Main Menu

పోల‌వ‌రం ..మ‌ళ్లీ గంద‌ర‌గోళం!

Spread the love

పోల‌వ‌రం ప్రాజెక్ట్ విష‌యంలో మ‌ళ్లీ కొర్రీలు ప‌డుతున్నాయి. ఏపీ ప్ర‌జ‌ల జీవ‌నాడిగా, జాతీయ ప్రాజెక్ట్ గా ప్ర‌క‌టించిన ఈ బ‌హుళార్థ‌క సాధ‌క ప్రాజెక్ట్ విష‌యంలో ఎగువ రాష్ట్రాల అభ్యంత‌రాల‌తో ఏపీ ఆశ‌లు నీరుగారిపోయేలా క‌నిపిస్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్ట్ ఆదేశాల‌తో వ్య‌వ‌హారం మొద‌టికొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఓవైపు అంచ‌నా వ్య‌యంపైనే కేంద్ర రాష్ట్ర‌ప్ర‌భుత్వాల మ‌ధ్య ఎడ‌తెగ‌ని చ‌ర్చ‌లు సాగుతున్న ద‌శ‌లో ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ జ‌ర‌పాల్సిందేనంటూ సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

పోలవరం ప్రాజెక్టు ప్రభావంపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించి అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ ధర్మాసనం ఈ మేర‌కు ఉత్త‌ర్వులు విడుద‌ల చేసింది. పోలవరం ప్రాజెక్టు ముంపుపై సరైన అధ్యయనం జరగకుండా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, ఆ పనులను ఆపాలని ఒరిస్సా ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేయడంతో, స్టాప్‌ వర్కర్‌ ఆర్డర్‌పై పదే పదే స్టే ఇవ్వడంపై న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. పోలవరంపై పర్యావరణ అనుమతులు లేవని రేలా అనే స్వచ్ఛంద సంస్థ కూడా పిటిషన్‌ దాఖలు చేసింది. సరైన అధ్యయనం జరగకుండా ప్రాజెక్టు నిర్మిస్తే ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని ఒరిస్సా ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. తెలంగాణ తరపున వాదించిన వైద్యనాథన్‌, పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచారని దాని వల్ల భద్రాచలం, మణుగురు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని న్యాయ స్థానానికి తెలిపారు. 2011లోనే అధ్యయనం పూర్తి అయినందున ప్రజా అభిప్రాయ సేకరణ అవసరం లేదని ఏపి ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఈ వ్యాఖ్యలపై న్యాయమూర్తి స్పందిస్తూ ”ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా ప్రాజెక్టు ఎలా చేపడతారు? ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఎలా నిర్మాణం చేస్తారా” అని ప్రశ్నించారు.

ఒరిస్సా, ఛత్తీస్‌గడ్‌లు ప్రజాభిప్రాయ సేకరణకు సహకరించడం లేదని ఏపి ప్రభుత్వం తరపు న్యాయవాది వెల్లడించారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాభిప్రాయ సేకరణకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తెలపాలని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఎలాంటి యంత్రాంగం అవసరం, విధివిధానాలు, తదితర అంశాలను తెలుపుతూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖను ఆదేశించింది. శనివారం నాటికి అఫిడవిట్‌ దాఖలు చేయాలని, తదుపరి విచారణ తిరిగి సోమవారం చేస్తామని తెలిపింది. దాంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ నాలుగు రాష్ట్రాల్లో చేయాల్సి ఉన్న త‌రుణంలో ఈ వ్య‌వ‌హారం మ‌రింత సుదీర్ఘ‌కాలం సాగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వ వాద‌న‌ను సుప్రీంకోర్ట్ తీసిపుచ్చ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.


Related News

జ‌న‌సేన‌లో మ‌రో పోలీస్ అధికారి

Spread the loveవారం క్రితం రిటైర్మెంట్ తీసుకున్న సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. ఏలూరు రేంజ్ డీఐజీగాRead More

పార్టీ మారిన చిన‌రాజ‌ప్ప సోద‌రుడు

Spread the loveటీడీపీ నేత‌ల‌కు సొంత ఇంట్లోనే సానుకూల‌త క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే వ‌ర్ల రామ‌య్య‌, బుద్ధా వెంక‌న్న వంటిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *