Main Menu

టీడీపీకి షాక్: మ‌ళ్లీ పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యే

Spread the love

ఏపీలో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. వ‌రుస ప‌రిణామాలు పాల‌క టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మూలిగే న‌క్క‌పై తాటికాయ‌ప‌డ్డ చందంగా ఆపార్టీ కి మ‌రో ఎదురుదెబ్బ త‌ప్ప‌ద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్ప‌టికే కీల‌క గోదావ‌రి జిల్లాలో క‌ల‌త చెందుతున్న తెలుగుదేశం పార్టీకి తాజా ప‌రిణామాలు మ‌రింత స‌మ‌స్య తెచ్చిపెట్టేలా సాగుతున్నాయి. వైసీపీ త‌రుపున విజ‌యం సాధించి, ఆ త‌ర్వాత టీడీపీలోకి ఫిరాయించిన తూర్పు గోదావ‌రి జిల్లా ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే వ‌రుప‌ల సుబ్బారావు మ‌రోసారి ప‌క్క‌చూపులు చూస్తుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆయ‌న త్వ‌ర‌లోనే టీడీపీని వీడాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ప్ర‌త్తిపాడు నుంచి ఆయ‌న 2004లో కాంగ్రెస్ త‌రుపున గెలిచి, 2009లో ఓట‌మి పాల‌య్యారు. 2014లో వైసీపీ త‌రుపున గెలిచారు. ఆత‌ర్వాత తోడ‌ల్లుడు జ్యోతుల నెహ్రూతో క‌లిసి వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేశారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి అవ‌కాశం కోసం ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉందంటూ స‌ర్వేలు చూపించి ఆయ‌న‌కు సెగ పెడుతున్న‌ట్టు సందేహిస్తున్నారు. ఆయ‌న స్థానంలో డీసీసీబీ చైర్మ‌న్ వ‌రుపుల రాజాకి అవ‌కాశం క‌ల్పించేందుకు టీడీపీ నాయ‌క‌త్వం ఆలోచ‌న చేస్తున్న‌ట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజా కూడా సుబ్బారావుకి స్వ‌యంగా మ‌న‌వ‌డే కావ‌డం విశేషం. తాత‌కు ఎస‌రు పెట్టేలా మ‌న‌వ‌డి తీరు ఉండ‌డంతో వ‌రుపుల సుబ్బారావు త‌న దారి తాను చూసుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు.

అందుకు త‌గ్గ‌ట్టుగానే వ‌రుపుల సుబ్బారావు జ‌న‌సేన శిబిరంతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే సుబ్బారావు స‌మీప నేత, ఆయ‌న ఇంట్లోనే నివ‌శించే త‌మ్మ‌య్య‌నాయుడు జ‌న‌సేన‌కు జై కొట్టారు. దాంతో సుబ్బారావు కూడా ప‌వ‌న్ ప‌క్షాన చేర‌డానికి అదో సంకేత‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో ఫిరాయింపు ప్ర‌చారం ద్వారా చంద్ర‌బాబు మీద ఒత్తిడి తీసుకొచ్చి మ‌రోసారి త‌న‌కే టికెట్ ద‌క్కేలా చేసుకోవ‌డానికి సుబ్బారావు స్కెచ్ వేసిన‌ట్టు కొంద‌రు సందేహిస్తున్నారు. ఏమ‌యినా తాజాగా టీడీపీ వ్య‌వ‌హారాల్లో వ‌రుపుల సుబ్బారావు వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారుతోంది పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తోంది. ప్ర‌త్తిపాడులో హీట్ రాజేస్తోంది.






Related News

ఫిబ్ర‌వ‌రి నాటికి క్లారిటీ వ‌స్తుందంటున్న ప‌వ‌న్

Spread the loveజ‌న‌సేన అధినేత ప‌ర్య‌ట‌న‌లు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు ఉత్త‌రాంధ్ర‌, గోదావ‌రి జిల్లాల యాత్ర‌లు ముగించుకుని ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమ‌లోRead More

ఆపార్టీలోనే చేర‌తానంటున్న వ‌ట్టి

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌ల్లో ఒక‌రిగా పేరున్న వ‌ట్టి వ‌సంత‌కుమార్ కి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో గ‌ట్టిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *