నంద్యాల చేతుల్లో కాకినాడ భవితవ్యం

KAKINADA NANDYALA
Spread the love

అవును..అనూహ్యంగా రాయలసీమలోని నంద్యాల కోస్తాలోని కాకినాడను శాసించబోతోంది. నంద్యాల జనం ఏం చెబుతారన్నదానిని బట్టి కాకినాడ వాసుల నిర్ణయం ఉండబోతోంది. అక్కడి తీర్పు కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలను ప్రభావితం చేయబోతోంది. దాంతో కాకినాడ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న చాలామంది నంద్యాల వైపే చూస్తున్నారు. నంద్యాల ఫలితాలను బట్టి తమ భవిష్యత్తు ఉంటుందన్న నిర్ణయానికి వచ్చేశారు. దాంతో ఇప్పుడు నంద్యాల ఏపీ అసెంబ్లీలో ఇద్దరిలో ఒకరి బలాన్ని పెంచడమే కాకుండా కాకినాడ కార్పోరేషన్ కుర్చీకి కూడా దగ్గర చేయబోతోందన్నట్టుగా మారింది.

ఈనెల 29న కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి ఒక్కరోజు ముందు 28న నంద్యాల ఫలితాలు రాబోతున్నాయి. దాంతో ఆసక్తిగా మారింది. సహజంగా హోరాహోరీగా సాగిన నంద్యాల ఫలితాలు కాకినాడ ఓటర్ మీద తీవ్ర ప్రభావం చూపడం ఖాయంగా మారింది. ఒక చోట ఎన్నికలు సాగుతున్నప్పుడు మరో చోట ఫలితాలు రాకుండా నిలుపుదల చేసిన చరిత్ర కూడా ఉంది. అయితే కాకినాడలో జరుగుతున్నవి స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో రెండింటికీ సంబంధం లేనట్టుగా భావిస్తున్నారు. దాంతో ఫలితాలు రావడం ఖాయంగా మారింది.

ఫలితాలు సర్వేల ప్రకారం వస్తాయా..లేక సంచలనాలు నమోదవుతాయా అన్నదే కాకినాడలో పోటీలో ఉన్న అభ్యర్థులను కలవరపెడుతున్న అంశం. వాస్తవానికి కాకినాడ ఎన్నికల్లో ప్రస్తుతం కోలాహలం కనిపిస్తోంది. సందడి సందడిగా మారింది. అక్కడ కూడా రెండు పార్టీలు ధీటుగా తలపడుతున్నాయి. బీజేపీ బరిలో ఉన్నా పెద్దగా ప్రభావం లేదు. రెబల్స్ ఒకటి రెండు చోట్ల సత్తా చాటే అవకాశాలున్నాయి. కానీ టీడీపీ, వైసీపీ దాదాపుగా సమానంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో నంద్యాలలో ఎవరు విజయకేతనం ఎగురవేస్తే వారికే కాకినాడ మొగ్గు ఖాయం అని చెప్పాల్సి ఉంటుంది. న్యూట్రల్ గా ఉన్న ఓటర్లను తీవ్రంగా ఆ ఫలితాలు ప్రభావితం చేస్తాయి. గెలిచిన పార్టీ వైపు మొగ్గేలా చేస్తాయి. దాంతో 10శాతం ఓటర్లు స్పందించినా ఫలితాలన్నీ తారుమారవుతాయి. కాబట్టి కాకినాడ ఫలితం నంద్యాల చేతుల్లో ఉందని చెప్పక తప్పదు.


Related News

thota-narasimham

టీడీపీ రెండు నాలుక‌లు…

Spread the love1Shareచంద్ర‌బాబు ది రెండు క‌ళ్ల సిద్ధాంతం అన‌డంలో సందేహం లేదు. ఆ విష‌యం ఆయ‌నే చెప్పేశారు. ఇప్పుడుRead More

chinthamaneni

చిక్కుల్లో చింత‌మ‌నేని

Spread the love5Sharesవివాదాస్ప‌ద ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ను స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్నాయి. ఐదేళ్ల క్రితం నాటి ఓ కేసు ఆయ‌నRead More

 • పవన్ కళ్యాణ్ గూటిలో జగన్ అనుచరుడు
 • కాపు రిజర్వేషన్ల ఆశలపై నీళ్లు
 • టీడీపీలో రాజుకున్న అంతర్యుద్ధం
 • వీధికెక్కిన జనసేన విబేధాలు
 • వైసీపీపై అలిగిన మాజీ మంత్రి
 • వైసీపీ సీనియర్ కి వలవేసిన టీడీపీ
 • వైసీపీకి చేతగానిది..కాంగ్రెస్ చేస్తోంది..
 • టీడీపీలో చిచ్చుపెట్టిన జన్మభూమి
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *