Main Menu

బాబుతో పీతల సుజాత వైరం ముదిరింది…

Spread the love

ఏపీలో అధికార పార్టీ వ్యవహారాలు ఆసక్తిగా మారుతున్నాయి. నేతల మధ్య విబేధాలు కొంప ముంచేస్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల వ్యక్తిగత వైరం పార్టీకి చేటు చేస్తుండగా..తాజాగా కొంతకాలం పాటు స్నేహం చేసి విడిపోయిన నేతల మధ్య విబేధాలు తీవ్రమవుతున్నాయి. పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పీతల సుజాత కొద్దికాలం క్రితమే మంత్రిపదవి కోల్పోయింది. దానికి ప్రధాన కారణం జిల్లాకే చెందిన కొందరు నేతలు ఒత్తిడి చేయడమేనని అందరికీ తెలిసిన సత్యం. ముఖ్యంగా ఎంపీ మాగంటి బాబుకి, పీతల సుజాతకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి వచ్చేసింది. దాంతో మాగంటి సామాజికవర్గీయులంతా పీతల సుజాతకు వ్యతిరేకంగా మారిపోయారు. ఆమె సొంత నియోజకవర్గంలో చింతలపూడిలో చిచ్చు రేపుతున్నారు. నిత్యం వర్గపోరుతో పార్టీ దాదాపు రెండుగా చీలిపోయింది.

ఈ సమస్య పరిష్కారం కోసం మంత్రులు పితాని సత్యన్నారాయణ, ప్రత్తిపాటి పుల్లరావులను చంద్రబాబు పనిలో దింపారు. ఇద్దరు మంత్రులు కలిసి ఏలూరు నేతలందరితో కలిపి వేసిన సమావేశం అసలుకే ఎసరు తెస్తుందా అన్న సందేహం కనిపిస్తోంది. విబేధాలు పరిష్కరించడానికి సమావేశం ఏర్పాటు చేస్తే చివరకు టీడీపీ కార్యకర్తలు మంత్రుల మీదే కస్సుమన్నారు. సఖ్యతగా ఉండాలని చెప్పినందుకు కొందరు నేతలు పితాని సత్యన్నారాయణ మీద మండిపడ్డారు. దాంతో ఒక్కసారిగా వేడి రాజుకున్నట్టయ్యింది. జిల్లా అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మీ కూడా పీతల సుజాతకు అండగా ఉన్నారని మాగంటి వర్గం భావిస్తోంది. పితాని కూడా అదే కోవలో చేరి మాగంటి వర్గానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సామరస్యం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో రచ్చ రచ్చ చేయడం కలకలం రేపింది.

ముఖ్యంగా అట్టడుగు సామాజికవర్గాలను మాగంటి బాబు అణచివేస్తున్నారని పీతల సుజాత వర్గీయులు భావిస్తున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆయన చెప్పుచేతల్లో ఉండకుండా స్వతంత్ర్యంగా పనిచేయడానికి ప్రయత్నించడంతోనే ఈ ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్నది పరిశీలకుల వాదన. దాంతో అప్పటి వరకూ సఖ్యంగా కనిపించిన పీతల సుజాత, మాగంటి బాబు ఇప్పుడు చింతలపూడి వేదికగా సత్తా చాటుకునే వరకూ వచ్చేశారు. ఈ పరిణామాలు టీడీపీని కలవరపెడుతున్నాయి. తాజాగా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తల అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.


Related News

హర్ష‌కుమార్ అటు మొగ్గు చూప‌డానికి కార‌ణం అదే..!

Spread the loveమాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ కూడా మ‌రో అడుగు వేస్తున్నారు. త్వ‌ర‌లో కొత్త కండువా క‌ప్పుకోబోతున్నారు. ఇప్ప‌టికే గ‌డిచినRead More

మ‌ళ్లీ చింత‌మ‌నేని వీరంగం, ప‌గోలో వివాదం

Spread the loveవివాదాస్ప‌ద ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌రోసారి వీరంగం చేశారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు శాస‌న‌స‌భ్యుడు త‌న స్థాయికిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *