Main Menu

మూడు పార్టీల మ‌ద్ధ‌తు ఆయ‌న‌కే..!

Spread the love

రాజ‌కీయాలు చిత్రంగా ఉంటాయి. అందులోనూ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వ్య‌వ‌హారాలు మ‌రింత చిత్రంగా ఉంటాయి. నిత్యం పోటీ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో పోటీ ప‌డే పార్టీలు కూడా త‌మ బ‌లాల‌ను అనుస‌రించి బ‌రిలో దిగుతుంటారు. ఎమ్మెల్సీల‌ను అనేక‌మార్లు ఏక‌గ్రీవంగా ఎన్నుకుంటారు. కానీ ప‌ట్ట‌భ‌ద్రులు, ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గాల‌లో మాత్రం వేరుగా ఉంటుంది.

అదే స‌మ‌యంలో తాజాగా గోదావ‌రి జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల్లో దాదాపుగా మూడు ప్ర‌ధాన పార్టీల నేత‌లు ఒకే అభ్య‌ర్థిగా మ‌ద్ధ‌తు ప‌లుకుతుండ‌డం విశేషంగా క‌నిపిస్తోంది. ప్ర‌త్య‌క్షంగా అన్ని పార్టీలూ ఐవీకి అండ‌దండ‌లు అందిస్తున్న తీరు ఆశ్చ‌ర్యంగా చెప్ప‌వ‌చ్చు. నిజాయితీప‌రుడిగా పేరున్న రాము సూర్యారావు వార‌సుడిగా ఎమ్మెల్సీ బ‌రిలో దిగిన నిబ‌ద్ధ‌త క‌లిగిన నేత ఇళ్ల వెంక‌టేశ్వ‌ర రావు సార‌ధ్యం అంద‌రికీ ఆమోదం ల‌భించ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తోంది.

ఆయ‌న మీద పోటీ చేస్తున్న వారిలో వివిద పార్టీల నేత‌లుండ‌డం, వారి మీద గ‌తం నుంచి ఉన్న ఆరోప‌ణ‌లు, కార్పోరేట్ విద్యాసంస్థ‌ల అధినేతలుగా త‌మ సొంత క‌ళాశాల‌ల‌ను యూనివ‌ర్సిటీ స్థాయికి పెంచుకోవాల‌నే కాంక్ష‌తో బ‌రిలోకి రావ‌డం వంంటి కార‌ణాల‌తో ఇప్పుడు సాధార‌ణ పట్ట‌భ‌ద్రులు కూడా ఐవీ ప‌ట్ట మొగ్గు చూపుతున్నారు. దాంతో వివిధ పార్టీల నేత‌లు కూడా ఆయ‌న‌కు అండ‌దండ‌లు అందించేందుకు ముందుకు వ‌స్తున్నారు. అధికార‌, విప‌క్ష పార్టీల‌తో పాటు జ‌న‌సేన కూడా త‌న విధానాల్లో భాగంగా ఐవీ వంటి నేత‌ల‌కు అండ‌దండ‌లు అందించ‌డం అవ‌స‌రమ‌ని భావిస్తున్న‌ట్టు చెబుతున్నారు.

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని టీడీపీ ఎమ్మెల్యేలంతా ఐవీకి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. నేరుగా త‌మ పార్టీ అభ్య‌ర్థి పోటీలో లేక‌పోవ‌డంతో అనుచ‌రులంద‌రినీ ఐవీకి తోడ్పాటు నివ్వాల‌ని కోరుతున్నారు. ఇక వైసీపీ కూడా అదే నిర్ణ‌యం తీసుకుంది. జ‌న‌సేన నేరుగానే త‌న మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వామ‌పక్షాల తోడ్పాటు కూడా ఉండ‌డం, వివిధ ఉద్యోగ‌, కార్మిక‌, ఉపాధ్యాయ సంఘాల మ‌ద్ధ‌తు కూడా ఉండ‌డంతో ఐవీకి న‌ల్లేరు మీద న‌డ‌క‌గా మారుతుంద‌ని విశ్లేష‌కులు సైతం అంచ‌నాలు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఐవీకి అన్ని వ‌ర్గాల్లోనూ ఆద‌ర‌ణ ల‌భించ‌డం ప‌ట్ల ఆయ‌న అనుచ‌రులు సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. గోదావ‌రి జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రులు నిరాడంబ‌ర‌, నిజాయితీ నేత‌ను ఎన్నుకోవ‌డం ద్వారా స‌మాజానికి మంచి సంకేతం పంపిస్తార‌ని భావిస్తున్నారు.






Related News

హ‌ర్ష‌కుమార్ కి అలా… స‌బ్బం హ‌రికి ఇలా!

Spread the loveతెలుగుదేశం పార్టీ అధినేత అనూహ్య నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఏకంగా కాళ్లు మొక్కిన నేత‌ల‌ను కూడా క‌నిక‌రించ‌లేదు. జ‌గ‌న్Read More

మ‌ళ్లీ గోదారోడే..!

Spread the loveగోదారోళ్లంటే అనురాగాల‌కు, అప్యాయ‌త‌ల‌కు పేరు అని చెబుతారు. ఆతిథ్యానికి పెట్టింది పేరుగా క‌నిపిస్తారు. హాస్యానికి, వ్యంగ్యానికి కేరాఫ్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *