ఓవర్ టూ కాకినాడ..

tdp
Spread the love

సీన్ మారింది. నంద్యాల నుంచి కాకినాడకు మళ్లింది. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం ముగయడంతో అందరికన్నూ కాకినాడ వైపు మళ్లింది. నేతలందరి పయనం కాకినాడకు సాగుతోంది. అక్కడ ఎన్నికల్లో కూడా పాగా వేయాలని ప్రయత్నిస్తున్న పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఎన్నికల ప్రచార గడువు చాలా స్వల్పంగా ఉండడంతో టీడీపీ, వైసీపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.

ముఖ్యంగా తెలుగుదేశం అమాత్యులు కాకినాడకు క్యూ కట్టారు. దాదాపు 10మంది మంత్రులు ఇప్పుడు కాకినాడలో ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రతీ 5 డివిజన్లకు ఒక మంత్రి చొప్పున ఇన్ఛార్జ్ లను నియమించారు. వారితో పాటుగా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేతలు కూడా కాకినాడలోనే పాగా వేశారు. ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కీలక సామాజికవర్గాలయిన కాపు, మత్స్యకార, బ్రాహ్మణ, వైశ్య వర్గాలు ఇక్కడ ద్రుష్టిపెట్టాయి.

వారికి పోటీగా వైసీపీ కూడా అదే రీతిలో ప్రయత్నిస్తోంది. విజయసాయిరెడ్డి సారధ్యంలో వైసీపీ వ్యవహారాలు సాగుతున్నాయి. బొత్సా వంటి సీనియర్లు చేదోడుగా ఉంటున్నారు. ఎన్నికల్లో కాపులు తీవ్ర ఆగ్రహంగా ఉండడంతో టీడీపీకి బుద్ధి చెప్పడానికి మంచి అవకాశంగా వైసీపీ భావిస్తోంది. అదే సమయంలో సుదీర్ఘకాలంగా కాకినాడలో టీడీపీ వరుస పరాజయాలు పాలవుతున్న చరిత్ర కూడా ఉండడంతో దానిని సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. అనేక జిల్లాల నుంచి నేతలను భారీగా తరలించింది.

ఇక ఉభయపార్టీల నేతలు కూడా ప్రచారంలోకి రాబోతుండడం విశేషంగా మారింది. కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో పాగా వేయడం ద్వారా తూర్పున పట్టు సాధించే అవకాశం దక్కించుకోవాలని జగన్ ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఆయన కనీసంగా మూడు రోజులు ప్రచారం చేయబోతున్నారు. 27వ తేదీన ప్రచారగడువు ముగుస్తున్న తరుణంలో మధ్యలో వినాయక చవితి ఉండడంతో జగన్ టూర్ , షెడ్యూల్ వాటికనుగుణంగా రూపొందిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో సీఎం చంద్రబాబు కూడా ఈనెల 26న ప్రచారానికి రాబోతున్నారు. రెండు రోజుల పాటు నగరంలో పర్యటించే అవకాశం ఉంది. మొత్తంగా కాకినాడ ఎన్నికలను అత్యంత ప్రతిస్టాత్మకంగా ఉభయ పార్టీలు భావిస్తున్నాయన్నది స్పస్టం.


Related News

kandula durgesh

వైసీపీని వీడే యోచనలో సీనియర్ నేత

Spread the love1Shareసీనియర్ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. వైఎస్ హయంలో దక్కిన ఎమ్మెల్సీకి తోడు మంచి వాగ్దాటి ఉన్నRead More

9173_ysrcp-3

టీడీపీకి షాక్: వైసీపీలోకి కీలక నేత

Spread the love21Sharesగోదావరి జిల్లాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తున్న వైసీపీకి బలమైన నాయకుడు దొరికారు. చాలాకాలంగా టీడీపీలో ఉన్న సీనియర్Read More

 • వైసీపీలోకి మరో మాజీ ఎమ్మెల్యే
 • తూర్పున మరో తగాదా
 • చిక్కులు కొనితెచ్చుకున్న చినరాజప్ప
 • జగన్ కి కొత్త సమస్యలు షురూ
 • ప‌శ్చిమ టీడీపీలో చిచ్చు ..
 • రాధాకృష్ణ‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చిన బిరుదు…!
 • చిన‌రాజ‌ప్ప‌కి స్కెచ్ వేస్తున్న సొంత పార్టీ
 • జ‌గ‌న్ కి జై కొట్టిన మ‌రో సినీ న‌టుడు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *