టీడీపీలో చిచ్చుపెట్టిన జన్మభూమి

TDP WEST PEETALA
Spread the love

తెలుగుదేశంలో ఒక సామాజికవర్గం పెత్తనం గురించి చాలాకాలంగా ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే పరిస్థితులున్నాయి. చివరకు రిజర్వుడు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలపై టీడీపీ కీలకవర్గాల పెత్తనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రి పీతల సుజాత సొంత నియోజకవర్గం చింతలపూడిలో ఆమెకు తెలియకుండా జన్మభూమి సభ ఏర్పాటు చేసిన తీరు వాస్తవాన్ని చాటుతోంది. స్థానిక ఎమ్మెల్యే అంటే లెక్కలేకుండా, ఎంపీ మాగంటి బాబుని పిలిచి జన్మభూమి సభ నిర్వహించడం దుమారం రేపుతోంది.

గతంలో పీతల సుజాత మంత్రిగా తమ మాట వినలేదన్న ఉద్దేశంతో పట్టుబట్టి ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించడంలో మాగంటి బాబు, చింతమనేని ప్రభాకర్ సహా వారి సామాజికవర్గానికి చెందిన నేతలంతా తీవ్రంగా ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. ఆమె నియోజకవర్గం చింతలపూడిలో ఈ నేతలంతా వేలు పెట్టడమే కాకుండా, ఆమె కార్యకలాపాలకు అడ్డు తగిలిన చరిత్ర కూడా ఉంది. ఇక వర్తమానంలో దళిత మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఆమెకు తెలియకుండా జన్మభూమి సభ నిర్వహించడం ద్వారా దాదాపుగా ఎమ్మెల్యేని అవమానించడమేనని పలువురు భావిస్తున్నారు.

షెడ్యూల్ ప్రకారం ఆమె జంగారెడ్డిగూడెంలో జన్మభూమి సభ నిర్వహిస్తుండగా, కనీస సమాచారం కూడా లేకుండా కామవరపు కోటలో ఎంపీ మాగంటి బాబు హఠాత్తుగా వచ్చి జన్మభూమి సభను ఏర్పాటు చేయడం వివాదానికి దారితీస్తోంది. విషయం తెలుసుకున్న పీతల సుజాత అక్కడి నుంచే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి ఫిర్యాదు చేశారు. పార్టీ అధిష్టానానికి తన గోడు వెలిబుచ్చారు. కానీ ఇప్పటికే అనేకమార్లు తనను కించపరిచే రీతిలో వ్యవహరించిన తీరును అధిష్టానం ద్రుష్టికి తీసుకెళ్లినా స్పందించనందున, ఇప్పుడు మాత్రం చర్యలు తీసుకుంటారనే నమ్మకం లేదని పీతల సుజాత వర్గీయులు వాపోతున్నారు. దాంతో దళిత నేతలకు వరుసగా జరుగుతున్న పరిణామాలు పార్టీలో కలకలం రేపుతున్నాయి.






Related News

Congress_4729

వైసీపీకి చేతగానిది..కాంగ్రెస్ చేస్తోంది..

Spread the loveపోలవరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసింది. నిత్యం ఆందోళనలతో మీడియాలోRead More

TDP WEST PEETALA

టీడీపీలో చిచ్చుపెట్టిన జన్మభూమి

Spread the loveతెలుగుదేశంలో ఒక సామాజికవర్గం పెత్తనం గురించి చాలాకాలంగా ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే పరిస్థితులున్నాయి. చివరకు రిజర్వుడుRead More

  • బాబు మాటలతో ఎమ్మెల్యేల బేజారు
  • తెలుగుదేశం ‘తోట’లో న్యాయం లేదు…!
  • ఎమ్మెల్యేని పరుగులు పెట్టించిన జనం
  • చినరాజప్ప సీటు మారుతోంది…
  • తారస్థాయిలో టీడీపీ తగాదా
  • ఏపార్టీ అయినా సరే అంటున్న తోట మాటల్లో ఏముందో?
  • కష్టాలు కొనితెచ్చుకుంటున్న వైసీపీ
  • యనమల అవుట్..
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *