ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా మాజీ మంత్రి!

Pydikondala-ManikyalaRao-62-e1493218491784
Spread the love

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడి మార్పు ఖాయం అయ్యింది. చాలాకాలంగా ఊహాగానాలు చెల‌రేగినప్ప‌టికీ ఎట్ట‌కేల‌కు మార్పు ఖాయం చేశారు. విశాఖ ఎంపీ కంభంపాటి హ‌రిబాబు స్థానంలో మాజీ మంత్రి పైడికొండ‌ల మాణిక్యాల‌రావుని ఖ‌రారు చేసిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. హ‌రిబాబుకి కేంద్ర మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మాణిక్యాల‌రావు కొద్దిరోజుల క్రితం వ‌ర‌కూ దేవాదాయ‌శాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. టీడీపీ బంధం తెగిపోవ‌డంతో త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ని రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడిగా నియ‌మించ‌డం వెనుక సామాజిక స‌మీక‌ర‌ణాలే కార‌ణంగా చెబుతున్నారు. ఈ ప‌ద‌వి కోసం సోము వీర్రాజు చాలాకాలం పాటు ప్ర‌య‌త్నించారు. కానీ ఆయ‌న ఆశ‌లు పండ‌లేదు. ఆయ‌న‌కు స‌న్నిహితుడైన మాణిక్యాల‌రావుకి క‌ట్ట‌బెట్ట‌డం బీజేపీ వ్యూహాత్మ‌క నిర్ణ‌యంగా భావిస్తున్నారు. మృధుస్వభావిగా, వివాదర‌హితుడిగా క‌నిపించే మాణిక్యాల‌రావు ఎంపిక వెనుక అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని భావిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నేప‌థ్యం, రామ్ మాధ‌వ్ అండ‌దండ‌లు పైడికొండ‌ల‌కు క‌లిసి వ‌చ్చాయంటున్నారు. సోము వీర్రాజు ని జాతీయ కార్య‌వ‌ర్గంలో కొన‌సాగించ‌డంతో పాటు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ పేరుని కూడా జాతీయ కార్య‌వ‌ర్గంలో జోడించిన‌ట్టు ప్రచారం మొద‌ల‌య్యింది.






Related News

7500_Deputy CM Chinarajappa

చిన‌రాజ‌ప్ప‌కి స్కెచ్ వేస్తున్న సొంత పార్టీ

Spread the loveఇదో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌ల‌య్యింది. గ‌తంలో ఎమ్మెల్సీగా మాత్ర‌మే ప‌నిచేసిన ఆయ‌న తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావ‌డంతోనేRead More

636593328862218666

జ‌గ‌న్ కి జై కొట్టిన మ‌రో సినీ న‌టుడు

Spread the loveఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్ర‌భుత్వ ప‌క్షం ఇప్ప‌టికే ప్ర‌జా వ్య‌తిరేక‌త‌తో స‌త‌మ‌తం అవుతోంది. మ‌రోవైపు విప‌క్షRead More

  • కీల‌క ప్రాంతంలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి
  • టీడీపీకి జ‌న‌సేన షాక్
  • ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా మాజీ మంత్రి!
  • వైసీపీలోకి సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య
  • టీడీపీకి క్లారిటీ వ‌చ్చేసింది…
  • గోదావ‌రిలో టీడీపీకి పెద్ద గండి…!
  • టీడీపీ ఎమ్మెల్యేకి త‌ప్పిన ముప్పు
  • జ‌న‌సేనానికి ముద్ర‌గ‌డ మ‌ద్ధ‌తు
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *