ప్రజారాజ్య పౌరుడిని టార్గెట్ చేసిన జనసైన్యం

ఆయన ప్రజారాజ్యంలో కీలక నేత. నేటికీ మెగాస్టార్ మాటకు విలువ ఇస్తుంటారు. సన్నిహితంగా మెలుగుతుంటారు. కానీ ఆయనంటే జనసైన్యానికి గిట్టడం లేదు. జనసేన అధినేత సైతం ఆయన మీద గురిపెట్టడంతో కింది స్థాయి కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. ఊరూవాడ ఆయన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యంగా సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్న ఆయన్ని చిక్కుల్లో నెట్టడానికి కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. దాంతో తూర్పు గోదావరిజిల్లా రాజకీయాల్లో ఇదో ఆసక్తికర పరిణామంగా మారుతోంది. ముఖ్యంగా కాకినాడ రూరల్ లో మాజీ ఎమ్మెల్యే కన్నబాబు తో జనసేన పదే పదే కయ్యానికి దిగుతున్న తీరు చర్చనీయాంశం అవుతోంది.
పవర్ స్టార్ అభిమానులకు ఓ లక్షణం ఉంది. అది సినిమా సంస్కృతి నుంచి వచ్చిన అలవాటు. అయినా రాజకీయాల్లో కూడా కొనసాగిస్తున్నారు. గతంలో రామ్ గోపాల్ వర్మ, కత్తి మహేష్ వంటి విమర్శకులతో అలానే కయ్యానికి దిగారు. చేతులు కాలిన తర్వాత సైలెంట్ అయిపోయారు. సినీ హీరోగా కొంత ఫర్వాలేదు గానీ ఇలాంటి ఒరవడి ఒప్పుడు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. తమ పార్టీని, అధినేతను విమర్శించిన వారిని సోషల్ మీడియాలో ట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా వారి జాబితాలో నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చేరిన సంగతి తెలిసిందే. అయితే కొందరు జనసైనికులు మరో అడుగు ముందుకేసి సోషల్ మీడియాతో పాటు బయట కూడా ఎదుటివారిని నియంత్రించేందుకు పూనుకుంటున్నారు.
కాకినాడ రూరల్ సీటు నుంచి గతంలో ప్రజారాజ్యం తరుపున గెలిచి, ఆ తర్వాత చిరంజీవి వెంట కాంగ్రెస్ లోకి వెళ్లిన కన్నబాబు మొన్నటి ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గుర్తించదగిన స్థాయిలో ఓట్లు తెచ్చుకుని తన స్టామినా చాటుకున్నారు. కాపు సామాజికవర్గం ఆయనకు అండగా నిలవడంతో నలభై వేల ఓట్లతో అందరినీ ఆకర్షించారు. ఆ తర్వాత వైసీపీలో చేరి జిల్లాలోనే ఆపార్టీకి కీలకనేతగా మారారు. అయితే ఇటీవల పవన్ కాకినాడ పర్యటనలో నిర్వహించిన సభకు ఎక్కువమంది హాజరుకాకుండా కన్నబాబు అడ్డుకున్నారని జనసేన భావిస్తోంది. అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా అలాంటి అభిప్రాయం కలగడంతో రామచంద్రాపురం సభలో కన్నబాబు మీద గురిపెట్టి గురిపెట్టారు.
దాంతో ఇక జనసైనికులకు హద్దులు లేకుండా పోయాయి. కన్నబాబుని అడ్డుకోవడానికి అవకాశం ఉన్న ప్రతీచోటా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాపు వనసమారాధనలో భాగంగా ఇలాంటి ప్రయత్నం జరగడంతో కన్నబాబు సైలెంట్ అయిపోయారు. కానీ రెండోసారి కూడా అలాంటి ప్రయత్నమే జరగడంతో ఆయనతో పాటుగా కన్నబాబు అనుచరులు కూడా ఎదురుదిరిగారు. పోటీపోటీ నినాదాలతో పొలిటికల్ హీటు రాజేశారు. దాంతో కొందరు కాపు పెద్దలు జనసేన శ్రేణులను మందలించాల్సి వచ్చింది. కాపులంతా జనసేనానితో ఉండాల్సిందే, లేకుంటే సహించమన్నట్టుగా కొందరు చేష్టలుండడం తగదని చెబుతున్నారు. కులం వేరు. రాజకీయాలు వేరు అన్నది మరచిపోకూడా కులాలు , పార్టీలు మిళితం చేయాలని చూస్తే గతంలో చవిచూసిన ఫలితాలు పునరావృతం అవుతాయని హెచ్చరిస్తున్నారు.
అయినా యువతరంలో ఉన్న అవేశం చల్లారేలా కనిపించడం లేదు. కన్నబాబుకి వ్యతిరేకంగా మరింత ముందుకెళ్లే ఆలోచన చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు, వచ్చే ఎన్నికల్లో తనకు ఆటంకాలు కలిగించేందుకు జనసేన చేస్తున్న ప్రయత్నాలు తిప్పికొట్టేందుకు కన్నబాబు కూడా కసరత్తులు చేస్తున్నారు. దాంతో ఇదో హాట్ టాపిక్ మారుతోంది. ఆసక్తిని రాజేస్తూ చివరకు ఎటు దారితీస్తుందోననే అభిప్రాయంతో అందరి దృష్టి కాకినాడ రూరల్ నియోజకవర్గంపై పడేలా చేస్తోంది.
Related News

జనసేనలో మరో పోలీస్ అధికారి
Spread the loveవారం క్రితం రిటైర్మెంట్ తీసుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఏలూరు రేంజ్ డీఐజీగాRead More

పార్టీ మారిన చినరాజప్ప సోదరుడు
Spread the loveటీడీపీ నేతలకు సొంత ఇంట్లోనే సానుకూలత కనిపించడం లేదు. ఇప్పటికే వర్ల రామయ్య, బుద్ధా వెంకన్న వంటిRead More