Main Menu

రాజీనామాకు సిద్దం అంటున్న సోము వీర్రాజు

somu veerraju
Spread the love

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎత్తులు పై ఎత్తుల‌తో సాగుతున్నాయి. పై చేయి కోసం టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. ప‌రువు పోకుండా చూసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ భావిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగా కేంద్ర మంత్రుల రాజీనామాల ప్ర‌స్తావ‌న రాగానే రాష్ట్రంలో కూడా ఇద్ద‌రు మంత్రులు ప‌ద‌వులుకు రాజీనామా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్ప‌టికే బీజేపీ అధిష్టానం నుంచి అందిన ఆదేశాల‌తో త‌న రాజీనామా ప‌త్రాన్ని కార్య‌ద‌ర్శికి అప్ప‌గించేశాన‌ని మంత్రి కామినేని ప్ర‌క‌టించేశారు కూడా. ఈ నేప‌థ్యంలో బీజేపీలో మ‌రో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌ల‌య్యింది.

మంత్రుల‌తో పాటుగా తాను కూడా రాజీనామా చేస్తానంటూ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్ర‌తిపాదించ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. టీడీపీ మీద నైతికంగా పై చేయి సాధించాల‌ని వీర్రాజు ప్ర‌తిపాదిస్తున్న‌ట్టు స‌మాచారం. టీడీపీ మ‌ద్ధ‌తుతో గెలిచిన ఎమ్మెల్సీ సీటు త‌న‌కు వ‌ద్ద‌ని సోము చెబుతున్న‌ట్టు స‌న్నిహితుల అభిప్రాయం. ఎన్డీయే నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌స్తే ఇక వారి మద్ధ‌తు వ‌చ్చిన ఎమ్మెల్సీ ప‌ద‌విని వ‌దులుకోవ‌డానికి తాను సిద్ధంగా ఉన్న‌ట్టు సోము వీర్రాజు అధిష్టానానికి స‌మాచారం అందించిన‌ట్టు తెలుస్తోంది.

అయితే రాజ‌కీయంగా ఏది ప్ర‌యోజ‌నం అన్న‌ది దృష్టిలో పెట్టుకుని నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ ఇద్ద‌రు మంత్రులు కేంద్ర క్యాబినెట్ నుంచి వ‌స్తే వెంట‌నే ఇద్ద‌రు రాష్ట్ర మంత్రులు రాజీనామా చేయాల‌ని మాత్రం ఆదేశాలు వ‌చ్చాయి. అంత‌కుమించి నిర్ణ‌యం తీసుకోవాలంటే ముందు టీడీపీ వ్యూహం తెలుసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. టీడీపీ వైఖ‌రిని బ‌ట్టి ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయాలా వ‌ద్దా అన్న‌ది నిర్ణ‌యించుకోవాల‌ని సూచింన‌ట్టు తెలుస్తోంది. మ‌రో ఎమ్మెల్సీ మాధ‌వ్ మాత్రం జ‌నం ఓట్ల‌తో గెలిచారు కాబ‌ట్టి, ఆయ‌న రాజీనామా అవ‌స‌రం లేద‌ని, కానీ సోము వీర్రాజు మాత్రం రాజీనామా చేయ‌డం ద్వారా చంద్ర‌బాబుని మ‌రింత డిఫెన్స్ లోకి నెట్టే వ్యూహం సిద్ధం చేస్తున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. టీడీపీ అడుగుల‌ను బ‌ట్టి క‌మ‌ల‌నాధులు ప్ర‌త‌య్నిస్తార‌ని చెప్ప‌వ‌చ్చు.






Related News

chinthamaneni

మ‌ళ్లీ చింత‌మ‌నేని దౌర్జన్యం

Spread the loveప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింత‌మనేని ప్ర‌భాక‌ర్ రెచ్చిపోతూనే ఉన్నారు. ఇప్ప‌టికే అనేక‌మందిపై దురుసుగా ప్ర‌వ‌ర్తించి వార్త‌ల‌కెక్కినRead More

jakkampudi

జ‌గ‌న్ మీద వారి కోపం ఎందుకు?

Spread the loveజ‌గ‌న్ కుటుంబంతో వారిది అన్యోన్య బంధం. అంది కూడా దివంగ‌త నేత‌ల వార‌స‌త్వం కావ‌డం విశేషం. అందుకుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *