ఆర్ నారాయణ మూర్తిని అడ్డుకున్నారు

R-Narayana-Murthy
Spread the love

విప్లవ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆర్‌.నారాయణమూర్తికి చేదు అనుభవం ఎదురైంది. అధికార పార్టీ నేతలు ఆయన సినిమా షూటింగ్ ని అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. అన్నదాత సమస్యలపై అమరావతిలో భూసేకరణ మీద తీస్తున్న సినిమా షూటింగ్ వివాదాస్పదం అయ్యింది. తమ ప్రాంతంలో షూటింగ్‌కు అనుమతి లేదంటూ తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి టీడీపీ జెడ్పటీసీ సహా ఆపార్టీ కార్యకర్తలు అడ్డుపడటంతో కలకలం రేగింది. చివరకు ఆర్ నారాయణ మూర్తి ఒక్కసారిగా అగ్రహానికి లోనయ్యారు. తీవ్రవాగ్వాదం చోటుచేసుకోవడంతో చివరికి షూటింగ్‌ రద్దయింది. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం బొర్రంపాలెం వద్ద శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రస్తుతం ‘అన్నదాతా సుఖీభవ’ సినిమాను రూపొందిస్తున్న నారాయణమూర్తి.. యూనిట్‌తో కలిసి బొర్రంపాలెం వద్దగల పుష్కర ఎత్తిపోతల పథకం పంప్‌ హౌస్‌ వద్ద సినిమా షూటింగ్‌ తలపెట్టారు. అయితే అనుమతి లేకుండా సినిమా తీయవద్దంటూ గండేపల్లి జెడ్పీటీసీ యర్రంశెట్టి చంద్రరావు, కొందరు స్థానికులు షూటింగ్‌ను అడ్డుకున్నారు.

దీంతో ఆగ్రహానికి లోనైన నారాయణమూర్తి.. స్థానికులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు వచ్చి ఇరు వర్గాలను శాంతింపజేశారు. నారాయణమూర్తి సహా సినిమా యూనిట్ మొత్తం అక్కడి నుంచి వెళ్లిపోయింది.


Related News

thota-narasimham

టీడీపీ రెండు నాలుక‌లు…

Spread the love1Shareచంద్ర‌బాబు ది రెండు క‌ళ్ల సిద్ధాంతం అన‌డంలో సందేహం లేదు. ఆ విష‌యం ఆయ‌నే చెప్పేశారు. ఇప్పుడుRead More

chinthamaneni

చిక్కుల్లో చింత‌మ‌నేని

Spread the love5Sharesవివాదాస్ప‌ద ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ను స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్నాయి. ఐదేళ్ల క్రితం నాటి ఓ కేసు ఆయ‌నRead More

 • పవన్ కళ్యాణ్ గూటిలో జగన్ అనుచరుడు
 • కాపు రిజర్వేషన్ల ఆశలపై నీళ్లు
 • టీడీపీలో రాజుకున్న అంతర్యుద్ధం
 • వీధికెక్కిన జనసేన విబేధాలు
 • వైసీపీపై అలిగిన మాజీ మంత్రి
 • వైసీపీ సీనియర్ కి వలవేసిన టీడీపీ
 • వైసీపీకి చేతగానిది..కాంగ్రెస్ చేస్తోంది..
 • టీడీపీలో చిచ్చుపెట్టిన జన్మభూమి
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *