Main Menu

గెలిచినా అది మానేది లేదంటున్న నాగ‌బాబు!

Spread the love

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రుడు ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో న‌ర్సాపురం ఎంపీ సీటుకి పోటీ ప‌డిన సంగ‌తి తెలిసిందే. కొణిదెల నాగ‌బాబు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టి పోటీ ఇచ్చారు. అయితే తాజాగా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా తెలుగు మీడియాలో పాపుల‌ర్ షోల‌లో ఒక‌టైన‌ జబర్దస్త్ విష‌యంలో త‌న తీరుపై క్లారిటీ ఇచ్చేశారు. ఎంపీగా గెలిచినా జబర్దస్త్ ప్రోగ్రామ్‌‌ను వదలి పెట్టనని తేల్చి చెప్పారు. జబర్దస్త్ ప్రారంభం నుంచి నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఒకటి రెండు సందర్భాల్లో తప్ప.. అన్ని ఎపిసోడ్లలో ఆయనే ఉన్నారు.

ఇటీవ‌ల ఆయ‌న ప్రచారంలో ఉండ‌డంతో సుదీర్ఘ‌కాలం త‌ర్వాత ప్రోగ్రామ్‌కు దూరమయ్యారు. ఆయనతో పాటు జడ్జిగా ఉన్న వైసీపీ నేత, సినీ నటి రోజా కూడా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. వీరిద్దరి స్థానంలో సీనియర్ నటి మీనా, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎంపీగా గెలిచినా జ‌బ‌ర్‌ద‌స్త్‌లో క‌నిపించ‌డం మాన‌కండి’ అంటూ చాలా మంది నాతో అనేవారు. నేను ఎంపీగా గెలిచినా జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటాను. అది కూడా సమాజసేవ లాంటిదే.. అయితే పారితోషికం తీసుకుంటుంటాము. నెలలో ఐదు రోజులు ప్రోగ్రామ్ ఉంటుంది. అదేమీ పెద్ద ఇబ్బంది కాదు. అయితే సినిమాలు మాత్రం చేయను’’ అంటూ తన మనసులో మాట చెప్పారు.

ఇక ఎన్నికల గురించి మాట్లాడుతూ.. రిజల్ట్స్‌తో తనకు సంబంధం లేదని.. కానీ అక్కడి వారి ప్రేమ, ఆప్యాయతలను మర్చిపోలేకపోతున్నానంటూ ఉద్వేగానికి గురయ్యారు. ‘‘నా జీవితానికి ఇది సరిపోతుంది. ఇది చాలు. రిజల్ట్స్ నా చేతుల్లో లేవు. దానితో సంబంధం లేదు. నాజీవితాన్ని వాళ్లకు ఇచ్చేయాలనిపిస్తోంది. 2009లో ఉన్న ప్రజారాజ్యానికి.. ఇప్పటి జనసేనకు వంద రెట్లు తేడా ఉంది. మా అధినేత కల్యాణ్ బాబుకు మంచి ఆదరణ దక్కింది. పార్టీ భావజాలాన్ని చాలా బాగా తీసుకెళ్లారు. ప్రత్యర్థుల విమర్శలను నేను పట్టించుకోవడం లేదు. సామాన్య ఓటర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. యువత ప్రేమ, అభిమానాలు మాటల్లో చెప్పలేను. మహిళల ఆప్యాయతకు కన్నీళ్లు వచ్చేశాయి. ఆ ఉద్వేగం ఇప్పటికీ నా కళ్లెదుటే ఉంది’’ అన్నారు..


Related News

గెలిచినా అది మానేది లేదంటున్న నాగ‌బాబు!

Spread the loveజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రుడు ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో న‌ర్సాపురం ఎంపీ సీటుకి పోటీ ప‌డిన సంగ‌తిRead More

Latest Survey: ప‌గోలో ఎవ‌రిది పై చేయి?

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు ప్ర‌త్యేక ప్ర‌ధాన్య‌త ఉంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ హ‌వాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *