Main Menu

Latest Survey: ప‌గోలో ఎవ‌రిది పై చేయి?

Spread the love

ఏపీ రాజ‌కీయాల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు ప్ర‌త్యేక ప్ర‌ధాన్య‌త ఉంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ హ‌వా సాగింది. ఏకంగా 15కి 15 సీట్ల‌నూ కూట‌మి కైవ‌సం చేసుకుంది. దాంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి క‌నిపిస్తోంది. ఈసారి కూడా ప‌ట్టు నిలుపుకోవాల‌ని అధికార ప‌క్షం ప‌ట్టుద‌ల‌తో ఉంది. అదే స‌మ‌యంలో త‌మ ప్ర‌భావం చాటాల‌ని వైసీపీ ఆశిస్తోంది. జ‌న‌సేన కూడా దూకుడుగా ఉండ‌డంతో జిల్లాలో రాజ‌కీయాలు ముక్కోణ‌ఫు పోరుని త‌ల‌పిస్తోంది. కొన్ని సీట్ల‌లో గ‌ట్టి పోటీ సాగుతోంది.

జిల్లాలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా చూస్తే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను బ‌రిలో దింప‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారింది. దాంతో అనేక స్థానాల్లో ఎదురీత త‌ప్ప‌డం లేదు. కొన్ని చోట్ల పూర్తిగా వెనుక‌బ‌డి ఉంది.

ప్ర‌స్తుత అంచ‌నాల ప్ర‌కారం వైసీపీ దూకుడు క‌నిపిస్తోంది. అందులో జిల్లా కేంద్ర నియోజ‌క‌వ‌ర్గం ఏలూరు. ఎస్టీ రిజ‌ర్వుడు స్థానం పోల‌వ‌రం. ఎస్సీ రిజర్వుడు స్థానాలు చింత‌ల‌పూడి, కొవ్వూరు వంటి స్థానాల్లో వైసీపీ ముందంజ‌లో ఉంది. ఇక నిడ‌ద‌వోలు, న‌ర్సాపురం అసెంబ్లీ స్థానాల్లో కూడా వైసీపీ హ‌వా సాగుతోంది. ఉంగుటూరు, తాడేప‌ల్లిగూడెం , గోపాల‌పురం అసెంబ్లీ స్థానాల్లో కూడా వైసీపీకి మొగ్గు క‌నిపిస్తోంది.

టీడీపీ మాత్రం త‌ణుకు, దెందులూరు, పాల‌కొల్లు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను నిల‌బెట్టుకునే స్థితిలో ఉంది. ఉండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ముక్కోణ‌పు పోరు సాగుతోంది. ఆచంట‌లోనూ ఆస‌క్తిక‌ర స‌మ‌రం టీడీపీ, వైసీపీ మ‌ధ్య క‌నిపిస్తోంది. అంద‌రిలో ఆస‌క్తి రేపుతున్న భీమ‌వ‌రం లో టీడీపీ రేసులో క‌నిపించ‌డం లేదు. జ‌న‌సేన , వైసీపీ మ‌ధ్య హోరాహోరీగా స‌మ‌రం త‌ప్ప‌ద‌నిపిస్తోంది.

ప్ర‌స్తుత అంచ‌నాల ప్ర‌కారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో

మొత్తం స్థానాలు -15
వైసీపీకి అనుకూలంగా -8
టీడీపీ- 3
గ‌ట్టిపోటీ -4






Related News

గెలిచినా అది మానేది లేదంటున్న నాగ‌బాబు!

Spread the loveజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రుడు ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో న‌ర్సాపురం ఎంపీ సీటుకి పోటీ ప‌డిన సంగ‌తిRead More

Latest Survey: ప‌గోలో ఎవ‌రిది పై చేయి?

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు ప్ర‌త్యేక ప్ర‌ధాన్య‌త ఉంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ హ‌వాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *