Main Menu

టీడీపీ లో ఎస్సీల‌కిచ్చే గౌర‌వం ఇదేనా..?

Spread the love

ఏపీ తెలుగుదేశం నేత‌ల తీరు ప‌ట్ల ప‌లు విమ‌ర్శ‌లున్నాయి. గ‌తంలో చంద్ర‌బాబు పాల‌న‌లో ఒక కులాధిప‌త్యం క‌నిపిస్తోందంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి వారు బ‌హిరంగంగానే కామెంట్ చేశారు. వాస్త‌వంలో కూడా అలాంటి ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఆఖ‌రికి మంత్రులు కూడా ఒక సామాజిక‌వ‌ర్గం నేత‌లు ముందు స‌లాం చేయాల్సిందేనా అన్న ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప‌రిణామాలు దానికి అద్దంప‌డుతున్నాయి.

టీడీపీ అధికారంలోకి రాగానే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నుంచి చింత‌ల‌పూడి ఎమ్మెల్యేగా గెలిచిన పీత‌ల సుజాత‌కు ఏపీ క్యాబినెట్ లో చోటు ద‌క్కింది. తొలుత కొన్నాళ్లు బాగానే సాగింది. కానీ ఆత‌ర్వాత ఆమె సొంతంగా వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్ట‌డం కొంద‌రికి గిట్ట‌లేదు. దాంతో ఎంపీ మాగంటి బాబు, ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ తో ఆమెకు చిక్కులు వ‌చ్చాయి. చివ‌ర‌కు ఆమె సొంత ఇంట్లో డ‌బ్బు సంచి దొరికేటంత వ‌ర‌కూ వ్య‌వ‌హారం వెళ్లింది. చివ‌ర‌కు రేటింగ్స్ లో మొద‌టి స్థానంలో ఉన్న మంత్రిని తొల‌గించాల్సిందేనంటూ సొంత సామాజిక‌వ‌ర్గం నేత‌లు ఒత్తిడి చేయ‌డంతో చంద్ర‌బాబు ఆమెను సాగ‌నంపాల్సి వ‌చ్చింది.

ఆమె స్థానంలో ఉన్న‌త విద్యావంతుడు, ఉపాధ్యాయుడిగా సుదీర్ఘ‌కాలం ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జ‌వ‌హార్ కి చాన్స్ వ‌చ్చింది. ప్ర‌జా స‌మస్య‌ల ప‌ట్ల కొంత చొర‌వ ప్ర‌ద‌ర్శిస్తార‌ని, జ‌నంలో క‌లిసి సాగేందుకు ప్రాధాన్య‌త‌నిస్తార‌ని మంత్రి జ‌వ‌హార్ కి కొంత పేరుంది. కానీ దానిని కొంద‌రు నేత‌లు స‌హించే ప‌రిస్థితి లేదు. ముఖ్యంగా కొవ్వూరు కేంద్రంగా ఇసుక మాఫియాలో తెగ‌బ‌లిసిన ఓ టీడీపీ నేత‌, ఆ త‌ర్వాత పేకాట క్ల‌బ్బుల‌లో కోట్లు గ‌డించి రాజ‌కీయ పెత్త‌నం కోసం ప్ర‌య‌త్నం చేయ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారింది. త‌న మాట వినాల్సిందేనంటూ మంత్రికి ఆంక్ష‌లు పెట్ట‌డం కొవ్వూరులో కాక రాజేసింది.

చివ‌ర‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంత్రికి సీటు ఇవ్వొద్ద‌ని త‌న వ‌ర్గీయుల‌తో క‌లిసి సీఎం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేయ‌డం విశేషంగా మారింది. ప్ర‌జ‌లంతా విస్మ‌యం వ్య‌క్తం చేసే స్థితి వ‌చ్చింది. గ‌తంలో పీత‌ల సుజాత కి చెక్ పెట్టిన చందంగానే ఇప్పుడు జ‌వహార్ కి సెగ పెట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నిస్తే ప‌శ్చిమ‌లో టీడీపీ నేత‌లు ఒక సామాజిక‌వ‌ర్గం చేతుల్లో సాగాల్సిందేనా అన్న ప్ర‌శ్న వినిపిస్తోంది. త‌మ పంతం నెర‌వేర‌క‌పోతే అమాత్యుని ప‌ద‌వికి కూడా ఎస‌రు పెట్టే ప్ర‌య‌త్నం చేస్తారా అన్న ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. సౌమ్యుడిగా ఉన్న ఉన్న జ‌వ‌హార్ మీద సాగుతున్న వ్య‌వ‌హారాల‌తో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా వ్యాప్తంగా టీడీపీ ప‌రువు పోతుంద‌ని, త‌క్ష‌ణం అధిష్టానం స్పందించి, ఇలాంటి ప్ర‌య‌త్నాల‌కు చెక్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఎస్సీ, బీసీ వ‌ర్గాల్లో టీడీపీ ప‌రువు తీసే వ్య‌వ‌హారాల‌కు ఫుల్ స్టాప్ పెట్టాల‌ని సాధార‌ణ టీడీపీ శ్రేణులు కోరుతున్నారు.


Related News

హ‌ర్ష‌కుమార్ కి అలా… స‌బ్బం హ‌రికి ఇలా!

Spread the loveతెలుగుదేశం పార్టీ అధినేత అనూహ్య నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఏకంగా కాళ్లు మొక్కిన నేత‌ల‌ను కూడా క‌నిక‌రించ‌లేదు. జ‌గ‌న్Read More

మ‌ళ్లీ గోదారోడే..!

Spread the loveగోదారోళ్లంటే అనురాగాల‌కు, అప్యాయ‌త‌ల‌కు పేరు అని చెబుతారు. ఆతిథ్యానికి పెట్టింది పేరుగా క‌నిపిస్తారు. హాస్యానికి, వ్యంగ్యానికి కేరాఫ్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *