ఎమ్మెల్యేని పరుగులు పెట్టించిన జనం

24909543_1780808645265002_6424131429897227332_n
Spread the love

అధికార పార్టీ ఎమ్మెల్యేకి చుక్కలు కనిపించాయి. రైతుల ఆగ్ర హానికి పరుగులు పెట్టాల్సి వచ్చింది. పిఠాపురం ఎమ్మెల్యే వర్మకు చుక్కెదురయ్యింది. జనం తిరగబడడంతో ఎమ్మెల్యేకి ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు పరుగుపరుగున వెనక్కి మళ్లాల్సి వచ్చింది. ఎమ్మెల్యే తీరుపై జనం తీవ్రంగా మండిపడడంతో నోట మాట రాని ఎమ్మెల్యే వర్మ ఇదేం ఖర్మరా బాబు అనుకుంటూ వెనక్కి మళ్లడం కాకినాడ సెజ్ పరిధిలోని పిఠాపురం నియోజకవర్గ గ్రామాల్లో చర్చనీయాంశం అవుతోంది.

కాకినాడ సెజ్ రైతుల భూములన్నీ తాము అధికారంలోకి రాగానే తిరిగి ఇచ్చేస్తామని టీడీపీ ప్రకటించింది. ఏకంగా చంద్రబాబు ఏరువాక కూడా నిర్వహించారు. సెజ్ భూములన్నీ రైతలుకేనంటూ నిరసనలు కూడా సాగించారు. కానీ తీరా పీఠం ఎక్కగానే జీఎంఆర్ పక్షానికి మారిపోయారు. కోట్ల రూపాయల దందాలో భాగస్వాములుగా మారారని ప్రచారం సాగుతోంది. సెజ్ యజమానుల దగ్గర వాటాలు తీసుకుంటూ తమకు అన్యాయం చేస్తున్నారని రైతులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాట మార్చినందుకు మండిపడుతున్నారు. దాంతో ప్రజాగ్రహం తాకిడితో చాలాకాలంగా ఎమ్మెల్యే కాకినాడ సెజ్ గ్రామాల్లో అడుగుపెట్టడం లేదు.

ఆఖరికి చుట్టూ పోలీసుల మోహరింపు మధ్య, డీఎస్పీ, సీఐల పర్యవేక్షణలో రమణక్కపేట గ్రామం వెళ్లిన ఎస్వీఎస్ఎన్ వర్మకు అనుకున్నంత పని అయ్యింది ఇంటింటికీ తెలుగుదేశంలో భాగంగా గడపగడపకు పోలీసులను పెట్టినా ప్రజలు పట్టించుకోలేదు. పోలీసులను ఏమాత్రం ఖాతరు చేయని రైతులు ఎమ్మెల్యేని నిలదీశారు. రోడ్డుమీదే ప్రశ్నల వర్షం కురిపించారు. అడుగు ముందుకు పడకుండా అడ్డుకున్నారు. దాంతో వర్మకు ఎటూ పాలుపోని పరిస్థితి ఎదురయ్యింది. వందల మంది రైతులు ఒక్కసారిగా నినదిస్తూ నిలదీయడంతో నోటమాట రాకుండా నిలబడాల్సి వచ్చింది. సహజంగా ఎవరిమీదయినా నోరేసుకుని పడిపోతారనే పేరున్న ఎమ్మెల్యే చాలాసేపు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. అయినా రైతులు వెనక్కి తగ్గకపోవడంతో చివరకు ఉన్నపళంగా వెనక్కి మళ్లి పరుగుపరుగున కారు ఎక్కి ఉడాయించాల్సిన పరిస్థితి వచ్చింది.

దాంతో ఇప్పుడీ వ్యవహారం పిఠాపురంలో హాట్ టాపిక్ అయ్యింది. ఎమ్మెల్యేని వెనక్కి మళ్లించిన రమణక్కపేట ప్రజల ఆందోళన ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి రైతులు చుక్కలు చూపించబోతున్నారనడానికి సంకేతంగా మారుతోంది.


Related News

Congress_4729

వైసీపీకి చేతగానిది..కాంగ్రెస్ చేస్తోంది..

Spread the loveపోలవరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసింది. నిత్యం ఆందోళనలతో మీడియాలోRead More

TDP WEST PEETALA

టీడీపీలో చిచ్చుపెట్టిన జన్మభూమి

Spread the loveతెలుగుదేశంలో ఒక సామాజికవర్గం పెత్తనం గురించి చాలాకాలంగా ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే పరిస్థితులున్నాయి. చివరకు రిజర్వుడుRead More

 • బాబు మాటలతో ఎమ్మెల్యేల బేజారు
 • తెలుగుదేశం ‘తోట’లో న్యాయం లేదు…!
 • ఎమ్మెల్యేని పరుగులు పెట్టించిన జనం
 • చినరాజప్ప సీటు మారుతోంది…
 • తారస్థాయిలో టీడీపీ తగాదా
 • ఏపార్టీ అయినా సరే అంటున్న తోట మాటల్లో ఏముందో?
 • కష్టాలు కొనితెచ్చుకుంటున్న వైసీపీ
 • యనమల అవుట్..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *