Main Menu

ముద్ర‌గ‌డ కోసం ముంద‌డుగు నంద్యాల‌లో వెన‌క‌డుగు

chandrababu pawan
Spread the love

పేరు ఉద్దాన‌మే అయిన‌ప్ప‌టికీ అస‌లు రాజ‌కీయ వ్యూహాలు మాత్రం స్ప‌ష్టంగానే ఉన్నాయి. రాజకీయాల‌కు అతీతంగా ఉన్నామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ ల‌క్ష్యాలు మాత్రం స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. పైకి చెబుతున్న ఎజెండా ఏమ‌యిన‌ప్ప‌టికీ అస‌లు ఎజెండా అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది. వైజాగ్ లో హార్వ‌ర్డ్ ప్రొఫెస‌ర్ల ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ తిల‌కించ‌డానికి స‌మ‌యం లేద‌న్న ప‌వ‌ర్ స్టార్ అమ‌రావ‌తిలో మాత్రం ఎక్కువ స‌మ‌య‌మే కేటాయించారు. విందు రాజ‌కీయాలే కాకుండా ఆంత‌రంగిక స‌మావేశాలు కూడా నిర్వ‌హించారు. చార్టెడ్ ఫ్లైట్స్ లో రెండు రోజుల పాటు తిరిగిన ఆయ‌న క‌ర్త‌వ్యం అంద‌రికీ క‌నిపిస్తోంది. ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌, నంద్యాల ఉప ఎన్నిక‌లే ఇప్పుడు చంద్ర‌బాబు ముందున్న ల‌క్ష్యాలు.

దానికి త‌గ్గ‌ట్టుగానే పావులు క‌దిపారు. ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌కు అనుమతిచ్చి ఉండాల్సిందంటూ ప‌వ‌న్ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం కాబోతున్నాయి. ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌కు అనుమ‌తించే విష‌యంలో చంద్ర‌బాబు పున‌రాలోచ‌న‌లో ఉన్నార‌న్న విష‌యానికి ఇది అద్దంప‌డుతోంది. ఆగ‌ష్ట్ 2 వ‌ర‌కూ ముద్ర‌గ‌డ‌ని గృహ‌నిర్బంధం అని చెప్పిన‌ప్ప‌టికీ ఆత‌ర్వాత అది కూడా లేద‌న్నారు. పాద‌యాత్ర‌ను నివారించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని పోలీసులు ప్ర‌క‌టించారు. ఇక ఇప్పుడు ప‌వ‌న్ ప్ర‌క‌టన త‌ర్వాత ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మార్గం సుగ‌మం చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. పోలీసుల‌ను మోహ‌రించి అన్నిర‌కాలుగానూ అడ్డంకులు సృష్టించిన ప్ర‌భుత్వం ఇక‌పై మ‌న‌సు మార్చుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. త‌ద్వారా కాపుల విష‌యంలో రిజ‌ర్వేష‌న్ల కోసం ఎన్నిక‌ల హామీని గుర్తు చేయ‌డ‌మే కాకుండా, ముద్ర‌గ‌డ‌ను నిర్బంధించిన‌ప్పుడు గొంతు వినిపించిన నాయ‌కుడిగా ప‌వ‌న్ పేరు కాపుల్లో సానుకూలంగా మారుతుంది. అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల నాటికి కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో సానుకూల నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌స్తే క్రెడిట్ గేమ్ లో ముద్ర‌గ‌డ క‌న్నా ప‌వ‌న్ ముందంజ‌లో ఉండేలా వ్యూహం ర‌చించిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఇక రెండో కీల‌కాంశం నంద్యాల ఉప ఎన్నిక‌లు. రెడ్లు, మైనార్టీల త‌ర్వాత బ‌లిజ‌లే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గం. కాబ‌ట్టి వారి ఓట్ల కోసం ఇప్ప‌టికే బాబు పావులు క‌దుపుతున్నారు. క‌మ్యూనిటీ హ‌ల్ తో ఎర వేశారు. అదే స‌మ‌యంలో ప‌వ‌న్ మంత్రం ప‌వ‌ర్ ఫుల్ అని భావిస్తున్నారు. ప్ర‌ధానమైన రెండు వ‌ర్గాల్లోనూ వైసీపీకి ఊపు ఉన్న స‌మ‌యంలో బ‌లిజ‌ల‌ను ఆక‌ట్టుకోకుండా టీడీపీకి ప‌రువు నిల‌బ‌డే అవ‌కాశం లేదు. అందుకే ప‌వ‌న్ ని చంద్ర‌బాబు రంగంలో దింపిన‌ట్టు క‌నిపిస్తోంది. దానికి ఉద్దానం ఓ సాధ‌నం అయ్యింద‌న‌డంలో సందేహం లేదు. అయితే ప‌వ‌న్ మాత్రం నంద్యాల‌లో టీడీపీకి మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించే విష‌యంలో వెన‌క‌డుగు వేయ‌డం ఆశ్చ‌ర్యం. ముంద‌స్తు నిర్ణ‌యం ప్ర‌కారం ఆయ‌న నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో భూమా కుటుంబం పేరుతో టీడీపీకి మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించాల్సి ఉంది. గ‌తంలో ప్ర‌జారాజ్యంలో ఉన్న‌ప్ప‌టి నుంచి భూమాతో ప‌రిచ‌యం ఉన్న ప‌వ‌న్ , ఆయ‌న బిడ్డ‌కోసం త‌న మ‌ద్ధ‌తు అని చెప్పాల్సి ఉంది. అయితే దానిని తాజాగా మీడియా ముందు కాకుండా ఒక‌టి రెండు రోజుల్లో ట్విట్ట‌ర్ ద్వారా చెప్పాల‌నే ప్ర‌య‌త్నం చేయ‌డం కూడా వ్యూహాత్మ‌కంగానే క‌నిపిస్తోంది. ఎటువంటి ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం కాకుండా చ‌నిపోయిన నాయ‌కుడి కుటుంబానికే ఛాన్సివ్వాలంటూ ప‌వ‌న్ పిలుపునివ్వ‌డానికి త‌గ్గ‌ట్టుగా ఆయ‌న ప‌థ‌క ర‌చ‌న చేశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ముద్ర‌గ‌డ విష‌యంలో ఓ అడుగు ముందుకేసినా నంద్యాల విష‌యాన్ని రెండు రోజులు వాయిదా వేయ‌డం విశేష‌మే. ఇది టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ‌కు దారితీస్తోంది. జ‌న‌సేనాని నిర్ణ‌యం కోసం ఎదురుచూస్తున్న వారికి మ‌రికొంత స‌మ‌యం వేచి చూడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితిని తెచ్చింది.


Related News

gorantla buchayya

అయ్యో..బుచ్చ‌య్య‌కి హ్యాండిస్తున్న‌ట్టేనా!

Spread the loveతెలుగుదేశం పార్టీలో ఆయ‌న సీనియ‌ర్ నాయ‌కుడు. స్వ‌యంగా ఆయ‌న చెప్పుకున్న మాట‌ల ప్ర‌కారం చెప్పాలంటే టీడీపీలో చంద్ర‌బాబుRead More

Tetali-Rama-Reddy

వైసీపీలోకి మరో మాజీ ఎమ్మెల్యే

Spread the loveతూర్పు గోదావరి జిల్లాలో జగన్ శిబిరంలోకి మరో మాజీ ఎమ్మెల్యే ప్రవేశించారు. ఇప్పటికే పలువురు మాజీలు వైసీీపీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *