మంత్రిగారి సెప‌రేట్ స్వ‌తంత్ర్య‌దినోత్స‌వం ..!

ks javahar
Spread the love

ఏపీలో ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాలు కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. తాజాగా స్వ‌తంత్ర్య‌దినోత్స‌వం కూడా త‌మ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా మార్చేసుకోవ‌డం కొత్త ప‌రిణామం. అనూహ్య‌మే అయినా అమాత్యుడు త‌ల‌చుకుంటే అడ్డంకి ఏముంద‌న్న‌ట్టుగా మారిపోయింది. అంతే ప‌శ్చిమ‌లో అధికారులు ప‌రుగులు పెట్ట‌క త‌ప్ప‌లేదు. హుటాహుటీన రెండు చోట్ల జెండా వంద‌నానికి త‌గ్గ‌ట్టుగా ఏర్పాట్లు చేయ‌క త‌ప్ప‌లేదు. దాంతో ఈ ప‌రిణామం జిల్లా వాసుల‌ను విస్మ‌య ప‌రిచింది.

ఏపీ ప్ర‌భుత్వం ఆదేశాల ప్ర‌కారం అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అధికారికంగా స్వ‌తంత్ర్య‌దినోత్స‌వం నిర్వ‌హించారు. అన్ని చోట్ల ఇన్ఛార్జ్ మంత్రులు జెండావిష్క‌ర‌ణ‌లు చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు కాని వారు కొంద‌రికి అలాంటి అవ‌కాశం ద‌క్క‌లేదు., అలాంటి జాబితాలో సీనియ‌ర్ మంత్రి కేఈ కూడా ఉన్నారు. కానీ ఆయ‌న మాత్రం స‌ర్థుకుపోయారు. సొంత జిల్లాలోనే అవ‌కాశం ఉన్న చోట జెండా ఎగుర‌వేసి సంతృప్తి ప‌డ్డారు. కానీ అదే స‌మ‌యంలో మ‌రో మంత్రి కేఎస్ జ‌వ‌హార్ మాత్రం దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. ఇన్ఛార్జ్ మంత్రిగా ప్ర‌త్తిపాటి పుల్ల‌రావు ఏలూరులో జెండా వంద‌న చేస్తుంటే అదే స‌మ‌యంలో పోటీగా మంత్రి జ‌వ‌హార్ కొవ్వూరులో జెండావిష్క‌ర‌ణ చేశారు.

అయితే జిల్లా కేంద్రంలో జ‌రిగిన‌ట్టుగానే కొవ్వూరులో కూడా ఆర్డీవో పేరుతో ఆహ్వాన‌ప‌త్రాల పంపిణీ, శ‌క‌టాల ఏర్పాటు జ‌ర‌గ‌డం విచిత్రం. అంత‌కుమించి జిల్లాలో అధికారుల‌కు ప్ర‌భుత్వం అవార్డులిస్తుండ‌గా కొవ్వూరులో మంత్రి కొత్త‌గా అవార్డులు అందించ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశంగా మారింది. మంత్రి జ‌వ‌హార్ తొలిసారి ఎమ్మెల్యే.. అయినా సామాజిక స‌మీక‌ర‌ణాల్లో మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. అయిన‌ప్ప‌టికీ అధ‌కారిక నిబంధ‌న‌లు తోసిరాజ‌ని, త‌న‌కు న‌చ్చిన రీతిలో వ్య‌వ‌హ‌రించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. జెండావంద‌న చేయ‌డం బాధ్య‌తే అయిన‌ప్ప‌టికీ దానికి సంప్ర‌దాయాల‌ను ఉల్లంఘించ‌డం, త‌న‌కు న‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డాన్ని ప‌లువురు త‌ప్పుబ‌డుతున్నారు. మొత్తంగా జ‌వ‌హార్ సెప‌రేట్ స్వ‌తంత్ర్య దినోత్స‌వంతో వార్త‌ల‌కెక్క‌డం ఆస‌క్తిదాయ‌క‌మే.


Related News

TDP WEST PEETALA

బాబుతో పీతల సుజాత వైరం ముదిరింది…

Spread the loveఏపీలో అధికార పార్టీ వ్యవహారాలు ఆసక్తిగా మారుతున్నాయి. నేతల మధ్య విబేధాలు కొంప ముంచేస్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికేRead More

yanamala

యనమల సీన్ అయిపోయిందా..?

Spread the loveఆయన ఏపీలో ఆర్థికమంత్రి. అంతేకాదు టీడీపీలో సీనియర్ నేత. రాజకీయంగా అవగాహన ఉన్న నాయకుడే కాకుండా వివిధRead More

 • టీడీపీలో కుర్చీలాట‌
 • నీళ్లేవి బాబు..!
 • ఆర్ నారాయణ మూర్తిని అడ్డుకున్నారు
 • ముద్రగడ మాట మార్చేశారా
 • బెట్టింగ్, భూ ఆక్రమణే బాబు ఎజెండా
 • నంద్యాల చేతుల్లో కాకినాడ భవితవ్యం
 • ఓవర్ టూ కాకినాడ..
 • టీడీపీ ఆఖరి ఆశలు గల్లంతు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *