Main Menu

వైసీపీ సీనియర్ కి వలవేసిన టీడీపీ

Spread the love

ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వేగంగా ఎత్తులు వేస్తోంది. విపక్షాన్ని చిత్తు చేసే యత్నాల్లో కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా జగన్ క్యాంపులో గందరగోళం స్రుష్టించడానికి తగ్గట్టుగా పథక రచన చేస్తోంది. ప్రధానంగా వైసీపీకి ఈసారి ఊతమిస్తుందని భావిస్తున్న కాపు సామాజికవర్గంలో, గోదావరి జిల్లాల్లో గండి కొట్టేయత్నం చేస్తోంది. దానిలో భాగంగా వైసీపీ సీనియర్ నాయకుడు చలమలశెట్టి సునీల్ కి వలవేసినట్టు సమాచారం.

chalamalasetty sunil

గతంలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేసి కాకినాడ నుంచి పార్లమెంట్ కి పోటీ చేసిన సునీల్ 2009లో పళ్లంరాజు చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్నప్పటికీ వైసీపీ ఆవిర్భావంతో ఫ్యాన్ పార్టీలో చేరారు. జగన్ తో సన్నిహితంగా మెలుగుతూ 2014 ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ కి రెండోసారి బరిలో దిగారు. కానీ టీడీపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో సుమారు 2300 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ సహా తన వ్యాపారాలలో గడుపుతూ అప్పుడప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సునీల్ మూడోసారి కూడా పార్లమెంట్ బరిలో దిగాలనే ఆశతో ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ ఆయనకు వైసీపీ నేతలతో సఖ్యత కనిపించడం లేదు. ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో ఆయనకు విబేధాలున్నాయి. మరికొందరు నేతలతో కూడా ఆయన అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు.

దానిని సాకుగా వాడుకుని వైసీపీని దెబ్బకొట్టే వ్యూహంలో భాగంగా టీడీపీ నేతలు సునీల్ కి భారీ ఆఫర్ ఇఛ్చినట్టు కనిపిస్తోంది. తమ పార్టీలో చేరితో టికెట్ కన్ఫర్మ్ చేస్తామని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం కాకినాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తోట నరసింహం ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే అభిప్రాయంతో ఉన్నారు. టీడీపీలో అవకాశం దక్కకపోతే వైసీపీలో చేరాలనే ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. దాంతో ఆయన స్థానంలో సునీల్ కి అవకాశం కట్టబెట్టడం సులువవుతోందనే అభిప్రాయం టీడీపీ పెద్దల్లో కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనను చినబాబు ద్వారా చంద్రబాబు వద్దకు కూడా చేర్చినట్టు సమాచారం. మధ్యలో సునీల్ సోదరుడి ద్వారా టీడీపీ పావులు కదుపుతోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. తమ్ముడి ఒత్తిడితో సునీల్ జెండా మార్చేసి మూడో ఎన్నికల్లో మూడో పార్టీ తరుపున రంగంలో దిగితే ఆశ్చర్యకర అంశంగానే భావించాలి.


Related News

చింత‌మ‌నేని వీడియో: మార్ఫింగ్ ఎక్క‌డా?

Spread the loveదెందులూరు ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని మాట‌లు మంట‌లు రేపాయి. చంద్ర‌బాబు స‌ర్కారుని చిక్కుల్లో నెట్టాయి. ఎస్సీలRead More

బాబుకి త‌ల‌నొప్పిగా మారిన నోటిదురుసు ఎమ్మెల్యే

Spread the loveఏపీ ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ వ్య‌వ‌హారం నిత్యం సంచ‌ల‌నంగానే ఉంటుంది. ఆయ‌న నోరు, చేత‌లు కూడాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *