వైసీపీ ఎమ్మెల్యే ఇంటిపై దాడులు

1736_ysrcp
Spread the love

తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌కీయాల్లో వేడి రాజుకుంది. వైసీపీ ఎమ్మెల్యే ఇంటిపై ఇన్ క‌మ్ ట్యాక్స్ దాడుల ప‌రంప‌ర సాగుతోంది. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో పాటు ఆయ‌న బంధువుల ఇళ్ల‌లోనూ సోదాలు సాగుతున్నాయి. తూగో జిల్లాలో వైసీపీ త‌రుపున ఐదుగురు ఎమ్మెల్యేలు గెల‌వ‌గా వారిలో ఇద్ద‌రు టీడీపీలోకి ఫిరాయించారు. ఇక మిగిలిన వారిలో ఒక‌రు రంప‌చోడ‌వరం ఏజ‌న్సీ ప్రాంత ఎమ్మెల్యే కాగా మ‌రొక‌రు కొత్త పేట ఎమ్మెల్యే. వారిద్ద‌రికీ భిన్నంగా దాఢిశెట్టి రాజా ఇటీవ‌ల ప్ర‌భుత్వంపై దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దివీస్ వ్య‌వ‌తిరేక ఉద్య‌మానికి అండ‌గా నిల‌బ‌డ్డారు. ఈ నేప‌థ్యంలో రాజా ఇంటి మీద దాడులు చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి.

ఎంఎల్‌ఎ దాడిశెట్టి రాజా నివాసంపై ఆదాయ పన్నులశాఖ అధికారులు నిర్వహించారు. విశాఖపట్నం ఆదాయ పన్నులశాఖ అదనపు కమిషనర్‌ మూర్తినాయక్‌ ఆధ్వర్యాన 46 మంది ఎనిమిది బృందాలుగా ఏర్పడి ఈ దాడుల్లో పాల్గొన్నారు. తుని పట్టణంలోని లక్ష్మీగణపతి, వెంకన్నబాబు, వెంకట ధనలక్ష్మి, దాడిశెట్టి నరసయ్య, జ్యూయలరీ షాపులపై, సురేష్‌కుమార్‌ ఆసుపత్రి, తల్లిపిల్లల ఆసుపత్రిపై, వైద్యుల ఇళ్లలోనూ ఐటి అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు.
dadisetti raja

వైద్యుల నివాసంలో భారీగా నగదు, వివిధ ఆస్తుల పత్రాలు దొరికినట్టు సమాచారం. జ్యూయలరీ షాపుల్లో అధిక మొత్తంలో బంగారం నిల్వలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఎంఎల్‌ఎ రాజా నివాసంలో తనిఖీలు చేపట్టగా కేజీన్నర బంగారం ఉన్నట్టు గుర్తించారు. దాడులు కొనసాగుతున్నట్టు మూర్తినాయక్‌ తెలిపారు. సోదాలు జరుగుతున్నాయని, పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో వివరాలను అందిస్తామని నాయక్‌ చెప్పారు. దాంతో ఈ దాడుల వెనుక రాజ‌కీయ కారణాలున్నాయా అన్న అనుమానం బ‌య‌లుదేరింది.


Related News

kakinada

టీడీపీ ఆఖరి ఆశలు గల్లంతు

Spread the loveపరిస్థితులు అనుకూలించకపోతే తాడే పామై కరుస్తుందన్న చందంగా మారింది. తాజాగా కోర్టు తీర్పులు కూడా తెలుగుదేశం పార్టీకిRead More

ysrcp-party-flag-647x450

వైసీపీకి భారంగా పార్టీ అధ్యక్షుడు

Spread the loveవైసీపీకి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు విజయమో..వీరస్వర్గమో అన్నట్టుగా మారిపోయాయి. గత సాధారణ ఎన్నికల తర్వాత రాష్ట్రస్థాయిలో ఆసక్తిRead More

 • మంత్రిగారి సెప‌రేట్ స్వ‌తంత్ర్య‌దినోత్స‌వం ..!
 • సినిమా ఛాన్స్ ఆశ చూపి దర్శకుడి అత్యాచారం
 • కాపు చైర్మ‌న్ కి అవ‌మానం: తోట లేట్ ఎంట్రీ..!
 • వైసీపీకి ఎదురుదెబ్బ‌..!
 • టీడీపీలో గుబులు రేపిన తోట‌
 • వాళ్లిద్ద‌రికీ టికెట్ లేద‌ని చెప్పిన చంద్ర‌బాబు..!
 • కాకినాడ ఎన్నిక‌లు: ఎవ‌రి బ‌లం ఎంత‌?
 • ఏపీలో మ‌రో ఎన్నిక‌లు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *