తూర్పున మరో తగాదా

East_Godavari_district
Spread the love

తూర్పు గోదావరి జిల్లా వ్యవహారాల్లో మరో తగాదా తెరమీదకు వచ్చింది. చాలాకాలంగా పెద్దాపురంలో చాపకింద నీరులా ఉన్న వివాదం ముందుకొచ్చింది. డిప్యూటీ సీఎం చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో పట్టు కోసం చినరాజప్పతో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు ఢీ అంటే ఢీ అంటున్నారు. తాను లోకల్ అంటూ సవాల్ విసురుతున్నారు. రాజప్పని సవాల్ చేస్తూ యనమల, జ్యోతుల నెహ్రూని ముందుకు తెస్తున్నారు. జిల్లాలో సీనియర్ నాయకులుగా ఉన్న వారి తోడుతో పెద్దాపురంలో రాజప్పకి సెగ తగిలేలా చేయాలని ఆలోచిస్తున్నారు.

తాజాగా బహిరంగలేఖ తో బొడ్డు భాస్కర రామారావు నేరుగా డిప్యూటీ సీఎంని ఛాలెంజ్ చేశారు. దాంతో పెద్దాపురం రాజకీయాల్లో ఇదో సంచలనంగా మారింది. నిజానికి పెద్దాపురంలో చినరాజప్ప కన్నా బొడ్డు సీనియర్. గతంలో ఆయన రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. మొన్నటి ఎన్నికల్లో కోనసీమ నుంచి వచ్చిన రాజప్ప టికెట్ దక్కించుకుని విజయం సాధించి, ఏకంగా డిప్యూటీ సీఎం అయిపోయారు.

అప్పటి నుంచే వచ్చే ఎన్నికలకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తున్నారు. పెద్దాపురంలో బలంగా పాగా వేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే మొన్నటి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన బొడ్డు, ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో తనకే పెద్దాపురం టికెట్ దక్కుతుందని ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా రాజప్పని సాగనంపడానికి స్కెచ్ వేస్తున్నారు. ప్రస్తుతం పెద్దాపురంలో టీడీపీ బలం తగ్గుతుండడం, రాజప్పకి వ్యతిరేకత పెరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో బొడ్డు వేగంగా అడుగులు వేస్తున్నారు. దాంతో తూ గో జిల్లా టీడీపీకి మరో తలనొప్పి ఖాయం అవుతోంది.


Related News

maddala sunita in ycp

వైసీపీలోకి మరో మాజీ ఎమ్మెల్యే

Spread the loveఇటీవల పలువురు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి క్యూ కడుతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పలువురు నేతలు వైసీపీRead More

East_Godavari_district

తూర్పున మరో తగాదా

Spread the loveతూర్పు గోదావరి జిల్లా వ్యవహారాల్లో మరో తగాదా తెరమీదకు వచ్చింది. చాలాకాలంగా పెద్దాపురంలో చాపకింద నీరులా ఉన్నRead More

 • చిక్కులు కొనితెచ్చుకున్న చినరాజప్ప
 • జగన్ కి కొత్త సమస్యలు షురూ
 • ప‌శ్చిమ టీడీపీలో చిచ్చు ..
 • రాధాకృష్ణ‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చిన బిరుదు…!
 • చిన‌రాజ‌ప్ప‌కి స్కెచ్ వేస్తున్న సొంత పార్టీ
 • జ‌గ‌న్ కి జై కొట్టిన మ‌రో సినీ న‌టుడు
 • కీల‌క ప్రాంతంలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి
 • టీడీపీకి జ‌న‌సేన షాక్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *