Main Menu

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాలిటిక్స్ లో క్లారిటీ!

Spread the love

జ‌న‌సేన అధినేత ఫుల్ క్లారిటీకి వ‌చ్చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న వ్యూహంలో స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్టేన‌ని అంతా భావిస్తున్నారు. తాజాగా గుంటూరు స‌భ‌లో ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న అందుకు కార‌ణంగా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన ప‌వ‌న్ వ్య‌వ‌హారం అందుకు ఆధారంగా చెప్ప‌వ‌చ్చు..

వామపక్షాలతో కలిసి 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని జ‌న‌సేనాని పునరుద్ఘాటించారు. ఇదే విషయాన్ని తాను పదేపదే చెబుతున్నా వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని అన్నారు. ‘నాకు భయం లేదు. ప్రజలను మోసం చేయను. పొత్తులతో పాటు అన్ని విషయాలు చెప్పే చేస్తా’ అని ఆయన అన్నారు. టిడిపి, వైసిపిలు తనను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నాయని, ఆ రెండు పార్టీలనూ దీటుగా ఎదుర్కుంటామని చెప్పారు. ఈ సందర్భంగా గుంటూరు, తెనాలి అసెంబ్లీ నియోజక వర్గాల నుండి తోట చంద్రశేఖర్‌, నాదెండ్ల మనోహర్‌ లను అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దింపుతున్నట్లు ఆయన ప్రకటించారు.

ప్రధాన మంత్రిని అడిగితే తనకు రాజ్యసభ ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి కూడా ఇస్తారని కానీ తాను బిజెపితో రాజీపడకుండా పోరాటం చేస్తుంటే తనకు ఏవేవో ఆపాదిస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు తరచూ మాటలు మారుస్తున్నారన్నారు. జగన్‌ ఈ విషయాన్ని ఇప్పుడు పట్టించుకోవడం లేదని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ అంశంపై ఒక తాటిపైకి వచ్చి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించాలన్నారు. తాను కేవలం ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితం అయినట్టు కొందరు ప్రచారం చేస్తున్నారని ఇది వాస్తవం కాదన్నారు. 30 ఏళ్ల పాటు అధికారం ఉండాలని కోరుకుంటున్న వైఎస్‌ జగన్‌, తనకు మళ్లీ అవకాశం ఇస్తే తన కుమారుడు లోకేష్‌ను సీఎం చేయాలనుకుంటున్న చంద్రబాబు నాయుడు సామాన్య ప్రజల కష్టాలను, యువత, నిరుద్యోగుల అభివృద్ధి గురించి ఆలోచించడం లేదన్నారు.

దాంతో టీడీపీ సిట్టింగ్ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్, ఎమ్మెల్యే ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ మీద త‌న అభ్య‌ర్థుల‌ను ప‌వ‌న్ ప్ర‌క‌టించ‌డంతో ఇక ఆయ‌న టీడీపీతో చేతులు క‌లిపే అవ‌కాశాలు లేవ‌ని స్ప‌ష్టం అయిపోయింది. రాజ‌ధాని ప్రాంతంలో ఎంపీ అభ్య‌ర్థిని తేల్చేసిన త‌ర్వాత ప‌వ‌న్ పొత్తుల గురించి మాట్లాడే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని అంతా భావిస్తున్నారు. దాంతో జ‌న‌సేన, లెఫ్ట్ తో క‌లిసి వేగంగా అడుగులు వేస్తున్న‌ట్టు ఈ ప‌రిణామాలను అంతా అంచ‌నా వేస్తున్నారు.






Related News

హ‌ర్ష‌కుమార్ కి అలా… స‌బ్బం హ‌రికి ఇలా!

Spread the loveతెలుగుదేశం పార్టీ అధినేత అనూహ్య నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఏకంగా కాళ్లు మొక్కిన నేత‌ల‌ను కూడా క‌నిక‌రించ‌లేదు. జ‌గ‌న్Read More

మ‌ళ్లీ గోదారోడే..!

Spread the loveగోదారోళ్లంటే అనురాగాల‌కు, అప్యాయ‌త‌ల‌కు పేరు అని చెబుతారు. ఆతిథ్యానికి పెట్టింది పేరుగా క‌నిపిస్తారు. హాస్యానికి, వ్యంగ్యానికి కేరాఫ్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *