జ‌న‌సేనానికి ముద్ర‌గ‌డ మ‌ద్ధ‌తు

mudragada pawan'
Spread the love

కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌నే అర్థంలో కామెంట్ చేసిన ఆయ‌న తాజాగా జ‌న‌సేనానికి వంత పాడారు. ప‌వ‌న్ మాట‌లు అక్ష‌ర‌స‌త్య‌మ‌న్నారు. జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వ స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను స‌మ‌ర్థించారు. ముఖ్యంగా చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ అవినీతి వ్య‌వ‌హారాల్లో ప‌వ‌న్ చెప్పిన మాట‌లు అక్ష‌రాలా నిజ‌మ‌ని వ్యాఖ్యానించారు.

ఈ నేప‌థ్యంలో ముద్ర‌గ‌డ మాట‌లు చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. గ‌డిచిన మూడేళ్లుగా ముద్ర‌గ‌డ కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాడుతున్నారు. తొలుత ప‌వ‌న్ కూడా ఆయ‌న్ని స‌మ‌ర్థించ‌లేదు. కానీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం 5శాతం రిజ‌ర్వేష‌న్లు ప్ర‌క‌టించ‌గానే జ‌న‌సేనాని కూడా అసంతృప్తి వ్య‌క్తం చేశారు. విందు భోజ‌నం పెడ‌తామ‌ని పిలిచి, ఆవ‌కాయ బ‌ద్ధ‌తో పెడ‌తారా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాజాగా ఆవిర్భావ దినోత్స‌వ స‌భ‌లో కూడా అమ‌లుచేయ‌లేని హామీలు ఎందుకిచ్చారంటూ నిల‌దీశారు. కాపుల‌కు, బీసీల‌కు త‌గువు పెట్టార‌ని మండిప‌డ్డారు.

ఈ నేప‌థ్యంలో ముద్ర‌గ‌డ ప్ర‌స్తుతం క‌నీసం ప్ర‌క‌టించిన 5శాతం అయినా అమ‌లు చేయాల‌ని ఉద్య‌మానికి సన్న‌ద్ధ‌మ‌వుతున్నారు. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా చంద్ర‌బాబుమీద గురిపెట్టిన త‌రుణంలో క‌లిసి సాగ‌డానికి సంకేతాలుగా కొంద‌రు అంచ‌నా వేస్తున్నారు. అనూహ్యంగా స్పందించే ముద్ర‌గ‌డ ఏ నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ అది రాజ‌కీయంగా ప్ర‌భావిత అంశంగానే భావించాలి.


Related News

narsapuram

ప‌శ్చిమ టీడీపీలో చిచ్చు ..

Spread the loveప్ర‌శాంత ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో చిచ్చు రాజుకుంది. ప‌చ్చ‌పార్టీ వ్య‌వ‌హారాల్లో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది. కీల‌క జిల్లాలో పార్టీRead More

abn md radha krishna

రాధాకృష్ణ‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చిన బిరుదు…!

Spread the loveప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారుతోంది. జ‌న‌సేన అధినేత తీరు రోజురోజుకి చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ట్విట్ట‌ర్ వేదిక‌గాRead More

 • చిన‌రాజ‌ప్ప‌కి స్కెచ్ వేస్తున్న సొంత పార్టీ
 • జ‌గ‌న్ కి జై కొట్టిన మ‌రో సినీ న‌టుడు
 • కీల‌క ప్రాంతంలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి
 • టీడీపీకి జ‌న‌సేన షాక్
 • ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా మాజీ మంత్రి!
 • వైసీపీలోకి సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య
 • టీడీపీకి క్లారిటీ వ‌చ్చేసింది…
 • గోదావ‌రిలో టీడీపీకి పెద్ద గండి…!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *