టీడీపీకి జ‌న‌సేన షాక్

tdp-janasena-pawan-647x450
Spread the love

తెలుగుదేశం పార్టీకి షాక్ త‌ప్పేలా లేదు. ముఖ్యంగా జ‌న‌సేన మూలంగా టీడీపీ మూలాల‌కే దెబ్బ ప‌డ‌డం ఖాయంగా మారింది. ఇప్ప‌టికే గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన ప్ర‌భావం ప్రారంభ‌మ‌య్యింది. ప‌లువురు నేత‌లు టీడీపీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్ప‌టికే కొత్త‌పేట నియోజ‌క‌వ‌ర్గ మాజీ ఎమ్మెల్యే బండారు స‌త్యానంద‌రావు సోద‌రుడు టీడీపీని వీడి జ‌న‌సేన గూటిలో చేరారు. తాజాగా కాకినాడ న‌గ‌ర టీడీపీ సార‌ధిగా వ్య‌వ‌హ‌రించిన నున్నా దొర‌బాబు జ‌న‌సేన‌లో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దాంతో తెలుగుదేశం పార్టీకి గ‌డిచిన ఎన్నిక‌ల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన కాపు సామాజిక‌వ‌ర్గం నుంచి ప‌లువురు నేత‌లు జ‌న‌సేన వైపు చూస్తున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది.

తూర్పు గోదావ‌రి జిల్లాల్లో 2009లో కూడా ప్ర‌జారాజ్యం రాక సంద‌ర్భంగా టీడీపీకి పెద్ద గండి పడింది. అప్ప‌టి పార్టీ జిల్లా అధ్య‌క్షుడు జ్యోతుల నెహ్రూ కూడా టీడీపీని వీడి ప్ర‌జారాజ్యంలో చేరిపోయారు. ఆ త‌ర్వాత తోట త్రిమూర్తులు, వంగా గీత వంటి నేత‌లు కూడా చిరంజీవి ప‌క్క‌న చేరిపోయారు. దాంతో టీడీపీ తీవ్రంగా స‌త‌మ‌తం అయ్యింది. ఆ త‌ర్వాత కొంద‌రు నేత‌లు మ‌ళ్లీ టీడీపీలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇప్పుడు మ‌రోసారి జ‌న‌సేన వైపు చూస్తున్న‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా తోట త్రిమూర్తులు త‌న‌యుడు, తోట న‌ర‌సింహం వార‌సుడితో పాటు మ‌రికొంద‌రు నేత‌లు కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ శిబిరంలో ఛాన్స్ కోసం చూస్తున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

దానికి త‌గ్గ‌ట్టుగానే ద్వితీయ శ్రేణీ టీడీపీ నేత‌ల వ‌ల‌స‌లు ప్రారంభం కావ‌డంతో టీడీపీలో వ‌ణుకు మొద‌ల‌య్యింది. వారితో పలువురు మాజీలు కూడా జ‌న‌సేన వైపు చూస్తున్నారు. వంగా గీత స‌హా అనేక‌మందికి లైన్ క్లియ‌ర్ కావ‌చ్చ‌ని ప్ర‌చారం సాగుతోంది. అదే జ‌రిగితే మ‌రోసారి కీల‌క‌మైన కాపు నేత‌లంతా జ‌నసేన ను ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంది. అదే జ‌రిగితే తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ త‌ప్ప‌ద‌ని భావిస్తున్నారు.


Related News

narsapuram

ప‌శ్చిమ టీడీపీలో చిచ్చు ..

Spread the loveప్ర‌శాంత ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో చిచ్చు రాజుకుంది. ప‌చ్చ‌పార్టీ వ్య‌వ‌హారాల్లో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది. కీల‌క జిల్లాలో పార్టీRead More

abn md radha krishna

రాధాకృష్ణ‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చిన బిరుదు…!

Spread the loveప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారుతోంది. జ‌న‌సేన అధినేత తీరు రోజురోజుకి చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ట్విట్ట‌ర్ వేదిక‌గాRead More

 • చిన‌రాజ‌ప్ప‌కి స్కెచ్ వేస్తున్న సొంత పార్టీ
 • జ‌గ‌న్ కి జై కొట్టిన మ‌రో సినీ న‌టుడు
 • కీల‌క ప్రాంతంలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి
 • టీడీపీకి జ‌న‌సేన షాక్
 • ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా మాజీ మంత్రి!
 • వైసీపీలోకి సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య
 • టీడీపీకి క్లారిటీ వ‌చ్చేసింది…
 • గోదావ‌రిలో టీడీపీకి పెద్ద గండి…!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *