ధ‌ప‌డ‌ని పార్టీ, కేంద్రంలో భాగ‌స్వామ్యం వ‌దులుకోవ‌డానికి సిద్దంగా లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. దాంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్ని మాట‌లు చెప్పినా, జ‌గ‌న్ స‌వాల్ విసిరినా టీడీపీ మాత్రం అమ‌రావ‌తిలో ఆంద్రా గొంతు, హ‌స్తిన‌లో క‌మ‌లం గొంతు వినిపించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ఈ ప‌రిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.






Related News

ఫిబ్ర‌వ‌రి నాటికి క్లారిటీ వ‌స్తుందంటున్న ప‌వ‌న్

Spread the loveజ‌న‌సేన అధినేత ప‌ర్య‌ట‌న‌లు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు ఉత్త‌రాంధ్ర‌, గోదావ‌రి జిల్లాల యాత్ర‌లు ముగించుకుని ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమ‌లోRead More

ఆపార్టీలోనే చేర‌తానంటున్న వ‌ట్టి

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌ల్లో ఒక‌రిగా పేరున్న వ‌ట్టి వ‌సంత‌కుమార్ కి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో గ‌ట్టిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *