Main Menu

టీడీపీకి దూరమవుతున్న ఎంపీ

Spread the love

ఏపీలో తెలుగుదేశం పార్టీకి పలువురు నేతలు దూరమయ్యే ప్రమాదం దాపురిస్తోంది. ఎన్నికల వేళ ఇది మరింత వేగంగా జరగవచ్చనే అంచనాలున్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే కొందరు నేతలు ఇతర పార్టీలతో టచ్ లోకి వెళుతున్నారు. తమకు సేఫ్ జోన్ అనుకుంటే గోడ దూకేందుకు సన్నాహాల్లో ఉన్నారు.

ఇప్పటకిే పలువురు టీడీపీ నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. తాజాగా ఈ వరుసలో ఓ కీలక నేత పేరు చేరింది. చాలాకాలంగా ఆయన వచ్చే ఎన్నికల కోసం సురక్షిత స్థానాల కోసం ఆయన ఎదురుచూస్తున్నట్టు ప్రచారం సాగింది. దానికి తగ్గట్టుగానే వైసీపీ వైపు ఆలోచన చేసినప్పటికీ తగిన హామీ దక్కలేదని చెబుుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున బరిలో దిగేందుకు టీడీపీ లోక్ సభ పక్షా నాయకుడు తోట నరసింహం నిర్ణయించుకున్నారని ఆయన అనుచరులే చెబుతుండడం విశేషం.

గతంలో జగ్గంపేట అసెంబ్లీ సీటు నుంచి ఆయన రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. వైెెఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య మంత్రి వర్గాల్లో ఆయన పనిచేశారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ని వీడి టీడీపీలో చేరారు. టీడీపీ తరుపున కాకినాడ ఎంపీ సీటుకి బరిలో దిగి స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. సామాజిక కోటాలో మంత్రి పదవి ఆశించినప్పటికీ చివరకు ఆయనకు లోక్ సభలో పార్టీకి నాయకుడిగా గుర్తింపు దక్కింది. అయితే వచ్చే ఎన్నికల్లో తనకు ఎంపీ సీటు కాకుండా ఎమ్మెల్యే సీటు కావాలని ఆయన ఆశిస్తున్నారు. అయితే తెలుగుదేశంలో ప్రస్తుతం తోట నరసింహం ఆశిస్తున్న జగ్గంపేట సీటు ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి ఖాయం చేస్తూ నారా లోకేష్ ప్రకటన చేశారు.

ఈ పరిణామాలతో తోట నరసింహం తనకు మిత్రుడైన పవన్ కళ్యాణ్ అనుచరులతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అదే సమయంలో తన మిత్రుడు నాదెండ్ల మనోహర్ కూడా జనసేనలో ఉండడంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో తూగో జిల్లాలో తనకు సురక్షితం అని భావిస్తున్న తరుణంలో తోట నరసింహం జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే గడిచిన కొన్ని నెలలుగా తోట నరసింహం టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. చివరకు చంద్రబాబు హస్తిన పర్యటనలో కూడా ఆయన కనిపించలేదు. దాంతో ఇక తోట టీడీపీకి టాటా చెప్పేందుకు సన్నద్ధమయ్యారనే వాదన బలపడుతోంది. దాంతో కీలక జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారే పరిస్థితి దాపురిస్తుందని భావిస్తున్నారు.


Related News

చింత‌మ‌నేని వీడియో: మార్ఫింగ్ ఎక్క‌డా?

Spread the loveదెందులూరు ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని మాట‌లు మంట‌లు రేపాయి. చంద్ర‌బాబు స‌ర్కారుని చిక్కుల్లో నెట్టాయి. ఎస్సీలRead More

బాబుకి త‌ల‌నొప్పిగా మారిన నోటిదురుసు ఎమ్మెల్యే

Spread the loveఏపీ ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ వ్య‌వ‌హారం నిత్యం సంచ‌ల‌నంగానే ఉంటుంది. ఆయ‌న నోరు, చేత‌లు కూడాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *