ముద్రగడ మాట మార్చేశారా

mudragada
Spread the love

ముద్రగడ పద్మనాభం. కాపు ఉద్యమ నేత. ఏపీ రాజకీయాల్లో టీడీపీకి తలనొప్పిగా మారిన నాయకుల్లో ఒకరు. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న కాపు సామాజికవర్గంలో ఇప్పుడు చంద్రబాబు పట్ల తీవ్ర వ్యతిరేకతను రాజేయడంలో ముద్రగడ విజయవంతమయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో కాపులు దాదాపుగా టీడీపీకి దూరమయ్యారు. దాని ప్రభావం కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో కనిపించే అవకాశం కొంతవరకూ ఉంది. వాస్తవానికి నంద్యాల ఫలితాల ప్రభావం లేకపోతే కాకినాడలో కాపులు టీడీపీకి కాక పుట్టించే వారే. కానీ నంద్యాల మూలంగా కాపులు కొంత చల్లబడ్డారు.

ఇక తాజాగా ముద్రగడ అనుకున్నట్టుగానే పాదయాత్ర ప్రారంభించారు. కానీ అనూహ్యంగా విరమించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. వాస్తవానికి ముప్పై ఐదు రోజుల పాటు పోలీసులను ఆయన ముప్పుతిప్పలు పెట్టారు. చివరకు ఖాకీలు కాస్త ఏమరపాటు ప్రదర్శించగానే పాదయాత్ర ప్రారంభించేసి కలకలం రేపారు. చివరకు సీఎం అదే జిల్లాలో ఉండగా ముద్రగడ పాదయాత్ర చేపట్టడం పెద్ద సంచలనం అయ్యింది. కానీ పోలీస్ బాస్ ల మీద చంద్రబాబు కన్నెర్ర చేయడంతో ముద్రగడ పాదయాత్ర ఆరు కిలోమీటర్లకే పరిమితం అయ్యింది. అమరావతి వరకూ నిరవధిక పాదయాత్ర అని చెప్పిన చివరకు శాంతించి ఉద్యమం కొత్త మలుపు తిప్పారు.

తాజాగా తనకు వయసు సహకరించకపోవడం వల్ల ఆలోచిస్తున్నానని లేకుంటే చంద్రబాబు సర్కారుని మూడు చెరువుల నీళ్లు తాగించడం తనకు బాగా తెలుసని చెబుతున్నారు. రెండు నెలల్లో కాపు రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రానికి నివేదిస్తామని చెబుతున్న చంద్రబాబు ఆ వ్యవహారం పూర్తి చేయాలన్నారు. మూడు నెలలు తీసుకుని రిజర్వేషన్ల హామీని ఓ కొలిక్కి తీసుకురాకపోతే తామేంటో చూపిస్తామంటున్నారు. 2019 ఎన్నికల్లో బుద్ది చెప్పడమే కాకుండా ఆలోగా అనూహ్య ఉద్యమాలతో అలజడి రేపుతామంటున్నారు. దాంతో ముద్రగడ పాదయాత్ర మీద మాట మార్చేసినప్పటికీ ఇతర రూపాల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తానని చెబుతుండడం మరో సంచలనానికి మారుపేరు కాబోతోందా అన్న చర్చ మొదలయ్యింది.

తునిలో రైల్,, రాస్తా రోకో ఉద్యమానికి కథా, స్క్రీన్ ప్లే దర్శకత్వం తనదేనన్నారు. తాజాగా హఠాత్తుగా పాదయాత్ర ప్రారంభించడం కూడా తన సొంత వ్యూహమేనన్నారు. చంద్రబాబు హామీని నిలబెట్టుకోకపోతే అలాంటి రూపాలు ఇంకా చాలా చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. దాంతో ముద్రగడ మరోమారు పెను సంచలనానికి సిద్ధమవుతున్నారనే చర్చ ఊపందుకుంది.


Related News

maddala sunita in ycp

వైసీపీలోకి మరో మాజీ ఎమ్మెల్యే

Spread the loveఇటీవల పలువురు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి క్యూ కడుతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పలువురు నేతలు వైసీపీRead More

East_Godavari_district

తూర్పున మరో తగాదా

Spread the loveతూర్పు గోదావరి జిల్లా వ్యవహారాల్లో మరో తగాదా తెరమీదకు వచ్చింది. చాలాకాలంగా పెద్దాపురంలో చాపకింద నీరులా ఉన్నRead More

 • చిక్కులు కొనితెచ్చుకున్న చినరాజప్ప
 • జగన్ కి కొత్త సమస్యలు షురూ
 • ప‌శ్చిమ టీడీపీలో చిచ్చు ..
 • రాధాకృష్ణ‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చిన బిరుదు…!
 • చిన‌రాజ‌ప్ప‌కి స్కెచ్ వేస్తున్న సొంత పార్టీ
 • జ‌గ‌న్ కి జై కొట్టిన మ‌రో సినీ న‌టుడు
 • కీల‌క ప్రాంతంలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి
 • టీడీపీకి జ‌న‌సేన షాక్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *