ఏపీలో మ‌రో ఎన్నిక‌లు

kakinada
Spread the love

ఏపీలో ఇప్ప‌టికే నంద్యాల ఎన్నిక‌ల వేడి రాజుకుంది. భారీ బ‌హిరంగ‌స‌భ‌తో విప‌క్షం ఊపుమీదుంది. ఈలోగానే మ‌రో ఎన్నిక‌ల నోటిఫికేషన్ విడుద‌ల‌య్యింది. కాకినాడ మునిసిప‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం అయ్యింది. రాయ‌ల‌సీమ‌లో ఉప ఎన్నిక‌లు, గోదావ‌రి జిల్లాల్లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌తో ఓట‌ర్ల నాడి తెలుసుకునే అవ‌కాశం రాబోతోంది. అయితే ఎన్నిక‌లు జ‌రుగుతాయా అన్న అనుమానం మాత్రం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే సుదీర్ఘ‌కాలంగా కాకినాడ కార్పోరేష‌న్ ఎన్నిక‌లు పెండింగ్ లో ఉన్నాయి. దాంతో కోర్ట్ సీరియ‌స్ కావ‌డంతో చివ‌ర‌కు ఈ నోటిపికేష‌న్ విడుద‌ల అయినట్టు క‌నిపిస్తోంది. కానీ ఎన్నిక‌లు స‌జావుగా సాగుతాయా అన్న సందేహం మాత్రం కొన‌సాగుతోంది.

ఒక వేళ ఎన్నిక‌ల‌కు అడ్డంకులు తొల‌గిపోతే తాజా షెడ్యూల్ ప్ర‌కారం ఆగ‌ష్ట్ 29న పోలింగ్ జ‌రుగుతుంది. సెప్టెంబ‌ర్ 1 న ఫ‌లితాలు వెలువ‌డ‌తాయి. అంటే నంద్యాల ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత కాకినాడ కార్పోరేష‌న్ పోలింగ్ జ‌రుగుతుంది. అదే జ‌రిగితే దాని ప్ర‌భావం ఖ‌చ్చితంగా ఉంటుంది. కాకినాడ‌లో ఇప్ప‌టికే కాపుల ఉద్య‌మం ప్ర‌భావం ప‌డుతుంది. దానికి తోడు నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌భావం కూడా క‌న‌బ‌డితే విప‌క్షానికి కొంత ఊపు వ‌స్తుంది. కానీ అధికార‌ప‌క్షానికి అన్ని హంగులు క‌నిపిస్తున్నాయి. కాబ‌ట్టి ఫ‌లితాలు ఆస‌క్తిదాయ‌క‌మే.

పార్టీల ప‌రంగా చూస్తే జ‌న‌సేన కి కొంత ప్రాధాన్య‌త ఉంటుంది. ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి. ఇక టీడీపీలో వ‌ర్గ‌పోరు చ‌ల్లార‌లేదు. వైసీపీలో విబేధాలు తీవ్రంగా ఉన్నాయి. బీజేపీ త‌న మిత్ర‌బంధం కొన‌సాగిస్తుందో లేదో చూడాలి. ఏమైనా అన్ని పార్టీల‌కు ప‌రీక్షాకాల‌మే అని చెప్ప‌వ‌చ్చు. 50 డివిజ‌న్లున్న కాకినాడ‌లో మునిసిపాలిటీగా ఉన్న‌ప్ప‌టి నుంచి కాంగ్రెస్ హ‌వా సాగేది. తొలి కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ అభ్య‌ర్థే గెలిచారు. ప్ర‌స్తుతం ఆపార్టీ గ‌డ్డుస్థితిలో ఉంది. ఇక మేయ‌ర్ సీటు జ‌న‌ర‌ల్ మ‌హిళ‌గా రిజ‌ర్వ్ అయిన‌ట్టు చెబుతున్నారు. దాంతో ప‌లువురు బ‌డా నేత‌ల కుటుంబీకులు రంగంలో దిగాల‌ని ఆశిస్తున్నారు. కాకినాడ ఎంపీ తోట న‌ర‌సింహం భార్య తోట వాణి పేరువినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఆమె వీరవ‌రం స‌ర్పంచ్ గా ఉన్నారు. అదే విధంగా వాణిజ్య‌విభాగం నేత గ్రంథి బాబ్జీ కూడా కోడ‌లి కోసం సీటు ఆశిస్తున్నారు. వైసీపీ నుంచి ముత్తా కుటుంబం నుంచి రంగంలో ఉంటార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఆశావాహులు పెద్ద సంఖ్య‌లోనే క‌నిపిస్తున్నారు.


Related News

chinarajapp

చినరాజప్ప సీటు మారుతోంది…

Spread the loveఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప సీటు మారుతున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచిRead More

tdp

తారస్థాయిలో టీడీపీ తగాదా

Spread the love తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని టిడిపిలో గ్రూపుల పోరు రోజురోజుకూ పెరుగుతోంది. గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీRead More

 • ఏపార్టీ అయినా సరే అంటున్న తోట మాటల్లో ఏముందో?
 • కష్టాలు కొనితెచ్చుకుంటున్న వైసీపీ
 • యనమల అవుట్..
 • 22వ వికెట్ పడింది…
 • సంక్షోభంలో టీడీపీ
 • వైసీపీది తప్పే…
 • టీడీపీ ఎమ్మెల్యేల కొట్లాట
 • ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *