Main Menu

గోదావ‌రిలో టీడీపీకి పెద్ద గండి…!

Spread the love

ఏపీలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వ‌చ్చేసింది. పార్టీల‌న్నింటికీ ఆ ఫీవ‌ర్ వ్యాపిస్తోంది. ప్ర‌త్యేక హోదా, పార్ల‌మెంట్ లో ప‌రిణామాల పుణ్యాన ప‌రిణామాలు మారుతున్నాయి. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డిగా బ‌రిలో దిగిన ప‌క్షాలు ఇప్పుడు బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థులుగా మారిపోతున్నాయి. బీజేపీ, టీడీపీ మ‌ధ్య వైరం తీరం దాటేసింది. చెరో దారి ప‌ట్టేశారు. ఆ త‌ర్వాత జ‌నసేన విమ‌ర్శ‌ల‌తో టీడీపీ కూడా ఉలిక్కిప‌డింది. తాజాగా మాట‌ల యుద్దానికి దిగింది. టీడీపీ నేత‌లంతా ప‌వ‌న్ మీద వాగ్భాణాలు సంధిస్తున్నారు.

ఈ ప‌రిణామాల ప్రభావం ఏపీ అంత‌టా ఎలా ఉన్న‌ప్ప‌టికీ గోదావ‌రి జిల్లాల్లో టీడీపీ ఆశ‌ల‌కు గండికొట్టిన‌ట్టేన‌ని భావించ‌వ‌చ్చు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన 34 సీట్ల‌కు గానూ టీడీపీ 32, బీజేపీ 2 సీట్లు పోటీ చేశాయి. బీజేపీ బ‌రిలో దిగిన తాడేప‌ల్లి గూడెం, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స్థానాలు గెలుచుకోగా, టీడీపీ విడిగా 26 సీట్లు, ఆపార్టీ రెబ‌ల్ పిఠాపురం నుంచి ఇండిపెండెంట్ గానూ గెలిచారు. దాంతో ఏపీలో వైసీపీ మీద ఆధిప‌త్యానికి గోదావ‌రి జిల్లాలే కార‌ణంగా ఉన్నాయి. టీడీపీకి 102 సీట్లు, వైసీపీకి 67 సీట్లు రాగా మెజార్టీగా 35 స్థానాల‌కు గానూ ఒక్క గోదావ‌రి జిల్లాల్లోనే 25 సీట్లు ఉండ‌డం విశేషం.

అయితే అప్ప‌ట్లో బీజేపీ కార‌ణంగా కొంత‌, జ‌న‌సేన మూలంగా అత్య‌ధికంగానూ టీడీపీ లాభ‌ప‌డింది. కాపులు, యువ‌త ప్ర‌ధానంగా టీడీపీని బ‌ల‌ప‌రిచారు. భారీ మెజార్టీలు అందించారు. దాంతో అధికారం వైపు టీడీపీ అడుగులు ప‌డ్డాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇప్పుడు అదే ప్రాంతంలో కాపులంతా టీడీపీకి దాదాపుగా దూరం అయిన‌ట్టే క‌నిపిస్తోంది. దానికి కార‌ణం ఇప్ప‌టికే సాగుతున్న ముద్ర‌గ‌డ ఉద్య‌మం కొంతైతే, తాజాగా ప‌వ‌న్ పొలిటిక‌ల్ వ్యూహం మ‌రో కార‌ణంగా ఉంది. అది టీడీపీ ఎదురుదెబ్బ‌గా ప‌రిణ‌మించే అవ‌కాశం ఉంది. కానీ కాపుల ఓట్లు ఎటు మ‌ళ్లుతాయ‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. ఎవ‌రు బ‌ల‌మైన అభ్య‌ర్థి అయితే సామాన్య జ‌నం అటు వైపు మళ్లిపోయే అవ‌కాశం ఉంటుంది. అలాంటి స‌మ‌యంలో జ‌న‌సేన బ‌రిలో దిగిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబుని ఓడించే అవ‌కాశం వైసీపీకే ఉంటుంద‌ని విశ్వ‌సిస్తే ఓట్ల‌న్నీ అటు మ‌ళ్లుతాయి. టీడీపీకి చెంప‌పెట్టుగా మారిపోతాయి.

అదే స‌మ‌యంలో వైసీపీకి మ‌ళ్ల‌కుండా జ‌న‌సేన వైపు మ‌ళ్లితే మాత్రం ఆస‌క్తిదాయ‌క‌మే. గ‌డిచిన ఎన్నిక‌ల్లో సాధించిన ఓట్లు వైసీపీ నిల‌బెట్టుకుని, బీజేపీ, జ‌న‌సేన బ‌లం టీడీపీ కోల్పోయి, జ‌న‌సేన కూడా సామాజిక నేప‌థ్యంలో గుర్తించ‌ద‌గ్గ స్థాయిలో ఓట్ల శాతం ద‌క్కించుకుంటే ఫ‌లితాలు 2009 నాటివి పున‌రావృతం అవుతాయ‌ని కొంద‌రి అంచ‌నా. అప్ప‌ట్లో కూడా ప్ర‌జారాజ్యం కాపు ఓట్లు చీల్చ‌గా, కాంగ్రెస్ గ‌ట్టెక్క‌డానికి తోడ్ప‌డింది. టీడీపీ మాత్రం తీవ్రంగా న‌ష్ట‌పోయింది. దాంతో ఈసారి అలాంటి ప‌రిస్థితి ఎవ‌రికి దాపురిస్తుందో చూడాలి.


Related News

హ‌ర్ష‌కుమార్ కి అలా… స‌బ్బం హ‌రికి ఇలా!

Spread the loveతెలుగుదేశం పార్టీ అధినేత అనూహ్య నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఏకంగా కాళ్లు మొక్కిన నేత‌ల‌ను కూడా క‌నిక‌రించ‌లేదు. జ‌గ‌న్Read More

మ‌ళ్లీ గోదారోడే..!

Spread the loveగోదారోళ్లంటే అనురాగాల‌కు, అప్యాయ‌త‌ల‌కు పేరు అని చెబుతారు. ఆతిథ్యానికి పెట్టింది పేరుగా క‌నిపిస్తారు. హాస్యానికి, వ్యంగ్యానికి కేరాఫ్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *